BigTV English

Woman Throws Acid on Lover: హోటల్‌కు టిఫిన్ కోసం వెళ్లిన ప్రేమికులు.. ప్రియుడిపై యాసిడ్ పోసిన యువతి?..

Woman Throws Acid on Lover: హోటల్‌కు టిఫిన్ కోసం వెళ్లిన ప్రేమికులు.. ప్రియుడిపై యాసిడ్ పోసిన యువతి?..

Woman Throws Acid on Lover| సాధారణంగా ప్రేమికుల మధ్య మనస్ఫర్తలు రావడం సహజం. కానీ ఆ గొడవలు కొన్నిసార్లు హింసాత్మకంగా మారుతుంటాయి. తాజాగా అలాంటిదే ఒక ఘటనలో ఇద్దరి ప్రేమికులు ఒక హోటల్ లో టిఫిన్ చేయడానికి వెళ్లారు. అయితే వారిద్దరి మధ్య అంతకుముందు నుంచే ఉన్న గొడవ కారణంగా ఆ ప్రియురాలు తన ప్రియుడిపై యాసిడ్ పోసింది. ఈ ఘటనలో ఇద్దరికీ గాయాలయ్యాయి.


వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని అలీగడ్ నగరంలో ఇటీవల ఒక యువతి టిఫిన్ చేయడానికి ఉదయాన్నే ఒక రెస్టారెంట్‌కు వెళ్లింది. అయితే అప్పటికి ఆ రెస్టారెంట్ ఓపెన్ కాలేదు. దీంతో ఆ యువతి రెస్టారెండ్ బయటే కూర్చొని ఉంది. కాసేపు తరువాత రెస్టారెంట్ తెరిచాక లోపలికి వచ్చి కూర్చొంది. ఇదంతా ఆ రెస్టారెంట్ మేనేజర్ గమనిస్తూ ఉన్నాడు.

Also Read: విచిత్ర వివాహం.. 70 ఏళ్ల ముసలాడితో 25 ఏళ్ల యువతి పెళ్లి.. ఎలా కుదిరిందంటే?


కాసేపు తరువాత ఆ యువతి వద్దకు బయటి నుంచి ఆమె ప్రియుడు వచ్చి కూర్చున్నాడు. ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు. ఆ తరువాత ఆ యువకుడు ఒక మసాలా దోశ, ఛోలె భటూరె (పూరి చనా కుర్మా) ఆర్డర్ చేశాడు. ఆ తరువాత ఆ యువకుడు మాట్లాడుతుండగా.. ఆ యువతి తన వద్ద ఉన్న బ్యాగులోపలి నుంచి ఒక చిన్న బాటిల్ తీసింది. ఆ బాటిల్ తెరవడానికి ఆమె చాలా ఇబ్బంది పడింది. చివరికి గట్టిగా లాగేసరికి ఆ బాటిల్ లోని ద్రవం కొంచెం ఆమె పైనే పడింది. అయితా ఆమె వెంటనే ఆ ద్రవాన్ని ఎదురుగా కూర్చొని ఉన్న తన ప్రియుడి ముఖంపై పోసింది.

ఈ ఘటన కొన్ని సెకండ్ల వ్యవధిలో జరిగిపోయింది. ఆ తరువాత ఆ ఇద్దరు ప్రేమికులు గట్టిగా కేకలు వేయడం ప్రారంభించారు. ఆ బాటిల్ లో ఉండే ద్రవం ఒక యాసిడ్ అని అప్పుడు ఆ రెస్టారెంట్ మేనేజర్ కు అర్థమైంది. దీంతో ఆ మేనేజర్ వారిద్దరినీ వేర్వేరు తీసుకెళ్లమని రెస్టారెంట్ సిబ్బందికి ఆదేశించాడు. ఆ తరువాత పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించాడు. పోలీసులు వచ్చే లోగా ఆ యువతిని ఎందుకిలా చేశావని ప్రశ్నించాడు. అప్పుడా యువతి చెప్పింది విని ఆ మేనేజర్ ఆశ్చర్యపోయాడు.

Also Read: కుటుంబాన్ని పోషించడానికి ఆ పనిచేస్తున్న మహిళ.. ప్రశంసల వర్షం కురిపిస్తున్న నెటిజెన్లు!

నిజానికి ఆ యువతికి ఇటీవల మరొకరితో వివాహం జరిగింది. అయితే ఆమె వివాహం జరిగిన తరువాత కూడా ఆమె ప్రియుడు వెంటపడుతూనే ఉన్నాడు. తన కోరికలు తీర్చకపోతే తమ ప్రేమ విషయం ఆమె భర్తకు చెప్పేస్తానని బ్లాక్ మెయిల్ చేసేవాడు. చివరికి అతను చెప్పింది వినకపోయేసరికి వాళ్లిద్దరూ ప్రేమించుకున్న సమయంలో ఉన్న ఫొటోలు, వీడియోలు ఆమె భర్తకు చూపించాడు. దీంతో ఒక సంవత్సరం క్రితం ఆమె భర్త ఆమెకు విడాకులిచ్చాడు. అప్పటి నుంచి ఆ యువతి వెంట ఆమె ప్రియుడు పడుతూనే ఉన్నాడు. దీంతో ఆమె అతనికి గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకుంది.

అందుకే అతనికి రెస్టారెంట్ కు టిఫిన్ కోసం పిలిచి ముఖంపైన యాసిడ్ తో దాడిచేసింది. యాసిడ్ దాడి తరువాత పోలీసులు వచ్చే సమయానికి యాసిడ్ గాయాలతో ఉన్న ఆ యువకుడు రెస్టారెంట్ నుంచి తప్పించుకొని పారిపోయాడు. అయితే పోలీసులు ఆ యువతికి కూడా యాసిడ్ గాయాలు కావడంతో చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. యాసిడ్ దాడి కేసు నమోదు చేసి ఫిర్యాదు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Related News

Chirala Beach Accident: బీచ్‌లో విషాదం.. స్నానం చేస్తూ ఐదుగురు మాయం

Vizag Steel Plant: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం

Tirupati Drug Case: పాడుబడ్డ బంగ్లాలో డ్రగ్స్ తీసుకుంటూ.. ఇద్దరు యువకులు అరెస్ట్

Siddipet Crime: పెళ్లయిన 13 రోజులకే ప్రెగ్నెంట్.. డాక్టర్ సమాధానంతో భర్త షాక్, ఏం జరిగింది?

Road Accident: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో నలుగురు మృతి

Sangareddy News: కిలేడీ విద్య ఎక్కడ? జాబితాలో సినీ-బిల్డర్లు? పోలీసులపై అనుమానాలు?

Medak District: దారుణం.. పని ఇస్తామని నమ్మించి.. మహిళపై అత్యాచారం

Warangal Crime: బీటెక్‌ విద్యార్థిని సూసైడ్.. అసలు కారణం అదేనా?

Big Stories

×