E-Paper
Advertisement

Top 20 News Today: రాజధాని అమరావతిలో మరో ముందడుగు, ఢిల్లీలో రోజురోజుకీ పెరిగిపోతున్న గాలి కాలుష్యం

Top 20 News Today: రాజధాని అమరావతిలో మరో ముందడుగు, ఢిల్లీలో రోజురోజుకీ పెరిగిపోతున్న గాలి కాలుష్యం

1. వరంగల్ జిల్లాలో గంజాయి పట్టివేత..

వరంగల్ జిల్లా నర్సంపేటలో గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్సై రవి కుమార్, సిబ్బంది పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ముత్తోజిపేట శివారులో అనుమానాస్పదంగా కనిపించిన బొమ్మెర మహేష్ పారిపోబోయాడు. పోలీసులు అతన్ని పట్టుకొని తనిఖీ చేయగా, అతని వద్ద అరకేజీ ఎండు గంజాయి లభించింది.

2. కల్తీ నెయ్యి కేసులో మరొకరిని అరెస్ట్ చేసిన సిట్

టీటీడీ కల్తీ నెయ్యి కేసులో మరొకరిని అరెస్ట్ చేసింది సిట్. ఈ కేసులో మొదటి సారి టీటీడీ అధికారిని అరెస్ట్ చేశారు. టీటీడీ ప్రొక్యూర్‌మెంట్ మాజీ జనరల్ మేనేజర్ సుబ్రహ్మణ్యంను అరెస్టు చేశారు. మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాజీ పీఏ చిన్న అప్పన్నతో కలిసి కల్తీ నెయ్యి సరఫరాలో కుట్రలకు పాల్పడ్డారని ఆయనపై కేసు నమోదు చేశారు.

3. బీసీ రిజర్వేషన్ల అంశంపై నేడు హైకోర్టుల విచారణ

బీసీ రిజర్వేషన్ల అంశంపై ఇవాళ తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగనుంది. జోవో 46ను రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలైంది. రిజర్వేషన్లలో భాగంగా బీసీలోని ఏ,బీ,సీ,డీలను.. వర్గాల ఆధారంగా కేటాయించాలని పిటిషనర్ కోరారు. ఎంపిరికల్ డేటా బహిర్గతం చేయకుండానే రిజర్వేషన్లు ఖరారు చేశారని వికారాబాద్‌కి చెందిన మచ్చదేవ్ పిటి షన్ దాఖలు చేశారు.

4. ములుగు జిల్లాలోని అబ్బాయిగూడెంలో గ్రామస్థుల ధర్నా

ములుగు జిల్లాలోని వెంకటాపురం మండలం అబ్బాయిగూడెం గ్రామస్థులు ధర్నా చేపట్టారు. ఇసుక రిచ్ నిలిపివేయాలని పురుగుమందు డబ్బాలతో నిరసన చేశారు. భద్రాచలం వెళ్లే రహదారిపై వారు బైఠాయించారు. వెంటనే ఇసుక రిచ్ నిలిపి వేయాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. బీసీలపై గిరిజనులు దాడులు చేస్తున్నారని.. అబ్బాయిగూడెం గ్రామానికి జిల్లా కలెక్టర్ వెంటనే రావాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా మైనింగ్ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

5. గన్ మిస్సింగ్ కేసులో కొనసాగుతున్న దర్యాప్తు

గన్ మిస్సింగ్ కేసులో కొనసాగుతున్న అంబర్పేట్ పోలీసుల దర్యాప్తు. గన్ మిస్సింగ్ పై పొంతన లేని సమాధానాలు చెబుతున్న ఎస్సై భాను ప్రకాశ్ రెడ్డి. ఐదు నెలల క్రితమే గన్నును మిస్ చేసిన భాను ప్రకాష్ ఆ విషయాన్ని దాచిపెట్టారు. మరొక ఉద్యోగం రావడంతో ఏపీకి వెళ్లేందుకు ఎస్సై భానుప్రకాశ్ ఎన్వోసీని అడిగగా.. సర్వీస్ రివాల్వర్ ఇవ్వాలని సూచించిన పోలీసులు. దీంతో బయటపడిన అసలు బండారం.

6. శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు

తిరుమల శ్రీవారిని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు దర్శించుకున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రంలో అభివృద్ధి వేగంగా సాగుతోందని ఆయన అన్నారు. గూగుల్ విశాఖకు రావడం గేమ్ చేంజర్‌గా చెప్పాలని అన్నారు. రిలయన్స్, మెటా, టీసీఎస్ వంటి అనేక కంపెనీలు విశాఖ వైపు చూస్తున్నాయని, మొన్న జరిగిన పారిశ్రామిక సమ్మిట్ లో 14 లక్షల కోట్ల రూపాయల ఎంఓయూ చేసుకున్నాం అని తెలిపారు.

