Vishwak Sen Laila:తెలుగు ప్రముఖ హీరో విశ్వక్ సేన్ (Vishwak sen) హీరోగా నటించిన లైలా(Laila) సినిమా ఫిబ్రవరి 14వ తేదీన ‘వాలెంటైన్స్ డే’ సందర్భంగా విడుదలైంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ ఆకాంక్ష శర్మ (Akanksha Sharma) హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి రామ్ నారాయణ్ (Ram Narayan) దర్శకత్వం వహించారు. ఇక ఇందులో అభిమన్యు సింగ్ (Abhimanyu Singh) , హీరో పృథ్వీ (Prithvi ),30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ రాజ్(Prudhvi Raj) , నరేష్ (Naresh), బ్రహ్మాజీ (Brahmaji), వినీత్ కుమార్ (Vineeth Kumar) తదితరులు నటించారు.ఈ చిత్రాన్ని సాహు గారపాటి (Sahoo Garapati) దాదాపు రూ.40 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. కానీ సినిమా విడుదలైన తర్వాత కలెక్షన్లు పెద్దగా రాకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీనికి తోడు సినిమా విడుదలకు ముందే పలు కాంట్రవర్సీలు తలెత్తడంతో కలెక్షన్స్ విషయంలో భారీ దెబ్బ పడిందని చెప్పవచ్చు.
రూ.40 కోట్లు బడ్జెట్.. వచ్చిందెంతంటే..?
దాదాపు రూ.40 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు ఇప్పటివరకు కేవలం రూ.2.5 కోట్లు మాత్రమే వచ్చినట్లు తెలుస్తోంది. వాస్తవానికి సినిమాపై బజ్ ఏర్పడినప్పటికీ విమర్శల కారణంగా సినిమా కాస్త నెగిటివ్ టాక్ తెచ్చుకుందని చెప్పవచ్చు. దీంతో రోజురోజుకీ కలెక్షన్లు దారుణంగా పడిపోతున్నాయి. ఇక మొన్నటికి మొన్న భోజనాల ఖర్చులు కూడా రాలేదని సమాచారం. ముఖ్యంగా వైఎస్సార్ సీపీ పార్టీతో పెట్టుకోవడం వల్లే ఈ దుస్థితి వచ్చిందని, ఒక వర్గం మొత్తం వ్యతిరేకం అయిందనిఅందుకే ఇంత దారుణమైన వసూలు వస్తున్నాయని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది మాత్రం సినిమాలో పస ఉంటే కచ్చితంగా వర్కౌట్ అవుతుంది. కానీ కథలో ఇంపాక్ట్ లేకపోతే ఏం చేసినా ఏం లాభం అంటూ తమ అభిప్రాయాలుగా వ్యక్తం చేస్తున్నారు.
నష్టాన్ని విశ్వక్ భరిస్తాడా..?
ఇకపోతే ఈ సినిమాకు ఇప్పటివరకు వచ్చిన కలెక్షన్స్ నాన్ థియేట్రికల్ బిజినెస్ అన్నీ కలుపుకుంటే.. కేవలం రూ.18 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసినట్లు వినిపిస్తోంది. ఈ లెక్కన చూసుకుంటే నిర్మాతలకు దాదాపు రూ.22 కోట్లు లాస్ వచ్చినట్లు సమాచారం. సాధారణంగా ఎక్కడైనా సరే ఒక సినిమా నిర్మించిన తర్వాత ఆ సినిమా నిర్మాతలు నష్టపోతే అందులో హీరోలు స్పందించి, తమ రెమ్యూనరేషన్ లో కొంత భాగం తిరిగి ఇవ్వడం లేదా అదే నిర్మాతతో మళ్లీ ఫ్రీగా సినిమా చేస్తామని హామీ ఇవ్వడం లేదా పూర్తి రెమ్యూనరేషన్ తిరిగి ఇవ్వడం లాంటివి చేస్తూ ఉంటారు. మరి తన సినిమా తీసి భారీగా నష్టపోయిన నిర్మాత సాహు గారపాటికి విశ్వక్ సేన్ ఎలాంటి సహాయాన్ని అందిస్తారు అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికైతే విశ్వక్ తో భారీ అంచనాల మధ్య సినిమా చేసి ఇప్పుడు పూర్తిగా బోల్తా కొట్టారు. మరి ఇంత నష్టాన్ని విశ్వక్ ఎలా భరిస్తాడు అని కామెంట్లు కూడా వ్యక్తం అవుతున్నాయి. మరి దీనికి పరిష్కారం ఏమిటో తెలియాల్సి ఉంది.