BigTV English

Viswam Collections : ‘విశ్వం’ ఫస్ట్ డే ఓపెనింగ్స్ అదిరిపోయాయి.. ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?

Viswam Collections : ‘విశ్వం’ ఫస్ట్ డే ఓపెనింగ్స్ అదిరిపోయాయి.. ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?

Viswam Collections : టాలీవుడ్ హీరో మ్యాచో స్టార్ గోపీచంద్ నటించిన తాజా మూవీ ‘విశ్వం’.. ప్రముఖ డైరెక్టర్ శ్రీను వైట్ల ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ మూవీ రిజల్ట్ కోసం అటు గోపి చంద్, ఇటు డైరెక్టర్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా దసరా కానుగా నిన్న గ్రాండ్ గా విడుదల అయ్యింది. మొదటి షోతోనే మంచి టాక్ ను సొంతం చేసుకుంది. అనుకున్న టాక్ ను అయితే అందుకోలేదు. కానీ పాజిటివ్ రెస్పాన్స్ ఈ మూవీకి వచ్చింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా తొలి రోజు ఎన్ని కోట్ల వసూళ్లను రాబట్టిందో ఒకసారి తెలుసుకుందాం..


ఈ మూవీ రిజల్ట్ చాలా మందికి లైఫ్ అండ్ డెత్ సమస్యగా మారింది. విశ్వం మూవీ పై ఎందరో జీవితాలు ఆధారపడి బ్రతుకుతున్నారు. డైరెక్టర్ శ్రీనువైట్ల, హీరో గోపీచంద్, హీరోయిన్ కావ్యథాపర్, నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌లకు ఓ సాలీడ్ హిట్ అవసరం. ఈ ఫెయిల్యూర్స్‌ను ఎదురుర్కొని నిలబడాలని వారంతా కష్టపడి సినిమా చేశారు. ఆ సినిమా రిజల్ట్ అటు ఇటు అయినా మొత్తం అందరు రిస్క్ లో పడ్డట్లే అని తెలుస్తుంది. ఈ మూవీ నుంచి వచ్చిన ట్రైలర్, టీజర్స్, పోస్టర్స్ కు అయితే జనాల నుంచి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. అదే విధంగా ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరిగిందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి అనుకున్న కలెక్షన్స్ ను అందుకుందో లేదో ఒకసారి తెలుసుకుందాం..

గోపి చంద్ విశ్వం మూవీ కలెక్షన్స్ విషయానికొస్తే.. తొలిరోజున రూ. 16 కోట్లు అందుకోవచ్చని ప్రముఖులు అంచనా వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రూ.11 కోట్లు, కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌తో కలిపి మరో రూ.5 లక్షల వరకు గ్రాస్ వసూళ్లు రాబడుతుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ప్రస్తుతం దేవర, స్వాగ్ మూవీల హవా నడుస్తుంది. ఈ సినిమాలను తట్టుకొని నిలబడటం కష్టమే. ఈ సినిమా బిజినెస్ ను చూస్తే.. నైజాంలో రూ.4 కోట్లు, సీడెడ్‌లో రూ.1.5 కోట్లు, ఆంధ్రాలో రూ.4.5 కోట్ల మేర మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ.10 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ చేసింది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్ కలిపి రూ.1.5 కోట్ల బిజినెస్ చేశాయి. అంటే వరల్డ్ వైడ్‌గా రూ.11. 5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని సమాచారం. మొత్తంగా ఈ మూవీ రూ. 25 కోట్ల గ్రాస్ ను రాబడితే సినిమా బ్రేక్ ఈవెన్ అందుకోవడం పక్కా అనే టాక్ వినిపిస్తుంది. చూద్దాం ఏ మాత్రం కలెక్షన్స్ ను అందుకుంటుందో.. దసరా గోపి చంద్ కు సంతోషాన్ని ఇస్తుందేమో చూడాలి.. ఇక హీరో రోల్స్ కి గోపీచంద్ పనికారడని, మళ్లీ విలన్ గా రీ ఎంట్రీ ఇస్తే ఆయన కెరీర్ ఎవ్వరూ ఊహించని రేంజ్ లో ఉంటుందని, పాన్ ఇండియా లెవెల్ లో మోస్ట్ వాంటెడ్ విలన్ గా మారిపోతాడని అంటున్నారు కొందరు సినీ అభిమానులు చెబుతున్నారు..


Tags

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×