BigTV English

Ajith Kumar: అజిత్ పరమ దరిద్రుడు.. వాడి క్రిమినల్ పనుల వల్ల చనిపోతా అనుకున్నా.. హీరోయిన్ సంచలన కామెంట్స్

Ajith Kumar: అజిత్ పరమ దరిద్రుడు.. వాడి క్రిమినల్ పనుల వల్ల చనిపోతా అనుకున్నా.. హీరోయిన్ సంచలన కామెంట్స్

Ajith Kumar: చాలావరకు ఏ భాషా ఇండస్ట్రీలో అయినా సీనియర్ హీరోలంటే ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది. వాళ్లు ఎంతోకాలంగా ఇండస్ట్రీలో ఉన్నారని, ఇప్పుడే వచ్చిన ఆర్టిస్టులకు ఎంతో గౌరవం ఇస్తారని, సపోర్ట్ అందిస్తారని అనుకుంటూ ఉంటారు. కానీ అలా కాదని.. సీనియర్ హీరోల్లో కూడా రియల్ విలన్స్ ఉంటారని ఇప్పటికే చాలా సందర్భాల్లో ఆరోపణలు వచ్చాయి. అవి నిజామా కాదా అనే ఆధారాలు ఉన్నా లేకపోయినా మొత్తానికి చాలావరకు సీనియర్ హీరోల మీద ఎవరైనా ఆరోపణలు చేస్తే వారి ఫ్యాన్స్ అస్సలు సైలెంట్‌గా ఉండరు. అయినా కూడా ఒక సీనియర్ నటి.. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్‌పై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేసింది.


భారీ స్టేట్‌మెంట్

ఒకప్పుడు తెలుగు, హిందీతో పాటు తమిళ సినిమాల్లో కూడా హీరోయిన్‌గా నటించి చాలామందిని మెప్పించిన నటి హీరా. కెరీర్ పీక్స్‌లో ఉన్న టైమ్‌లో వెండితెరపై నుండి మాయిమయిపోయింది ఈ ముద్దుగుమ్మ. అలాంటి నటి ఇన్నాళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకొచ్చి స్టార్ హీరో అజిత్‌పై తీవ్రమైన ఆరోపణలు చేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అది కూడా అజిత్‌కు పద్మ భూషణ్ వచ్చిన ఇలాంటి సమయంలో తను మోసం చేశాడని అనడంతో పాటు మరెన్నో ఆరోపణలు చేస్తే సోషల్ మీడియాలో పోస్ట్ అప్లోడ్ చేసింది. ప్రస్తుతం తను అజిత్‌పై చేసిన స్టేట్‌మెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఫ్యాన్స్‌తో పాటు అందరినీ షాక్‌కు గురిచేస్తోంది.


అన్నీ అబద్ధాలే

‘ఈ నటుడి క్రిమినల్ ఆలోచనలు ఏ రేంజ్‌లో ఉన్నాయంటే తన అభిమానులను హింస కోసం ప్రేరేపిస్తూ, రెచ్చగొడుతూ, తయారు చేస్తూ ఉంటాడు. పైగా నా సేఫ్టీని దెబ్బతీసేలా ఎన్నో అబద్ధాలు చెప్పాడు. దానివల్లే నేను డిప్రెషన్‌లోకి వెళ్లిపోయి ఆత్మహత్య కూడా చేసుకోవాలని అనుకున్నాను’ అంటూ అజిత్ గురించి ఆరోపణలు చేసింది హీరా. అంతే కాకుండా తనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని, సర్జరీలు జరుగుతున్నాయని చెప్పిన మాటలు అన్నీ కూడా అబద్దాలు అని, ఇవన్నీ కేవలం అభిమానుల దగ్గర నుండి సింపథీ కోసమే అలాంటివి చెప్పేవాడని తెలిపింది. మొత్తానికి హీరా చేసిన ఆరోపణలు కోలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.

Also Read: మార్పు మంచిదే.. కానీ, జక్కన్న దగ్గర మాత్రం దీన్ని యాక్సెప్ట్ చేయలేం

అప్పట్లోనే బ్రేకప్

ఒకప్పుడు అజిత్ (Ajith), హీరా (Heera) కలిసి పలు సినిమాల్లో నటించారు. అంతే కాకుండా వీరిద్దరి మధ్య ప్రేమాయణం కూడా నడించిందని కోలీవుడ్‌లో గుసగుసలు వినిపించాయి. కానీ ఏమైందో తెలియదు కానీ ఒక్కసారిగా అజిత్ లైఫ్‌లోకి షాలిని వచ్చింది. దీంతో అజిత్.. షాలినినే పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లైఫ్‌ను ప్రారంభించారు. దానికంటే ముందే అజిత్ తనను మోసం చేశాడని చెప్తూ 1990ల్లో తనపై తీవ్రమైన ఆరోపణలు చేసి విడిపోయింది హీరా. అప్పట్లో అలా జరిగిన తర్వాత హీరా కూడా పూర్తిగా వెండితెరకు దూరమయ్యింది. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత ఇప్పుడు మరోసారి హీరా అందరి ముందుకు వచ్చి ఇలాంటి స్టేట్‌మెంట్ ఎందుకు ఇచ్చిందా అని అందరిలో చర్చ మొదలయ్యింది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×