Intinti Ramayanam Today Episode February 18th: నిన్నటి ఎపిసోడ్ లో.. అవనిని తప్పుగా మాట్లాడినందుకు ఇంట్లో వాళ్ళందరూ పల్లవి పై అరుస్తారు. నా భార్యకు బుద్ధి లేదు అంటావా నిన్ను అనేసి పల్లవిని కొట్టడానికి అక్షయ్ వెళ్తారు. ఇక కమల్ నువ్వు కొడితే నిన్ను మళ్ళీ క్షమాపణ చెప్పమని అడుగుతది నా భార్యని కొట్టడానికి నీకేం లేదు అన్నయ్య నేను కొట్టాలి అనేసి మా వదిన అంత మాట అంటావా మా వదినకి సిగ్గు లేదంటావని నాలుగు పీకుతాడు.. అప్పుడే అక్కడికి చక్రధర వస్తాడు.. నా కూతుర్నే కొడతావా అనేసి కమల్ దగ్గరికి వెళ్తాడు. కమలు కొడితే తప్పేంటి రా అది నా భార్య అనేసి రివర్స్ అవుతాడు. మీరంతా ఒక్కటే నా కూతురుని కొట్టాలని చూస్తున్నారా అనేసి చక్రధర్ అడుగుతాడు. మీ కూతురు ఏం మాట్లాడిందో అది ఆలోచించవా నువ్వు అని కమల్ కూడా ఇద్దరు కొట్టుకునే వరకు వెళ్తారు. ఇక చక్రధర్ ఏమయ్యా పెద్దమనిషి నీ కొడుకు నా కూతురుని కొడుతున్నాడు చోద్యం చూస్తున్నావా సర్ది చెప్పాలని లేదా అనేసి అడుగుతాడు. నీ కూతురు తప్పుగా మాట్లాడింది కాబట్టే నీ కూతుర్ని కొట్టాడు ఏ రోజైనా మీ ఫ్యామిలీ గొడవల్లోకి నేను వచ్చానా నీ భార్య నా చెల్లెలు మీరిద్దరు కొట్టుకుంటున్నారా తిట్టుకుంటున్నారా అని నేను ఏ రోజు రాలేదు అలాంటిది నువ్వు ఇప్పుడు మా ఇంట్లో గొడవల గురించి మధ్యలో దూరతావ్ ఎందుకని రాజేంద్రప్రసాద్ అరుస్తాడు. పల్లవి సారి చెప్పగానే గొడవలు ఆగుతాయి. అటు అవనికి జాబ్ వస్తుంది. ఇటు అక్షయ్ అవనిని తలచుకొని బాధతో కుమిలిపోతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. అక్షయ్ అవన్నీ తలుచుకుని బాధపడుతూ ఉంటాడు. అది చూసిన పల్లవి వీడు బాధపడతాం చూసి అత్తయ్య అవనిని తీసుకొని వస్తుంది ఎలాగైనా విరిద్దరిని దూరం చేయాలి అవని మళ్లీ ఇంటికి రాకుండా చేయాలి అని అత్తయ్య ను రెచ్చగొడితేనే ఆ పని జరుగుతుందని పల్లవి అనుకుంటుంది. ఇక పార్వతి దగ్గరికి వెళ్లి పల్లవి బావగారు చాలా బాధపడుతున్నారు అత్తయ్య ఆయన బాధని చూడలేకపోతున్నాను ఈ బాధ తగ్గిపోవాలంటే మనం ఏదో ఒకటి చేయాలి అత్తయ్య అనేసి అంటుంది.. దానికి పార్వతి అక్షయ బాధని నిజంగానే చూడలేకపోతున్నాను అవని గురించి మర్చిపోవాలంటే అక్షయ జీవితంలోకి మరొక రావాలని ఆలోచిస్తుంది.. అక్షయ బావ గురించి ఏం ఆలోచిస్తున్నారు అని పల్లవి అడుగుతుంది. ఈ బాధ నుంచి బయట పడాలంటే అక్షయ జీవితంలోకి మరో అమ్మాయి రావాల్సిందని అంటుంది. మనసులో ఉన్న మాట కూడా అదే అత్తయ్య మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే చెప్పండి నేను చేస్తాను అని పల్లవి అంటుంది.
