E-Paper
Advertisement

Ajay Death Case: నిజామాబాద్‌లో దారుణం.. చెవి నొప్పితో హస్పిటల్‌కి వస్తే శవంగా పంపించారు

Ajay Death Case: నిజామాబాద్‌లో దారుణం.. చెవి నొప్పితో హస్పిటల్‌కి వస్తే శవంగా పంపించారు
Advertisement

Ajay Death Case: స్వేచ్ఛ బ్యూరో: చెవి నొప్పితో వచ్చిన యువకుడు మృతి చెందిన సంఘటన బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని ఖలీల్ వాడిలో గల ఓ ప్రైవేట్ ఆస్పత్రి లో భీంగల్ మండలం పల్లికొండ గ్రామానికి చెందిన గంగం అజయ్(Ajay) చెవి నొప్పితో మంగళవారం సాయంత్రం ఆసుపత్రికి చికిత్స నిమిత్తం వచ్చామన్నారు. అజయ్ ని చెక్ అప్ చేసిన చెవి వైద్య నిపుణులు ఆపరేషన్ చేయాలని సూచించాడు.

నిర్లక్ష్యపు సమాధానాలు

ఆపరేషన్ కోసం అన్ని సిద్ధం చేసుకుని మత్తు వైద్యున్ని పిలిపించి మృతి ఇంజక్షన్ చేసి ఆపరేషన్ ప్రారంభించారని, రెండు మూడు గంటలైనా ఆసుపత్రి వైద్యులు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో బాధిత కుటుంబ సభ్యులు నిలదీశామన్నారు. పది నిమిషాలు ఆగండి, పది నిమిషాలు ఆగండి అంటూ నిర్లక్ష్యపు సమాధానాలు తెలిపారు. ఏదైనా ఉంటే చెప్పండి అడిగితే పేషెంట్ పరిస్థితి సీరియస్ గా ఉందని ఆసుపత్రి వైద్యులు సమాధానం ఇచ్చారు. నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తామని తెలపడంతో లేదు హైదరాబాద్(Hyderabad) కు తీసుకెళ్తామని కుటుంబ సభ్యులు తెలిపామన్నారు.

Advertisement

Also Read: Brinjal fry: వంకాయ పొడి కూర ఎప్పుడైనా ప్రయత్నించారా? రెసిపీ ఇదిగో

మత్తు వైద్యులు ఇచ్చిన ఇంజక్షన్..

కొద్దిసేపటి తరువాత నగరంలోని మరో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా పరిశీలించిన వైద్యులు సీరియస్ గా ఉందని ఏమి చేయలేమని అంతా అయిపోయిందని చెప్పడంతో మృతదేహాన్ని తీసుకొని వచ్చి ఎక్కడైతే చికిత్స పొందిన ఆసుపత్రి ఉందో ఆసుపత్రి ఎదుట కుటుంబ సభ్యులతో కలిసి మృతదేహాన్ని ముందు ఉంచుకొని ధర్నాకు దిగారు. మత్తు వైద్యులు ఇచ్చిన ఇంజక్షన్ తోనే మృతి చెంది ఉంటారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆస్పత్రిలో వెంటిలేటర్ ఇలాంటి సౌకర్యాలు లేవని, తమ కుటుంబానికి న్యాయం చేయాలని హాస్పిటల్ ఎదుట ఆందోళన నిర్వహిస్తున్నారు.

Advertisement

Also Read: Seed Farms Land: రాష్ట్రంలో కబ్జాల పాలైతున్న సీడ్ ఫాం భూములు.. త్వరలో ప్రభుత్వానికి పూర్తి నివేదిక..!

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×