BigTV English

UP Crime : తల్లిని చంపిన నిందితుల్ని పట్టించిన చిన్నారి డ్రాయింగ్ – ఏం జరిగిందో తెలుసా..

UP Crime : తల్లిని చంపిన నిందితుల్ని పట్టించిన చిన్నారి డ్రాయింగ్ – ఏం జరిగిందో తెలుసా..

UP Crime : ఉత్తర్ ప్రదేశ్ లో ఓ వివాహిత మరణానికి సంబంధించిన కీలక విషయం ఆమె చిన్నారి పాప గీసిన డ్రాయింగ్ కారణంగా వెలుగులోకి వచ్చింది. అందులో.. తన తల్లిని చంపింది ఎవరు, ఎలా ఆత్మహత్యగా చిత్రీకరించారో తెలిసేలా.. ఆ చిన్నారి గీసిన ఓ బొమ్మ పోలీసుల్ని, విలేకరుల్ని ఆలోచనలో పడేసింది. ఆ ఘటనే.. ఈ కేసులో నిందితులను పట్టించింది. ఇంతకీ ఏమైందంటే.. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో వివాహిత అయిన సోనాలి బుధోలియా (27) అనే మహిళ ఊరి వేసుకున్న స్థితిలో ప్రాణాలో కోల్పోయి కనిపించింది. ఆమె ఆత్మహత్య చేసుకుందని ఆమె భర్త, అత్తమామలు చెప్పారు. ఆమె తల్లిదండ్రులకు సైతం అదే విషయం చెప్పారు. కానీ.. అంతలోని ఆమె కూతురు ఓ డ్రాయింగ్ తీసుకొచ్చి మీడియాకు చూపించింది. ఎన్నో అనుమానాస్పదంగా ఉన్న ఆ డ్రాయింగ్ లో తన తల్లిని, వాళ్ల నాన్నే చంపినట్లుగా ఉంది. దీంతో.. విషయం కాస్తా పోలీసులకు తెలిసి కూపీ లాగగా.. అసలు నిందితులు బయటపడ్డారు.


ఝాన్సీలోని కొత్వాలి ప్రాంతంలోని పంచవతి శివ్ పరివార్ కాలనీలో ఈ సంఘటన జరిగింది. ఓ మహిళ ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని ఆమె అత్తమామలు, ఆమె కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు బోరున విలపిస్తూ ఇంటికి చేరుకున్నారు. అప్పటికే.. ఆమెను కింద పడుకోబెట్టి ఉండడంతో.. ఏమైందోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. సరిగా అప్పుడే.. మరణించిన మహిళ కుమార్తె డ్రాయింగ్ తీసుకొచ్చింది. మీడియాకు, పోలీసులతు అనేక విషయాలు వెల్లడించింది. వాటి ప్రకారం… ఆమె భర్తే ఆమెను చంపాడని, ఆమె మృతదేహాన్ని ఆత్మహత్యగా చూపించడానికి ఉరి వేసాడనేలా ఉంది. దాంతో.. సోనాలి బుధోలియా భర్త సందీప్ బుధోలియాను పోలీసులు అరెస్ట్ చేశరు. అతని కుమార్తె, చిన్నారి దర్శిత వాగ్మూలాన్ని రికార్డు చేసుకున్నారు.

తన తల్లిని, నాన్న చాన్నాళ్లుగా వేధిస్తున్నాడని, అనేక సార్లు తీవ్రంగా కొట్టాడని చిన్నారి తెలిపింది. నాన్న అమ్మను తీవ్రంగా కొట్టి, తలను బండకేసి కొట్టి చంపేశాడని తెలిపిన చిన్నారి.. కావాలంటే నువ్వూ చావు అని తనని తిట్టాడని తెలిపింది. ఆమె చనిపోయిన తర్వాత మృతదేహాన్ని ఉరితీశాడని ఆ ఇంట్లో జరిగిన విషయాన్ని కళ్లకు కనపడేట్టు చెప్పింది. ఆ తర్వాత, మృతదేహాన్ని కిందకు దించి ఒక సంచిలో పడేసారని వెల్లడించింది.


