BigTV English

Woman Murder Cement: యువతిని చంపి శవంపై సిమెంట్ పోసి.. హంతకుడు ఎలా చేశాడంటే?..

Woman Murder Cement: యువతిని చంపి శవంపై సిమెంట్ పోసి.. హంతకుడు ఎలా చేశాడంటే?..

Woman Murder Cement| ఇంటి నుంచి స్నేహితులను కలిసేందుకు వెళుతున్నానని చెప్పి బయలు దేరిన యువతి తిరిగి రాలేదు. రెండు రోజులైనా ఆమె ఫోన్ కూడా స్విచాఫ్ వస్తోంది. పోలీసులు ఆమె కోసం వెతుకుతుండగా.. ఆమె శవం సిమెంట్ కాంక్రీటులో లభించింది. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్ నగరంలో జరిగింది.


వివరాల్లోకి వెళితే… నాగ్ పూర్ నగరంలోని కైలాశ్ నగర్ ప్రాంతానికి చెందిన అజయ్ వాంఖేడే అనే 33 ఏళ్ల యువకుడు భారత సైన్యంలో జవానుగా నాగాల్యాండ్ రాష్ట్రంలో ఉద్యోగం చేస్తున్నాడు. రెండు నెలల క్రితం సెలవుపై ఇంటికి వచ్చాడు. అజయ్ పెళ్లి కోసం మ్యాట్రీమోనీ వెబ్ సైట్ ఓ యాడ్ ఇచ్చాడు. అలా అతనికి జ్యోతి ఆక్రే అనే 32 ఏళ్ల యువతితో పరిచయం ఏర్పాడింది. వారిద్దరీ మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరూ గాఢంగా ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకుందామనుకున్నారు. కానీ వారిద్దరికీ పెళ్లి చేసుకునే అదృష్టం లేదు. జ్యోతితో పెళ్లికి అజయ్ తల్లిదండ్రులు అంగీకరించలేదు. కారణం.. అప్పటికే జ్యోతి ఒకసారి పెళ్లి చేసుకుంది.

Also Read: కుటుంబాన్ని పోషించడానికి ఆ పనిచేస్తున్న మహిళ.. ప్రశంసల వర్షం కురిపిస్తున్న నెటిజెన్లు!


జ్యోతి మొదటి భర్త నుంచి విడాకులు తీసుకున్నాక.. మరోసారి పెళ్లి చేసుకుందామని మ్యాట్రిమోనీ సైట్ లో వరుడు కోసం వెతుకుతుండగా.. ఆమెకు అజయ్ పరిచయమయ్యాడు. కానీ అజయ్ తో పెళ్లికి అతని తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో అజయ్ ఆమెకు కొన్ని రోజులుగా దూరంగా ఉన్నాడు. ఆమె తరుచూ అజయ్ కు ఫోన్ చేసేది. అజయ్ కూడా కొన్ని రోజుల్లో తన తల్లిదండ్రులను ఒప్పించి తరువాత పెళ్లి చేసుకుంటానని ఆమెకు మాటిచ్చాడు. కానీ ఆ తరువాత నుంచి అజయ్ ఆమెకు ఎప్పుడూ ఫోన్ చేయలేదు.

అజయ్ కోసం భగ్న ప్రేమికురాలిగా జ్యోతి ఎదురు చూసి చూసి.. చివరికి అతని ఇంటికి ఒకరోజు వెళ్లింది. కానీ అక్కడ అతను లేడు. అలా నెల రోజుల తరువాత అజయ్ స్నేహితుడొకడు కనిపించాడు. అజయ్ గురించి అతడిని జ్యోతి ఆరా తీసింది. అతడి ద్వారా అజయ్ కొత్త ఫోన్ నెంబర్ సంపాదించింది. అయితే అజయ్ గురించి మరో షాకింగ్ విషయం తెలిసింది. అజయ్ మరో యువతిని పెళ్లి చేసుకున్నాడని అతని స్నేహితుడు జ్యోతికి చెప్పాడు. దీంతో జ్యోతి షాక్ కు గురైంది.

మరోవైపు అజయ్ కు అతని స్నేహితుడు ఫోన్ చేసి జ్యోతి అతని కోసం వెతుకుతోందని చెప్పాడు. ఊహించినట్లే జ్యోతి అజయ్ కు ఫోన్ చేసింది. అజయ్ ఆమెను నాగ్‌పూర్ లోని వార్ధా రోడ్డు వద్ద ఆగస్టు 28న రమ్మన్నాడు. జ్యోతి ఒక ఆటోమొబైల్ షాపులో ఉద్యోగం చేస్తోంది. ఆ రోజు ఉద్యోగం చేశాక.. తల్లిదండ్రులు ఫోన్ చేసి తాను తన స్నేహితురాలి ఇంటికి వెళుతున్నానని మరుసటి రోజు వస్తానని చెప్పి వెళ్లింది. జ్యోతి వార్ధా రోడ్డులోకి బస్ స్టాప్ వద్దకు వెళ్లే సరికి అక్కడ ముందుగానే అజయ్ ఆమె కోసం ఎదరుచూస్తున్నాడు.