7. పాఠశాల పై నుంచి జారిపడ్డ విద్యార్థి..

నిర్మల్ జిల్లా మల్లాపూర్ ఆశ్రమ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న ఆత్రం నగేష్ అనే విద్యార్థి ఫస్ట్ ఫ్లోర్ పైనుంచి జారిపడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే పాఠశాల సిబ్బంది బాలుడిని ముందుగా జన్నారం, ఆపై మెరుగైన వైద్యం కోసం నిర్మల్ న్యూరో ఆస్పత్రికి తరలించారు. బాలుడి ఆరోగ్యం బాగానే ఉందని, ప్రమాదం లేదని వార్డెన్ నాందేవ్ తెలిపారు.

8. సింగరేణి కాకతీయ ఓపెన్ కాస్ట్-2 ప్రాజెక్టు ముందు ఆందోళన

జయశంకర్ భూపాలపల్లి జిల్లా సింగరేణి ఓపెన్ కాస్ట్ గనులను భూ నిర్వాసితులు ముట్టడించారు. సింగరేణి కాకతీయ ఓపెన్ కాస్ట్-2 ప్రాజెక్టు ముందు ఆందోళన చేపట్టారు. సింగరేణి యాజమాన్యం తమ భూములను, ఇళ్లను తీసుకొని నష్టపరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. డీపీఆర్ లో పేర్కొన్న విధంగా తమకు పరిహారం అందించాలన్నారు.

9. ఘోర రోడ్డు ప్రమాదం..

రంగారెడ్డి జిల్లా మహాలింగపురం గ్రామం వద్ద పెళ్లి బస్సు.. మారుతి సుజుకి కారును ఢీకొంది. వికారాబాద్ జిల్లాలోని ఓ వివాహ రిసెప్షన్‌కు వెళ్లి వస్తుండగా బస్సు కారును ఢీకొనడంతో కారులో ఉన్న డ్రైవర్‌ నాగసాయి రెడ్డికి గాయాలయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

10. నల్లదేవనపల్లి గ్రామ సర్పంచ్‌గా తిరుపతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు

జోగులాంబ గద్వాల జిల్లా నల్లదేవనపల్లి గ్రామ సర్పంచ్‌గా తిరుపతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సర్పంచ్ పదవిని ఆయన 45 లక్షలకు దక్కించుకున్నట్లు సమాచారం. సౌమ్యుడిగా పేరున్న తిరుపతికి గ్రామ ప్రజలు మద్దతు ప్రకటించారు. గ్రామాభివృద్ధి కోసం నిరంతరం తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు తిరుపతి.

11. పోలవరం జిల్లాపై మిశ్రమ స్పందన

అల్లూరి జిల్లా చింతూరు డివిజన్‌లో పోలవరం జిల్లా ఏర్పాటుపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. రంపచోడవరం కేంద్రంగా జిల్లా ఏర్పాటును స్థానికులు స్వాగతిస్తున్నారు. గతంలో పాడేరు వెళ్లడానికి 350 కి.మీ. ఘాట్ రోడ్డు ప్రయాణం తప్పేది. ప్రతిపక్షంలో చంద్రబాబు ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంది.

12. అమరావతిలో నేడు రాష్ట్ర కార్యాలయాలకు శంకుస్థాపన

అమరావతిలోని సీఆర్‌డీఏ కార్యాలయంలో 15 బ్యాంకులకు సంబంధించిన రాష్ట్ర కార్యాలయాలకు శంకుస్థాపన చేశారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు.. అమరావతి, పోలవరం ప్రాజెక్టులపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

13. ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని లవర్ సూసైడ్

నిజామాబాద్ జిల్లా దొంచందా గ్రామానికి చెందిన శ్రీకాంత్ అనే యువకుడు ప్రేమించిన అమ్మాయి మోసం చేయడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లండన్ నుంచి తిరిగి వచ్చిన శ్రీకాంత్.. అఖిల వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో మనస్తాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయే ముందు తీసిన సెల్ఫీ వీడియోలో ఆమె వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వెల్లడించాడు శ్రీకాంత్.

14. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల సందడి..

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల సందడి కొనసాగుతోంది. మహబూబ్‌నగర్ జిల్లా నల్లదేవనపల్లిలో సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవమైంది. గ్రామ సర్పంచ్‌గా కె.తిరుపతి ఏకగ్రీవమయ్యారు. సౌమ్యుడిగా పేరు ఉన్న తిరుపతికి మద్దతు ప్రకటించారు గ్రామ ప్రజలు. గ్రామ అభివృద్ధిలో తనవంతు కృషి చేస్తానని తిరుపతి హామీ ఇచ్చారు.

