BigTV English
Advertisement

Telangana : యూట్యూబ్ చూసి.. ఆ పని చేసి.. అడ్డంగా దొరికిపోయిన ఇద్దరు మహిళలు

Telangana : యూట్యూబ్ చూసి.. ఆ పని చేసి.. అడ్డంగా దొరికిపోయిన ఇద్దరు మహిళలు

Telangana : మహిళలు ఎందులోనూ తగ్గేదేలే అంటున్నారు. పురుషులేనా.. తాము కూడా అన్నిట్లోనూ సమానంగా ఉంటామంటున్నారు. జస్ట్ అనడం మాత్రమే కాదు, ప్రాక్టికల్‌గా చేసి చూపిస్తున్నారు కూడా. ఈ ట్రెండ్ కేవలం నగరాలకే పరిమితం కాలేదు. మారుమూల గ్రామాల్లో ఉండే మహిళలు సైతం అప్‌డేట్ అవుతున్నారు. మొబైల్ ఉంటే చాలు. యూట్యూబ్‌లో చూసి సర్వం నేర్చేసుకుంటున్నారు. అలానే ఆ ఇద్దరు మహిళలు యూట్యూబ్ చూసి ఒక్కరోజులోనే దొంగలుగా మారారు. సక్సెస్‌ఫుల్‌గా బంగారం దోచేశారు. ఇక పండగ చేసుకోవచ్చు అనుకుంటుండగా వాళ్ల సీన్ రివర్స్ అయింది.


యూట్యూబ్ వీడియోలు చూసి..

లత, విజయ, సాయికుమార్. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కంజర్ గ్రామానికి చెందిన ఆ ముగ్గురు కూలీ పని చేస్తుంటారు. ఎన్నాళ్లని ఇలా కష్టపడతాం? కూలీ పనులతో మన బతుకులు మారుతాయా? అనుకున్నారు. ఏం చేద్దాం అని బాగా ఆలోచించారు. బాగా డబ్బులు సంపాదించాలని ఫిక్స్ అయ్యారు. చోరీలు చేయాలని డిసైడ్ అయ్యారు. దొంగతనం చేయడం ఎలా? అంటూ యూట్యూబ్‌లో సెర్చ్ చేశారు. అనేక వీడియోలు చూశారు. కళ్లల్లో కారం కొట్టి, కత్తి చూపించి, బంగారం దోచుకునే వీడియో వాళ్లకు బాగా నచ్చింది. ఇదేదో ఈజీగా ఉంది. ఈ పని చేస్తే తమ లైఫ్ సెటిల్ అయిపోతుందని అనుకున్నారు. ఏప్రిల్ 24న యూట్యూబ్‌లో ఆ వీడియో చూశారు.. నెక్ట్స్ డే దొంగతనం చేసేందుకు ఫీల్డ్ లోకి దిగిపోయారు.


దోపిడీ ఎలా చేశారంటే..

నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం బస్టాండ్ దగ్గర ఉన్న మూత్రశాలను తమ దోపిడీకి స్పాట్‌గా ఎంచుకున్నారు. అదును కోసం వెయిట్ చేశారు. అప్పుడే అక్కడకు 60 ఏళ్ల కిష్టాబాయి అనే వృద్ధురాలు వచ్చింది. ఆమె ఒంటిపై బంగారం తళుక్కున మెరిసింది. అది చూసి తమ పంట పండిందనుకున్నారు ఆ కొత్త దొంగలు. యూట్యూబ్‌లో చూసినట్టుగానే.. వృద్ధురాలి కంట్లో కారం చల్లి, కత్తితో దాడి చేసి.. ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు.

ఎలా దొరికిపోయారంటే..

వారెవ్వా.. ఫస్ట్ దొంగతనం గ్రాండ్ సక్సెస్ అనుకున్నారు ఆ ముగ్గురు. ఇక తమ తలరాత మారి దశ తిరిగినట్టేనని తెగ సంతోషించారు. కానీ, పోలీసులు ట్విస్ట్ ఇస్తారని అప్పుడు ఊహించలేకపోయారు. ఆ యూట్యూబ్‌ వీడియోలో పోలీసులు పట్టుకునే సీన్ లేదు మరి. బంగారం దోచుకున్నారంటూ బాధిత వృద్దురాలు పోలీసులకు కంప్లైంట్ చేసింది. పోలీసులు రంగంలోకి దిగి ఎంక్వైరీ స్టార్ట్ చేయడంతో.. సమీపంలోని సీసీఫుటేజ్‌తో.. ముగ్గురు దొంగలను ఈజీగానే పట్టేసుకున్నారు. వారి నుంచి 10 గ్రాముల గోల్డ్, కత్తి, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పల్లెటూర్లో ఉంటూ కూలీ పనులు చేసుకునే మహిళలు సైతం ఇలా యూట్యూబ్ చూసి దోపిడీ, దొంగతనాలకు పాల్పడటం చూసి పోలీసులే అవాక్కవుతున్నారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే.. గురువారం ఆ ముగ్గురు యూట్యూబ్‌లో వీడియో చూశారు.. శుక్రవారం దోపిడీ చేశారు.. శనివారం పోలీసులకు దొరికిపోయారు. అన్నీ ఒక్కరోజులోనే జరిగిపోయాయి.

Related News

Road Accident: పెళ్లి కారు టైరు పేలి‌.. ముగ్గురు స్పాట్‌డెడ్‌

Road Accident: డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. మంటల్లో తగలబడి.. 8 మంది స్పాట్!

Patancheru Tollgate: ఘోర రోడ్డు ప్రమాదం.. పటాన్‌చెరులో ట్యాంకర్‌ బోల్తా..

Hyderabad News: హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్యాయత్నం.. అసలేం జరిగిందంటే..?

TMC MP Kalyan Banerjee: సైబర్ వలకు చిక్కిన ఎంపీ కళ్యాణ్ బెనర్జీ.. ₹55 లక్షల స్వాహా!

Tamil Nadu: చిన్నారి ప్రాణం తీసిన తల్లి.. మరో మహిళతో అఫైర్‌!

Nellore Accident: నెల్లూరులో స్కార్పియో యాక్సిడెంట్.. నలుగురు టీచర్లు స్పాట్!

Rajendranagar Accident: ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన డీసీఎం వాహనం..

Big Stories

×