BigTV English

OTT Movie : సంకెళ్లు వేయించుకుని పోలీసులను బిత్తర పోయేలా చేసే కుర్రాడు… అతని మ్యాజిక్ చూస్తే మైండ్ బ్లాక్

OTT Movie : సంకెళ్లు వేయించుకుని పోలీసులను బిత్తర పోయేలా చేసే కుర్రాడు… అతని మ్యాజిక్ చూస్తే మైండ్ బ్లాక్

OTT Movie : హాలీవుడ్ సినిమాలను మన ప్రేక్షకులు ఏ రేంజ్ లో చూస్తారో చెప్పాల్సిన పని లేదు. అందులోనూ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ను చూసే మూవీ లవర్స్ ఎక్కువగానే ఉన్నారు. మంచి స్టోరీ తో వచ్చే ఏ మూవీ అయినా ప్రేక్షకులు ఆదరిస్తారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ థియేటర్లలో హిట్ టాక్ తెచ్చుకొని ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. సస్పెన్స్ , థ్రిల్లర్ సినిమాలు చూసే మూవీ లవర్స్ కు ఈ మూవీ మంచి మజా ఇస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? పేరు ఏమిటి? తెలుసుకుందాం పదండి.


అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

మనం ఇప్పుడు చెప్పుకోబోయే ఈ మూవీ ఒక మెజీషియన్ చేసే అద్భుతమైన మ్యాజిక్ సన్నివేశాలతో నిండి ఉంటుంది. ప్రతి సన్నివేశం అద్భుతంగా తెరకెక్కించాడు దర్శకుడు. హీరో చేసే మెజీషియన్ విన్యాసాలు చూస్తే ప్రేక్షకులకు మతిపోతుంది. ఈ మూవీ పేరు “హౌడిని” (Houdini). ప్రస్తుతం ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

హీరో ఒక మెజీషియన్. హీరో చిన్న చిన్న మ్యాజిక్కులు చేస్తూ ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. హీరో పేదవాడు కావడంతో హీరోయిన్ ఒకసారి అతనిని డబ్బున్న వ్యక్తుల దగ్గర తన టాలెంట్ ని ప్రదర్శించమంటుంది. అప్పుడు హీరో తనకి ఎవరైనా సంకెళ్లు వేయండి, వాటిని నేను విడిపించుకుంటాను అని చెప్తాడు. అతనికి సంకెళ్లు వేయగా వాటిని తేలికగా విడిపించుకుంటాడు. ఇలా చిన్నచిన్న మ్యాజిక్కులు చేయటం హీరోకి నచ్చదు. ఒక్కసారిగా పాపులర్ అవ్వాలి అనుకుంటాడు.

ఒకసారి పోలీస్ స్టేషన్ కి వెళ్లి నన్ను సంకెళ్లతో బంధించండి నేను తప్పించుకుంటాను అని చెప్పి పందెం కాస్తాడు. చెప్పినట్టే అక్కడి నుంచి తప్పించుకుంటాడు. పోలీసులంతా అతను చేసిన పనికి షాక్ కు గురి అవుతారు. ఆ తరువాత ఈ ఘటనతో హీరో పత్రికలలో పాపులర్ అయిపోతాడు. అలాగే డబ్బును కూడా సంపాదిస్తాడు. హీరో ఒకసారి పెద్ద ప్రదర్శన ఇస్తాడు. ఒక బ్రిడ్జి నుంచి మంచుతో కప్పబడిన నీళ్లలోకి సంకెళ్లను వేసుకొని దూకుతాడు. అతడు సంకెళ్లను తీసే క్రమంలో కొంచెం ఆలస్యం అవుతుంది. అతను చనిపోతాడేమోనని హీరోయిన్ చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఎలాగో కష్టపడి హీరో తప్పించుకొని వస్తాడు. ఆ తరువాత హీరోయిన్ ఇటువంటి సాహసాలు ఇక చెయ్యొద్దు నీ ప్రాణానికి ప్రమాదం అని చెప్తుంది. దానికి హీరో ఒప్పుకోడు. ఇది ఇలా ఉంటే హీరోకి ఒక అనుకోని సంఘటన ఎదురవుతుంది. దాని నుంచి హీరో ఎలా బయట పడగలిగాడు? మెజీషియన్ కలని హీరోయిన్ కోసం మానుకుంటాడా? చివరికి హీరో, హీరోయిన్ మెజీషియన్ కల నుంచి ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి? ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే ప్రైమ్ వీడియోలో (Amazon prime video) స్ట్రీమింగ్ అవుతున్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్ “హౌడిని” (Houdini) మూవీని తప్పకుండా చూడండి.

Tags

Related News

OTT Movie : కామాఠిపురంలో కాలుజారే ఒంటరి జీవితాలు … లాక్ డౌన్ మిగిల్చిన జ్ఞాపకాలు … ఒక్కో స్టోరీ ఒక్కో స్టైల్లో

OTT Movie : పక్కింటోడి చేతిలో పాపలు బలి … రివేంజ్ కోసం భూమి మీదకి వచ్చే ఆత్మ … గూస్ బంప్స్ తెప్పించే హారర్ సినిమా

OTT Movie : వందమంది అమ్మాయిలతో ఒక్కమగాడు … యవ్వారం అంతా చీకట్లోనే …

OTT Movie : ప్రెగ్నెంట్ లేడీపై ప్రేతాత్మ కన్ను … బ్రేస్లెట్ చుట్టూ తిరిగే స్టోరీ … చెమటలు పట్టించే సీన్స్

OTT Movie : భర్తపై భార్య అరాచకం … కూతురు అంతకు మించి … ఆత్మని కూడా వదలకుండా …

OTT Movie : మంత్రగత్తె పెట్టే శాపం … ఊహించని ట్విస్టులు, తట్టుకోలేని భయాలు … క్లైమాక్స్ కూడా మరో లెవల్ సామీ

Big Stories

×