15. ఢిల్లీ పేలుడు ఘటన కేసులో కీలక పరిణామం

ఢిల్లీ పేలుడు ఘటన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితురాలు షహీన్ సయీద్‌ను అల్ ఫలాప్ వర్సిటీకి తరలించారు. కేసు దర్యాప్తులో భాగంగా సయీద్‌ను వర్సిటీలో పలు అంశాలపై విచారించి స్టేట్‌మెంట్ రికార్డు చేసినట్లు సమాచారం.

16. ఢిల్లీలో పెరుగుతున్న గాలి కాలుష్యం

ఢిల్లీలో పెరుగుతున్న గాలి కాలుష్యం.. పీల్చేగాలి విషపూరితంగా మారడంతో అనేక వ్యాధుల బారిన పడుతున్న హస్తిన ప్రజలు. ప్రతి ఒక్కరు N-95 మాస్క్ తప్పనిసరిగా ధరించాలని సూచిస్తున్న నిపుణులు. గాలి కాలుష్యం పెరగటంతో ఒకరి పై ఒకరు విమర్శలు చేసుకుంటున్న అధికార, విపక్ష పార్టీల నేతలు. ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో నమోదైన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) గాలి కాలుష్యం.

17. ప్రమాదం కారణంగా షూటింగ్‌కు దూరమయ్యా- నవీన్‌

ప్రమాదం కారణంగా తాను ఏడాది పాటు షూటింగ్‌లో పాల్గొనలేకపోయానని, ప్రేక్షకుల ఆశీస్సులతో మళ్లీ నటించగలిగానని నవీన్‌ పొలిశెట్టి అన్నారు. ఆయన హీరోగా నటించిన కొత్త సినిమా ‘అనగనగా ఒక రాజు’. మీనాక్షీ చౌదరి హీరోయిన్‌. మారి దర్శకుడు. 2026 జనవరి 14న ఈ సినిమా విడుదల కానుంది. ప్రచారంలో భాగంగా ఎస్‌.ఆర్‌.కె.ఆర్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలో ‘భీమవరం బల్మా’ సాంగ్‌ లాంచ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో నవీన్‌ తన ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నారు.

18. ఇంటర్వ్యూలకు పిలిపించి అరెస్టులు..!

అమెరికాలో శాశ్వత నివాసానికి జారీ చేసే గ్రీన్‌ కార్డు కోసం ఎంతోమంది ఎదురుచూస్తుంటారు. అలాంటివారే లక్ష్యంగా గ్రీన్‌ కార్డు ఇంటర్వ్యూలకు అని పిలిపించి.. భద్రతాధికారులు అరెస్ట్‌లు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో అమెరికా మీడియాలో వచ్చిన కథనాలు ఆందోళనను రేకెత్తిస్తున్నాయి.

19. గంభీర్‌ను విమర్శించడాన్ని తప్పబట్టిన అశ్విన్..

సొంతగడ్డపై భారత్‌ 0-2తో దక్షిణాఫ్రికా చేతిలో పరాజయానికి బాధ్యుడిని చేస్తూ చీఫ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ను విమర్శించడాన్ని మాజీ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ తప్పుబట్టాడు. ఆటగాళ్లు పూర్తిగా బాధ్యతలు నిర్వర్తించనపుడు గంభీర్‌ను తొలగించాలని అనడం సరికాదని అశ్విన్‌ అభిప్రాయపడ్డాడు. మనం ఇలా ఎందుకు చేస్తున్నాం ఇది ఒక క్రీడ. జట్టును నిర్వహించడం అంత సులువు కాదు. నిజానికి గంభీర్‌ కూడా బాధపడుతున్నాడు. దాన్ని అర్థం చేసుకోవాలి. అందరూ ఎవరో ఒకరిని నిందించడానికే చూస్తారు’’ అని అశ్విన్‌ తెలిపాడు.

20. మరోసారి ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న అడివి శేష్..

నటుడు అడివి శేష్ మరోసారి ప్రేక్షకుల మనసులు గెలిచారు. 26/11 దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ హీరో ‘మేజర్’ సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా చేసినప్పుడు మేజర్ తల్లిదండ్రులకు ఎప్పటికీ కుమారుడిలా ఉంటానని మాటిచ్చారు అడివిశేష్. ఇచ్చిన మాట ప్రకారమే అప్పటినుంచి ప్రతి ఏడాది నవంబర్ 26న మేజర్ కుటుంబాన్ని కలుస్తున్నారు. ఈ సంవత్సరం కూడా ఆయన మేజర్ తల్లిదండ్రులను కలిశారు.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×