E-Paper
Advertisement

ప్రేమ నిరాకరణ.. యువతి ఇంటిపై పెట్రోల్ బాంబుల దాడి!

ప్రేమ నిరాకరణ.. యువతి ఇంటిపై పెట్రోల్ బాంబుల దాడి!
Advertisement

Coimbatore: ప్రేమించలేదన్న కోపంతో ఓ యువకుడు ఘోరానికి ఒడిగట్టాడు. తన ప్రేమను తిరస్కరించిందనే కక్షతో ఓ యువతి ఇంటిపై పెట్రోల్ బాంబులతో దాడికి పాల్పడ్డాడు. తమిళనాడుతోని కోయంబత్తూరు సమీపంలో ఉన్న తొండముత్తూరులో ఈ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.

స్థానికంగా నివసిస్తున్న ఓ యువతిని నిందితుడు కొంతకాలంగా ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. అయితే ఆమె అందుకు నిరాకరించడంతో ఎలాగైనా పగ తీర్చుకోవాలని డిసైడ్ అయ్యాడు. ఈ క్రమంలోనే తన స్నేహితుడితో కలిసి బైక్‌పై యువతి ఇంటికి చేరుకున్నాడు. వెంట తెచ్చుకున్న రెండు పెట్రోల్ బాంబులను ఒకదాని తర్వాత ఒకటి నేరుగా ఆమె ఇంటిపైకి విసిరి అక్కడ నుంచి వేగంగా పరారయ్యాడు.

Advertisement

బాంబులు పడటంతో ఒక్కసారిగా యువతి ఇంటి ముందు మంటలు చెలరేగాయి. ఆ శబ్దాలు, మంటలను గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు భయాందోళనతో కేకలు వేశారు. వెంటనే అప్రమత్తమై నీళ్లు పోసి మంటలను ఆర్పేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ దారుణానికి సంబంధించిన దృశ్యాలన్నీ అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలో స్పష్టంగా రికార్డయ్యాయి. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.

Also Read: సీఎంను కలిసిన వామపక్షాలు.. పంట కొనుగోళ్లు, మూసీ ప్రాజెక్టుపై రేవంత్ కీలక హామీ!

Advertisement

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×