ఇప్పుడే కాదు, గతంలోనూ అనేక సార్లు తన తల్లిని చంపేస్తానని బెదిరించాడని చిన్నారి తెలిపింది. అంతకు ముందు ఓ సారి.. అమ్మను ముట్టుకుంటే నీ చేయి విరిచేస్తానని తాను అడ్డం వచ్చానని గుర్తు చేసుకున్న చిన్నారి పాప, ఆమెను చనిపోవాల్సిందేనని చాలా సార్లు అన్నాడని, తనను చంపేస్తానని అనే వాడని కన్నీళ్లు పెట్టుకుంటూ తెలిపింది. మధ్యప్రదేశ్‌లోని తికమ్‌గఢ్ జిల్లా నివాసి అయిన సోనాలి తండ్రి సంజీవ్ త్రిపాఠి కూతురు మరణ వార్త తెలిసి విచారంలో మునిగిపోయాడు. తన కూతురుకు 2019లో వివాహం చేశానని తెలిపిన ఆయన.. మొదటి నుంచి వారి మధ్య సంబంధాలు సరిగా లేవని, వారు నిరంతరం గొడవలు పడుతున్నారని తెలిపారు.

పెళ్లిలో తన అల్లుడికి కట్నంగా రూ. 20 లక్షల నగదు ఇచ్చానని తెలిపిన మహిళ తండ్రి.. కొన్ని రోజుల తర్వాత, సందీప్, అతని కుటుంబం కొత్త డిమాండ్లు చేశారని తెలిపారు. వారు కారు కావాలని కోరారని, కానీ.. కారు కొనే స్థాయి తనకు లేదని ఆవేదనగా చెబుతున్నారు. ఆ తర్వాత నుంచే తన కూతురిపై అల్లుడు, అతని కుటుంబం దాడి ప్రారంభించారని తెలిపారు. గతంలో ఒకసారి ఇదే విషయమై పోలీసులను సంప్రదించాగా, వారు రాజీ కుదిర్చారని తెలిపారు. అయితే.. సోనాలి ఆడపిల్లకు జన్మనిచ్చిన తర్వాత పరిస్థితి మరింత దిగజారిందని సంజీవ్ ఆవేదన వ్యక్తం చేశారు.

సందీప్ కు మగపిల్లవాడు కావాలని కోరిక ఉండేదని తెలిపిన మృతురాలి తండ్రి.. ప్రసవం తర్వాత, అతను, అతని కుటుంబం ఆడపిల్ల అని తెలిసి ఆసుపత్రిలోనే నిర్ధాక్షణ్యంగా వదిలేసినట్లు గుర్తు చేసుకుని ఆవేదన వ్యక్తం చేశారు. తాను డబ్బులు కట్టి, ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకెళ్లాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల సోనాలి ఝాన్సీలోని ఓ గ్రామంలో తన బంధువు వివాహానికి హాజరవుతుండగా, సందీప్ ఫోన్ చేసి ఇంటికి తిరిగి రమ్మని కోరాడని సంజీవ్ చెప్పాడు. అదే రోజు ఉదయం తన కుమార్తె ఆరోగ్యం బాగోలేదని ఫోన్ వచ్చిందని, ఆ తర్వాత కొంతసేపటికి ఆమె ఉరి వేసుకుందని మరో కాల్ వచ్చిందని తెలిపారు. తను అక్కడికి చేరుకునే సమయానికి ఆమె చనిపోయిన స్థితిలో, కింద పడుకోబెట్టి ఉన్నట్లు తెలిపారు.

Also Read : అక్రమ సంబంధాలు.. భార్యపై టార్చర్.. అడ్డంగా బుక్కైన రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ

చిన్నారి అనుమానాస్పద డ్రాయింగ్, ఆమె తల్లిదండ్రుల ఆందోళనల నేపథ్యంలో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. మహిళ మృతదేహాన్ని శవపరీక్ష కోసం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైద్య నివేదిక వచ్చిన తర్వాత మరిన్ని విషయాలు తెలుస్తాయన్న కొత్వాలి నగర పోలీసు అధికారి రాంవీర్ సింగ్.. దాని ఆధారంగానే తర్వాత విచారణ ఉంటుందని తెలిపారు.

Related News

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

New Bride Incident: ఫ్రెండ్సే చంపేశారా? నవ వధువు కేసులో బిగ్ ట్విస్ట్!

Tamilnadu Crime: రాజకీయ నేత ఫామ్‌హౌస్.. ఎస్ఐని చంపేశారు, ఏం జరిగింది?

Karimnagar Crime: యూట్యూబ్ చూసి డైరెక్షన్ ఇచ్చింది.. పనంతా ప్రియుడు చేశాడు, చివరకు ఏమైంది?

Big Stories

×