అజయ్ ఆమెను చూసి ఎంతో సంతోషంగా కౌగిలించుకున్నాడు. ఆ తరువాత ఆమెను ఒక లాడ్జింగ్ తీసుకుబోయి ఆమెతో శృంగారం చేశాడు. అక్కడ జ్యోతి అతనితో మాట్లాడుతూ.. తాను గర్భవతి అని చెప్పింది. అజయ్ కూడా ఆమెనే ప్రేమిస్తున్నట్లు చెప్పాడు. తనకు బలవంతంగా తన తల్లిదండ్రులు మరొక యువతితో పెళ్లి చేశారని.. కానీ తాను మాత్రం ఆ మరో యువతిని వదిలేస్తానని చెప్పాడు. దీంతో జ్యోతి వెంటనే గుడికి వెళ్లి పెళ్లి చేసుకుందామని అజయ్ ను కోరింది. తాను గర్భవతి అనే విషయం అజయ్ తల్లదండ్రులకు చెప్పాలని అడిగింది. అజయ్ అందుకు అంగీకరించలేదు. సమయం వచ్చినప్పుడు చెబుతానని అన్నాడు. కానీ జ్యోతి అందుకు సమయం లేదని అందరికీ ఈ విషయం తెలిస్తే తనకు సమస్యగా మారుతుందని చెప్పింది.

Also Read: పిజ్జా తిన్నందుకు యువతిని తుపాకీతో కాల్చిన బంధువులు.. ఇంట్లో తోడికోడళ్ల గొడవే కారణం!

జ్యోతి చెప్పిన మాటలకు అజయ్ ఇష్టం లేకపోయినా ఒప్పుకున్నాడు. మరుసటి రోజు ఉదయం ఇద్దరూ నాగ్ పూర నగరం బయట ఒక ఢాబాలో ఒక జ్యూస్ తాగారు. ఆ జ్యూస్ లో ముందుగానే అజయ్ మత్తుమందు కలిపాడు. ఆ తరువాత ఇద్దరూ కారులో వెళుతుండగా.. జ్యోతి స్పృహ తప్పింది. దీంతో అజయ్ వెంటనే ఊరి చివర అడవి ప్రాంతానికి ఆమెను తీసుకెళ్లి గొంతు నులిమి చంపేశాడు. ముందుగానే ప్లాన్ చేసి కారులో ఒక బస్తా సిమెంట్, సమాధి తవ్వడానికి సామాన్లు కారు డిక్కీలో తెచ్చాడు. ఒక సమాధి గుంత తవ్వి.. అందులో జ్యోతి శవాన్ని పెట్టి ఆ శవంపై సిమెంట్ నీరు కలిపిన కాంక్రీట్ పోశాడు.

ఆ తరువాత జ్యోతి ఫోన్ ని హైవేపై వెళుతున్న లారీలో పడేశాడు. మరోవైపు జ్యోతి రెండు రోజులైనా ఇంటికి రాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ ప్రారంభించి.. జ్యోతి ఫోన్ నెంబర్ కాల్ డేటా తీశారు. అందులో చివరి నెంబర్ అజయ్ ది ఉండడంతో అతడిని ప్రశ్నించారు. కానీ అజయ్ ముందుగా తనకు ఆరోగ్యం బాగోలేదని ఆస్పత్రిలో చేరాడు. ఆ తరువాత జిల్లా కోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ కోసం దరఖాస్తు చేశాడు. కానీ కోర్టు హత్య కేసులో బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. అయినా అజయ్ హై కోర్టులో మళ్లీ యాంటిసిపేటరీ బెయిల్ కోసం పిటీషన్ వేయగా.. అక్కడ కూడా బెయిల్ దొరకలేదు.

పోలీసులకు అజయ్ పై అనుమానం వచ్చి అతడిని అరెస్టు చేసి.. గట్టిగా ప్రశ్నించారు. దీంతో అజయ్ జరిగినదంతా చెప్పేశాడు. తనకు మరో యువతితో వివాహం జరిగిన తరువాత జ్యోతి గర్భవతి అని తెలియడంతో ఆమెను హత్య చేశానని చెప్పాడు. ఆ తరువాత ఆమె శవాన్ని పాతిపెట్టిన స్థలానికి పోలీసులను తీసుకెళ్లాడు. పోలీసులు జ్యోతి మృతదేశం వెలికి తీసి పోస్టు మార్టం కోసం తరలించారు. ప్రస్తుతం కేసు విచారణ కోర్టులో సాగుతోంది.

Related News

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

New Bride Incident: ఫ్రెండ్సే చంపేశారా? నవ వధువు కేసులో బిగ్ ట్విస్ట్!

Big Stories

×