BigTV English

OTT Movie : కోరిక తీర్చమంటూ వెంటపడే దెయ్యం… క్రేజీ కొరియన్ హార్రర్ డ్రామా

OTT Movie : కోరిక తీర్చమంటూ వెంటపడే దెయ్యం… క్రేజీ కొరియన్ హార్రర్ డ్రామా

OTT Movie : ఈ రోజుల్లో కొరియన్ వెబ్ సీరీస్ లు ఓటిటి ప్లాట్ ఫామ్ లో హల్ చల్ చేస్తున్నాయి. ఎంతలా అంటే మన ప్రేక్షకులు సీరియల్స్ ఎలా చూస్తారో అలానే  వెబ్ సిరీస్ లను కూడా చూస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ లు కుటుంబంతో కలసి చూసే విధంగా ఉంటున్నాయి. ఒక హర్రర్ ఫాంటసీ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఫాంటసీ చిత్రాలను చూసే మూవీ లవర్స్ కు ఈ మూవీ బెస్ట్ సజెషన్. ఈ మూవీ పేరేమిటో ?ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.


నెట్ ఫ్లిక్స్ లో

ఈ మూవీలో హీరోయిన్ కి దయ్యాలు కనబడుతూ ఉంటాయి. వాటిని ఆమె ఎదుర్కోబోయే సీన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఇది ఒక కొరియన్ వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ పేరు “ఏ కొరియన్ ఒడిస్సీ”(A Korean Odyssey) ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

ఒక టీనేజ్ అమ్మాయి ఈ వెబ్ సిరీస్ లో హీరోయిన్. హీరోయిన్ కి దయ్యాలు కనబడుతూ ఉంటాయి. స్కూల్లో అందరూ ఈ అమ్మాయికి దయ్యాలు కూడా కనపడుతూ ఉంటాయని ఎగతాళి చేస్తారు. ఒకసారి స్కూల్ కి టీచర్ వస్తుంది. ఆమె టీచర్ కాదు, టీచర్ రూపంలో ఉన్న దయ్యం. ఆ దయ్యాన్ని హీరోయిన్ కనిపెట్టడంతో ఆమె దగ్గరకు వచ్చి నా కోరికలను నువ్వే తీర్చాలని వెంటపడి మాయం అవుతుంది. ఇంతలో ఒరిజినల్ టీచర్ అక్కడికి వచ్చి ఆ అమ్మాయిని ఏం జరిగిందని అడగగా అక్కడి నుంచి బయటకి వెళ్ళిపోతుంది. బయట ఒక టోపీ వ్యక్తి ఈ అమ్మాయిని ఫాలో అవుతూ ఆ దెయ్యాన్ని మాయం చేస్తాడు.

ఇంతలో ఆ టోపీ వ్యక్తి హీరోయిన్ ని ఒక సాయం అడుగుతాడు. ఇక్కడ ఒక సొరంగ మార్గం ఉంది. అందులో మంటలను ఆపగలిగే ఒక విసనకర్ర ఉంది. అది నువ్వు మాత్రమే తీసుకు రాగలవు అని చెప్తాడు. నువ్వు ఈ సాయం చేస్తే నా దగ్గర ఉన్న ఈ మంత్రాలు గొడుగు నీకు ఇస్తాను అని చెప్తాడు. హీరోయిన్ ఆ సొరంగ మార్గంలోకి వెళ్ళగా, అందులో ఒక అద్దాల మేడ కనబడుతుంది. అది చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. హీరోయిన్ ఆ విసనకర్రను గుర్తించి తీసుకోగా, ఆ అద్దాలమేడలో ఆమెకు అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. వాటిని ఆ అమ్మాయి ఎలా ఎదుర్కొంది? ఆ అద్దాల మేడ నుంచి ఆ అమ్మాయి బయటకి రాగలుగుతుందా? చివరికి దయ్యాల బారి నుంచి ఆమెను ఎవరు రక్షిస్తారు? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ కొరియన్ వెబ్ సిరీస్ ని తప్పకుండా చూడాల్సిందే. ఈ మూవీ A Korean Odyssey లో ఫాంటసీ, హర్రర్ సీన్స్ కళ్ళు చెదిరే విధంగా, చూపు పక్కకు తిప్పుకోకుండా ఉంటాయి.

Related News

OTT Movie : ప్రియురాలు పక్కనుండగా ఇవేం పాడు పనులు భయ్యా ? అల్టిమేట్ ట్విస్టులు… ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్

OTT Movie : స్టూడెంట్ ప్రైవేట్ ఫోటో లీక్… టీచర్ చేసే సైకో పనికి మెంటలెక్కల్సిందే

OTT Movie : స్విమ్మింగ్ పూల్ లో శవం… బర్త్ డే రోజు దిమ్మతిరిగే గిఫ్ట్… ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే డైరెక్ట్ గా పరలోకానికే

OTT Movie : భార్యతో పాటు కోడలినీ వదలని మూర్ఖుడు… కొడుకు రీ ఎంట్రీతో ఫ్యామిలీ టెర్రర్… ట్విస్టులతో అదరగొట్టే సైకో థ్రిల్లర్

OTT Movie : మర్డర్ల చుట్టూ తిరిగే మైండ్ బ్లోయింగ్ స్టోరీ… హత్య కేసులో అనుకోని ట్విస్ట్… IMDbలో 7.9 రేటింగ్

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

Big Stories

×