E-Paper
Advertisement

YouTuber Vaishnavi Case: యూట్యూబర్ వైష్ణవి హత్య కేసు.. షాకింగ్ విషయాలు వెలుగులోకి

YouTuber Vaishnavi Case: యూట్యూబర్ వైష్ణవి హత్య కేసు.. షాకింగ్ విషయాలు వెలుగులోకి
Advertisement

YouTuber Vaishnavi Case: యూట్యూబర్‌ వైష్ణవి హత్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేవలం డబ్బులు కోసం భర్త హరిబాబు ప్రేమించి పెళ్లి చేసుకుని భార్యని చంపేశాడా? దీనివెనుక ఆయన పేరెంట్స్ ఒత్తిడి ఉందా? వైష్ణవిని గొంతు నులిమి చంపాల్సిన పరిస్థితి హరిబాబుకు ఎందుకు ఏర్పడింది? వైష్ణవి అంత్యక్రియల సందర్భంగా ఆమె తల్లిదండ్రులు ఏమన్నారు?

యూట్యూబర్ వైష్ణవి హత్య కేసు షాకింగ్ విషయాలు

Advertisement

యూట్యూబర్ వైష్ణవి-హరిబాబు వ్యవహారంలో కొత్త విషయాలు బయటకు వచ్చాయి. నూరేళ్లు పాటు జీవించాలని భావించారు. పరిస్థితుల నేపథ్యంలో వివాహం జరిగిన ఏడాదిలోపు ఆమెని దారుణంగా హత్య చేశాడు భర్త. మైనర్‌గా ఉన్నప్పుడు వైష్ణవి-హరిబాబు మధ్య ప్రేమ చిగురించింది. ప్రేమ పెళ్లికి హరిబాబు తల్లిదండ్రులు ససేమిరా అన్నారు.

ప్రియురాల్ని కాదనలేక 10 నెలల కిందట వీరిద్దరు వివాహంతో ఒక్కటయ్యారు. ప్రస్తుతం వైష్ణవి ఐదు నెలల గర్భవతి. మాదాపూర్‌లోని అత్తవారి ఇంట్లో నివాసం ఉంటున్నారు. వివాహం తర్వాత హరిబాబు ఆసుపత్రిలో పని చేసేవాడట. వైష్ణవి మాత్రం ఇంట్లో పనులు చేసుకుంటూ యూట్యూబర్‌గా మారింది.

Advertisement

మాధాపూర్‌లో వైష్ణవి అంత్యక్రియలు, హరిబాబుని ఉరి తీయాలని డిమాండ్

కట్నం విషయంలో హరిబాబు-వైష్ణవి మధ్య గొడవలు జరిగాయి. ఈ వ్యవహారంలో ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. సోమవారం అర్ధరాత్రి వైష్ణవి గదిలో పెద్దగా శబ్దం వచ్చింది. కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా కూతురు-అల్లుడు నిద్రిస్తున్నట్లు నిర్ధారించుకుని తిరిగి వెళ్లిపోయారు.

సోమవారం అర్ధరాత్రి వైష్ణవి గొంతు నులిమి చంపేశాడు హరిబాబు. ఆ తర్వాత భార్య చేతులు, నుదిటిపై కత్తితో పొడిచి పొడిచినట్టు ఉంది. తన పగ తీరిందని భావించాడు.. హరిబాబు టూ వీలర్‌పై అక్కడి నుంచి పరారయ్యాడు. మంగళవారం ఉదయం లేచేసరికి వైష్ణవి రక్తపు మడుగులో పడి ఉంది.

ALSO READ: గన్నేరు పప్పు తిని ఎస్సై భార్య ఆత్మహత్య.. కారణం తెలిస్తే?

ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడారు. కట్నం కోసం వైష్ణవిని హరిబాబు కొంతకాలంగా వేధించాడని తెలిపారు. ఈ క్రమంలో దంపతుల మధ్య గొడవలు జరిగాయి. మృతురాలి తండ్రి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు పోలీసులు. హరిబాబుని ఉరి తీయాలని అప్పుడే వైష్ణవి ఆత్మకు శాంతి కలుగుతుందన్నారు ఆమె తల్లిదండ్రులు.

బుధవారం ఉదయం మాదాపూర్‌ గ్రామంలో వైష్ణవి అంత్యక్రియలు జరిగాయి. ఆ సమయంలో తల్లిదండ్రులను కన్నీరుమున్నీరు అయ్యారు. మరోవైపు హరిబాబు తల్లిదండ్రుల వైపు పోలీసులు దృష్టి సారించారు. ప్రేమ వివాహం చేసుకోవడం ఇష్టంలేని తల్లిదండ్రులు, వారి ఒత్తిడి మేరకు ఈ పని చేశాడా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

 

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×