YouTuber Tirumala Reddy: అనంతపురం జిల్లాలో యూట్యూబర్ తిరుమల రెడ్డి అనుమానాస్పద మృతి చెందిన సంగతి తెలిసిందే. గుంతకల్ మండలం బుగ్గ సంఘాల గ్రామ సమీపంలో గత మూడు రోజుల క్రితం అదృశ్యమైన తిరుమల రెడ్డి.. మంగళవారం నాడు కసాపురం గ్రామంలో హంద్రీనీవా కాలువ వద్ద శవమై తేలాడు.. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
అయితే తాజాగా యూట్యూబర్ హత్య వెనుక కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. భూవివాదమే.. తిరుమలరెడ్డి దారుణహత్యకు కారణమని పోలీసులు ప్రాథమికంగా ధ్రువీకరించారు. తిరుమలరెడ్డి… గుంతకల్లు మండలంలోని సంగాల సమీపంలో అదృశ్యమయ్యారు. మంగళవారం కాలువలో శవమై తేలారు. కసాపురం పోలీసులు మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. భూమి విషయమై తన భర్తకు సంగాల గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి మధ్య వివాదం ఉందని మృతుడి భార్య కామేశ్వరి చెబుతున్నారు.
ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. తిరుమలరెడ్డికి సంగాలలో భూములున్నాయి. వాటిని సాగు చేస్తూ.. ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నారు. అక్కడ కొంత ప్రభుత్వ భూమిని అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి సాగు చేసుకుంటున్నారు. ఈ విషయంలో తిరుమలరెడ్డి కలగజేసుకుని.. ఇలా సాగు చేయడం అన్యాయమని, ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని హెచ్చరించినట్లు తెలిసింది. దీంతో పొలానికి వస్తాడని తెలుసుకుని…బైక్‌పై వెళ్తున్న తిరుమలరెడ్డిని హత్య చేసి కాలువలో పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
Also Read: తల్లిని చంపిన నిందితుల్ని పట్టించిన చిన్నారి డ్రాయింగ్.. ఏం జరిగిందో తెలుసా
ఇదిలా ఉంటే.. హత్య కేసులో 17 మంది నిందితులకు జీవిత ఖైదు విధించింది నల్గొండ జిల్లా ఎస్సీ, ఎస్టీ కోర్టు. 2017లో అడ్డగూడూరు పీఎస్ పరిధిలో బట్ట లింగయ్య అనే వ్యక్తిని హతమార్చారు. ఆ హత్య కేసులో అప్పటి సర్పంచ్‌తో సహా 17 మంది పేర్లను.. ఎఫ్ఐఆర్‌లో నమోదు చేశారు పోలీసులు. తుది తీర్పులో భాగంగా 17 మందిని దోషులుగా తేలుస్తూ శిక్ష అమలు చేశారు ఎస్సీ, ఎస్టీ కోర్టు అదనపు న్యాయమూర్తి రోజా రమణి. తీర్పు వెల్లడైన తర్వాత దోషుల కళ్లల్లో కన్నీళ్లు పెట్టుకున్నారు. కోర్టు తీర్పుపై బాధిత కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.