E-Paper
Advertisement

Delhi Crime: ప్రియుడి వివాహం.. షాకైన ప్రియురాలు, మత్తుతో కలిపిన పాలిచ్చి ఆపై కటింగ్

Delhi Crime: ప్రియుడి వివాహం.. షాకైన ప్రియురాలు, మత్తుతో కలిపిన పాలిచ్చి ఆపై కటింగ్
Advertisement

Delhi Crime: దేనికైనా హద్దు పద్దు ఉంటుంది.  తేడా వస్తే పరిణామాలు దారుణంగా ఉంటాయి. ఈ మధ్యకాలంలో చాలామంది యువతీ యువకులు ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. పేరెంట్స్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. వివాహం చేసుకున్న ఓ వ్యక్తి, మరొక యువతితో ప్రేమలోకి దిగాడు. రెండేళ్లు తర్వాత సీన్ రివర్స్ అయ్యింది. ఫలితంగా ఇంటికి పిలిచి ప్రియుడి ప్రైవేటు పార్ట్స్ కట్ చేసింది ప్రియురాలు. సంచలనం రేపిన ఈ ఘటన ఢిల్లీలో వెలుగు చూసింది.

ఢిల్లీలో దారుణం.. ప్రియుడి పెళ్లి అయ్యిందని తెలిసి ప్రియురాలు షాక్

Advertisement

ఢిల్లీలోని వజీరాబాద్‌లో ఉంటోంది అమీనా ఖాతూన్‌. ఈమె సొంతూరు బీహార్‌లోని కటిహార్‌ ప్రాంతం. యూపీలోని రాంపూర్‌కు చెందిన ఆర్‌ఎంపీ డాక్టర్ విసర్జీత్‌‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య ప్రేమయాణం దాదాపు రెండేళ్లు సాగింది. హాయిగా సాగుతున్న వీరి లవ్ ట్రాక్‌లో కొత్త విషయాలు వచ్చాయి. విషయం ఏంటంటే.. తన ప్రియుడు విసర్జీత్‌‌కు వివాహం అయిన విషయం యువతికి ఆలస్యంగా తెలిసింది.

అసలు విషయం తెలిసి రగిలిపోయింది. తనను నమ్మించి మోసం చేశాడంటూ ఆగ్రహానికి గురైంది. తనలాంటి పరిస్థితి మరొకరికి రాకూడదని భావించింది. ప్రియుడి విషయం తెలియకుండా జాగ్రత్త పడింది. ఫిబ్రవరి 24న అమీనా వద్దకు డాక్టర్ బాబు వచ్చాడు. ఆ రోజు రాత్రి ప్రియుడికి మత్తు పదార్థం కలిపిన పాలు ఇచ్చింది. తాగిన కాసేపటికి అతడు మత్తులోకి జారుకున్నాడు.

Advertisement

ప్రియుడికి మత్తుతో కలిపిన పాలిచ్చి ఆపై ప్రైవేట్ పార్ట్స్ కటింగ్

ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పదునైన కత్తితో ప్రియుడి ప్రైవేటు పార్ట్స్‌ని కట్ చేసింది.  అక్కడి నుంచి పరారైంది. మత్తు వదిలేసరికి డాక్టర్ ప్రియుడికి బెడ్ నిండా రక్తం కనిపించడంతో షాకయ్యాడు. వెంటనే సమీపంలోని హిందూరావ్‌ ఆసుపత్రిలో చేశాడు విసర్జీత్‌. ఆసుపత్రి అధికారుల సమాచారంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాధితుడి సొంతూరు యూపీలోని రాంపూర్‌కు చెందినవాడు.

బీహార్‌లోని కటిహార్‌ ప్రాంతానికి  చెందినది యువతి. యువతిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. బాధితుడు పరిస్థితి కాస్త మెరుగైనట్టు తెలుస్తోంది. ఆసుపత్రికి చేరుకుని మెడికో-లీగల్ సర్టిఫికేట్ సేకరించిన తర్వాత బాధితుడి వాంగ్మూలాన్ని నమోదు చేశారు పోలీసులు. నమ్మించి మోసం చేసినందుకు యువతి ఈ విధంగా చేసిందని పోలీసులు నిర్ధారణకు వచ్చాయి. యువతి కోసం గాలింపు మొదలుపెట్టారు.

ALSO READ: గచ్చిబౌలిలో బెంజ్ కారు బీభ‌త్సం.. నిందితుడిని పట్టుకున్న కానిస్టేబుల్ నరసింహ

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×