అక్షయ్కి మరో పెళ్లి చేస్తే ఇల్లంతా గుల్ల గుల్ల అవుతుంది ఇక అవని పీడ వదిలిపోతుంది అని సంతోషంతో పల్లవి డాన్స్ వేస్తుంది. దానికి శ్రియ బయట నుంచి చూసి పల్లవి ఎందుకు ఇలా చేస్తుందని శ్రీయ ఆలోచిస్తుంది. పల్లవికి ఏదో అయిందని డాన్స్ చేస్తుంటే దగ్గరికి వెళ్లి అడుగుతుంది. జారి పడతావేమో కొంచెం జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తుంది. దానికి పల్లవి నా గురించి నీకు అవసరం లేదు నా ఇష్టం అనేసి ఒక మాటతో తేల్చేస్తుంది. నువ్వు వెళ్లి నీ పని చూసుకో పో అని పల్లవి అంటే నువ్వు పడితే చూసుకోవాల్సింది కూడా నేనే అది గుర్తుపెట్టుకో అదే నువ్వు ఏమన్నా అయితే నేనే కదా చూసుకోవాల్సిందని శ్రీయ పల్లవితో అంటుంది. నువ్వెక్కడ నుంచి వెళ్ళు అని పల్లవి శ్రీయను అంటుంది.. ఇక తర్వాత పల్లవి విడాకులు నోటీస్ పంపించాలని అనుకుంటుంది. అటు అవని స్వరాజ్యం కు దయాకర్ కి చెప్పి ఆఫీస్ కి బయలుదేరుతుంది. అవని వెళ్ళగానే పల్లవి ఇంటికి వస్తుంది. తనని మోసం చేసినందుకు అక్షయ్ బావ విడాకులు పంపించాడు దీని మీద సంతకం చేసి పంపించమని చెప్తుంది. ఇక స్వరాజ్యం మాటలు మర్యాదగా రాని నువ్వు ఏం మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదా అని వార్నింగ్ ఇస్తుంది..
ఇక అక్షయ ఆఫీస్ కి వెళ్ళగానే అక్కడున్న పూలను చూసి షాక్ అవుతాడు ఏమైంది ఎందుకు ఈ పూలన్నీ పెట్టారు అంటే మనము ఓ ఫ్లవరిస్ట్ కి కాంట్రాక్ట్ ఇచ్చాం కదా సార్ వాళ్ళు వచ్చి ఇలాంటివి చేస్తున్నారు అందులో చేసేది ఎవరో తెలుసా స్వయంగా అవని మేడమ్ ఏంటే అవ్వని ఇలాంటి ఎందుకు చేస్తుంది అని అక్షయ్ ఆలోచిస్తాడు. అసలు ఏం జరుగుతుంది అని అక్షయ్ లోపలికి వెళ్తాడు.. ఇదేంటిది కొత్తగాని అవనిని అడుగుతాడు నేను ఒక ఫ్లవర్ డెకరేషన్ దాంట్లో జాబ్ కి జాయిన్ అయ్యాను ఇక్కడ మేము ఎలా చేయగలము అనేదానికి డెమో ఇస్తున్నాము మీకు నచ్చితే మీరు మాకు కాంట్రాక్ట్ ఇవ్వచ్చు ఈ సిటీలో ఉన్న పెద్దపెద్ద ఈవెంట్స్ కి ఫ్లవరిస్ట్ గా నేనే చూసుకుంటున్నాను అని అవని అంటుంది. ఇక తర్వాత ఇంటికి వెళ్ళినా అవనీకి స్వరాజ్యం షాక్ ఇస్తుంది.. మీ ఆయన విడాకులు నోటీసు పంపించాడు అనగానే అవని షాక్ అవుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..