BigTV English

Pizza Gun Shot: పిజ్జా తిన్నందుకు యువతిని తుపాకీతో కాల్చిన బంధువులు.. ఇంట్లో తోడికోడళ్ల గొడవే కారణం!

Pizza Gun Shot: పిజ్జా తిన్నందుకు యువతిని తుపాకీతో కాల్చిన బంధువులు.. ఇంట్లో తోడికోడళ్ల గొడవే కారణం!

Pizza Gun Shot| ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు కనిపించడమే అరుదు. దీనికి కారణం.. ఇంట్లో అందరూ కలిసి ఉండడానికి ఇష్టకపడకపోవడం, ఆడవాళ్ల మధ్య గొడవలు. అత్త కోడళ్ల మధ్య, వదిన మరదళ్ల మధ్య, చివరికి తోడి కోడళ్ల మధ్య కూడా గొడవలు జరుగుతూ ఉంటాయి. తాజాగా అలాంటి ఒక గొడవే చివరికి హత్యాయత్నం వరకు దారి తీసింది. కేవలం ఒక పిజ్జా తిన్నందుకు తన మరిది భార్యతో ఒక మహిళ గొడవ పడింది. మాటామాట పెరిగి చివరికి తుపాకీతో కాల్చేంత వరకు విషయం సీరియస్ అయింది. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది.


వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని సీలంపూర్ ప్రాంతంలో నివసించే జీషాన్ తన భార్య సాదియాతో కలిసి ఉంటున్నాడు. అయితే వారిది ఉమ్మడి కుటుంబం.. జీషాన్ తమ్ముడు, తమ్ముడి భార్య సాద్మ కూడా అదే ఉంటున్నారు. ఈ క్రమంలో ఇద్దరు తోడి కోడళ్లు సాదియా, సాద్మ మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి. ఒకరంటే మరొకరి పడేది కాదు. ఇటీవల ఒక రోజు జీషాన్ ఇంట్లో అందరికోసం పిజ్జాలు తీసుకొని వచ్చాడు. ఆ పిజ్జా ఒకటి తన తమ్ముడి భార్య సాద్మకు కూడా ఇచ్చాడు.

Also Read: విచిత్ర వివాహం.. 70 ఏళ్ల ముసలాడితో 25 ఏళ్ల యువతి పెళ్లి.. ఎలా కుదిరిందంటే?


సాద్మ ఆ పిజ్జా తినడం ప్రారంభించిందో లేదో.. జీషాన్ భార్య అక్కడికి వచ్చింది. తన భర్త తెచ్చిన పిజ్జా ఎలా తినబుద్ది అవుతోందని గొడవ చేసింది. ఆమె నొటి వద్ద నుంచి పిజ్జా లాగేసుకుంది. దీంతో ఇద్దరు మళ్లీ గొడవ పడ్డారు. అయితే ఈసారి కొట్టుకున్నారు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. దీంతో సాదియా తన పుట్టింటికి ఫోన్ చేసి తన తోడికోడలు తనను కొట్టింది అని చెప్పింది. ఇది విన్న ఆమె నలుగురు సోదరులు ఆమె ఇంటికి కోపంగా వచ్చారు. రావడంతోనే ఇంట్లో జీషాన్ తమ్ముడిని, అతడి భార్యను కొట్టారు. ఆ తరువాత సాద్మా వారిని తిట్టిపోసింది. దీంతో ఆ నలుగురిలో ముంతహిర్ అనే ఒకడు సాద్మా తలకు తన వద్ద తుపాకీతో కాల్చాడు. తుపాకీ కాల్పులు విని ఇరుగుపొరుగు వారు అక్కడికి వచ్చారు.

Also Read: సహజీవనం చేసిన వ్యక్తిపై రేప్ కేసు పెట్టిన యువతి.. ఈజీగా బెయిల్ తెచ్చుకున్న నిందితుడు.. ఎలాగంటే?

విషయం చుట్టుపక్కల వారందరికీ తెలిసిపోయింది. ఎవరో ఒకరు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సాదియా నలుగురు తమ్ముళ్లు అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. కానీ అందరూ కలిసి వారిని ఒక గదిలో బంధించారు. కానీ తుపాకీతో కాల్చిన ముంతహిర్ మాత్రం అక్కడి నుంచి తప్పించుకున్నాడు. మరోవైను సాద్మా ఇంకా బతికే ఉండడంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సాద్మా హత్యాయత్నం కేసు నమోదు చేసి సాదియా, ఆమె ముగ్గురు సోదరులను అరెస్టు చేశారు. తుపాకీతో కాల్చిన ముంతహిర్‌ పరారీలో ఉన్నాడు.

అలా ఇంట్లో ఆడవాళ్ల గొడవ కాస్త హత్యాయత్నం వరకు చేరింది.

Related News

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

New Bride Incident: ఫ్రెండ్సే చంపేశారా? నవ వధువు కేసులో బిగ్ ట్విస్ట్!

Big Stories

×