E-Paper
Advertisement

Hyderabad News: టెక్కీకి ఎంత కష్టం వచ్చింది.. హుస్సేన్ సాగర్‌లోకి దూకి ఆత్మహత్య

Hyderabad News: టెక్కీకి ఎంత కష్టం వచ్చింది.. హుస్సేన్ సాగర్‌లోకి దూకి ఆత్మహత్య
Advertisement

Hyderabad News: వివాహాలు జరక్క పెళ్లి కాని ప్రసాదుల సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది.  35 నుంచి 40 ఏళ్ల మధ్య ప్రస్తుతం అబ్బాయిలు వివాహం చేసుకున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. అయితే వివాహం కాలేదని ఓ టెక్కీ ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. ఇంతకీ ఎక్కడో తెలుసా?

హుస్సేన్ సాగర్‌లోకి దూకి టెక్కీ ఆత్మహత్య

Advertisement

సొసైటీలో సమస్యలు లేని మనుషులు ఉండరు. పేదరికంలో కొందరు.. సరైన ఉద్యోగం లేదని మరికొందరు.. అబ్బాయి లేదా అమ్మాయికి వివాహం జరగలేదని మరికొందరు ఉంటారు. సమస్యని పరిష్కరించుకోవడానికి రకరకాల దారులు వెతుకుతుంటారు. ఆ సమయంలో ఆత్మహత్య చేసుకున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.

కనిపిస్తున్న యువతి పేరు విజయలక్ష్మి. ఆమె వయస్సు దాదాపు 25 ఏళ్లు. హైటెక్ సిటీలో ఐటీ కంపెనీ ఉద్యోగం చేస్తోంది. ఎలాంటి సమస్యలు లేని ఆ టెక్కీకి ఊహించని కష్టం వచ్చింది. వివాహం జరగడం లేదన్న కారణంతో తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకుంది. నేరుగా హుస్సేన్ సాగర్ లోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది.

Advertisement

వివాహం కాలేని..  తీవ్ర మనస్తాపంతో 

మేడ్చల్‌ జిల్లా కండ్లకోయకు చెందిన విజయలక్ష్మి చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు. అయితే ఆమె తల్లికి మతిస్థిమితం సరిగా లేదు. తల్లితో కలిసి కూకట్‌పల్లిలోని మైత్రినగర్‌లో ఉంటోంది. తల్లికి అన్నీ తానై కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చింది. ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న ఆమెకి వివాహ సంబంధాలు వస్తున్నాయి. అందుకు ఆమె ఒక్కటే కండీషన్ పెట్టారు.

తనతోపాటు తల్లి ఉంటుందని చెప్పారు. అందుకు చాలామంది అంగీకరించలేదు. దీంతో వచ్చిన సంబంధాలు వెనక్కి వెళ్లిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తనకు వివాహం కాదని డిసైడ్ అయ్యింది. ఆ తర్వాత తీవ్ర మనోవేదనకు గురైంది. శనివారం సాయంత్రం ఇంటినుంచి బయటకు వెళ్లింది. మరళ తిరిగి రాకపోవడంతో ఆమె సమీప బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తొలుత అదృశ్యం కేసుగా పోలీసులు నమోదు చేశారు.

ALSO READ: ఒక్క ప్లేటు మోమోస్ కోసం రూ.85 లక్షలు.. ఈ పిల్లాడిని ఎలా ట్రాప్ చేశారంటే?

అయితే హుసేన్‌సాగర్‌లో సోమవారం సాయంత్రం యువతి మృతదేహం కనిపించింది. వెంటనే ఆ ప్రాంత పోలీసులు కూకట్‌పల్లి పోలీసులకు తెలిపారు. మృతదేహం చూసి కూకట్‌పల్లిలో అదృశ్యమైన విజయలక్ష్మిదేనని నిర్ధారించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తన తల్లిని వదులుకోలేక, ఈ లోకాన్ని విడిచిపెట్టేసింది విజయలక్ష్మి. ఈ విషయం తెలిసి ఆమె బంధువులు కన్నీరు మున్నీరు అయ్యారు. ఇప్పుడు విజయలక్ష్మి తల్లి మాట ఏంటన్నది అసలు ప్రశ్న.

 

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×