OTT Movie : సైన్స్ ఫిక్షన్ సినిమాలు చూస్తున్నంతసేపు ఏదో అద్భుతమైన వింత ప్రపంచంలో ఉన్నామా ? అనే ఫీలింగ్ కలుగుతుంది. అలాంటి ఫీలింగ్ ను, దాని కోసమే సై-ఫై సినిమాలను ఇష్టపడే వారికోసమే ఈ మూవీ సజెషన్. ఇందులో ఓ ఫ్యామిలీలో అబ్బాయిలకు మాత్రమే స్పెషల్ పవర్ ఉంటుంది. మరి ఈ సినిమా స్టోరీ ఏంటి? మూవీ పేరేంటి? అనే వివరాల్లోకి వెళ్తే…
ఏ ఓటీటీలో ఉందంటే?
ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మూవీ పేరు ‘ఎబౌట్ టైమ్’ (About Time 2013). రిచర్డ్ కర్టిస్ దర్శకత్వంలో వచ్చిన ఒక రొమాంటిక్ సైన్స్ ఫిక్షన్ కామెడీ-డ్రామా ఇది. ఇందులో డొమ్నాల్ గ్లీసన్, రాచెల్ మెక్‌అడమ్స్, బిల్ నై ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఒక యువకుడు తన జీవితంలోని గత సంఘటనలను మార్చడానికి టైమ్ ట్రావెల్ ను ఉపయోగించడం, అలాగే ప్రేమ, కుటుంబం, జీవితంలోని ప్రతీ క్షణాన్ని ఆస్వాదించడం గురించి ఉంటుంది. కామెడీ, ఎమోషన్ కలగలిపి ఉన్న ఈ మూవీ జీవితంపై ఒక సానుకూల దృక్పథాన్ని కలిగిస్తుంది. ఒక హాయిగొలిపే భావోద్వేగ రొమాంటిక్ కామెడీ మూవీని ఆస్వాదించాలనుకుంటే ఈ మూవీ బెస్ట్ ఆప్షన్. దీనిని నెట్‌ఫ్లిక్స్ (Netflix), అమెజాన్ ప్రైమ్ వీడియో (Amzon Prime Video), లేదా ఆపిల్ టీవీలో చూడవచ్చు.
కథలోకి వెళ్తే…
టిమ్ లేక్ (డొమ్నాల్ గ్లీసన్) అనే 21 ఏళ్ల యువకుడు కార్న్‌వాల్‌లో తన తల్లిదండ్రులు జేమ్స్ (బిల్ నై), మేరీ… సోదరి కిట్ కాట్, అంకుల్ డెస్మండ్‌తో సంతోషంగా ఉంటాడు. నూతన సంవత్సర వేడుకల తర్వాత టిమ్‌కు తన తండ్రి ఒక రహస్యాన్ని చెప్తాడు: తమ కుటుంబంలో అబ్బాయిలకు మాత్రమే గతంలోకి తిరిగి వెళ్లే టైమ్ ట్రావెల్ పవర్ ఉందని హీరో తెలుసుకుంటాడు. అయితే అలా వెళ్ళినప్పటికీ ఫ్యూచర్ ను మార్చలేరు. కేవలం తమ వ్యక్తిగత జీవితంలోని సంఘటనలను మాత్రమే మార్చగలరు. అలా జరగాలంటే చీకటి ప్రదేశంలో నిలబడి, పిడికిలి బిగించి, వెళ్లాలనుకున్న క్షణం గురించి ఆలోచిస్తే చాలు. అయితే హీరో ఈ అద్భుతమైన శక్తిని తన లవ్ లైఫ్ కోసం వాడుకుంటాడు.
అతను ముందుగా తన సోదరి స్నేహితురాలు షార్లెట్‌ను ఆకర్షించడానికి ప్రయత్నిస్తాడు. కానీ టైమ్ ట్రావెల్ ఉపయోగించినప్పటికీ ఆమె అతనిపై ఆసక్తి చూపదని తెలుసుకుంటాడు. ఆ తర్వాత అతను లండన్‌కు వెళ్లి న్యాయవాదిగా పని చేస్తూ, ఒక రెస్టారెంట్‌లో మేరీ (రాచెల్ మెక్‌అడమ్స్) అనే అమెరికన్ మహిళను కలుస్తాడు. రెండుసార్లు టైమ్ ట్రావెల్ శక్తిని ఉపయోగించి, చివరకు ఆమె ప్రేమను గెలుచుకుంటాడు. పెళ్లి కూడా చేసుకుంటాడు. అయితే తన సోదరి బాధలను తీర్చడానికి ప్రయత్నిస్తే అది మాత్రం కుదరదు. కానీ ప్రతి విషయానికి తన టైమ్ ట్రావెల్ శక్తిని వాడడం మొదలుపెడతాడు టిమ్. చివరకు తన తండ్రికి ఓ పెద్ద అనారోగ్య సమస్య ఉందనే షాకింగ్ విషయం బయట పడుతుంది. మరి ఆ టైమ్ లో టిమ్ ఏం చేశాడు? తన తండ్రికి ఉన్న సమస్య ఏంటి? చివరికి టిమ్ లైఫ్ ఎలా మారింది? అనేది మూవీ చూసి తెలుసుకోవాల్సిందే.