E-Paper
Advertisement

Akshay kumar: కిలాడీ కిచెన్‌లో గ్యాస్ కష్టాలు.. యుద్ధం దెబ్బకు స్టార్ హీరో సైతం విలవిల

Akshay kumar: కిలాడీ కిచెన్‌లో గ్యాస్ కష్టాలు.. యుద్ధం దెబ్బకు స్టార్ హీరో సైతం విలవిల
Advertisement

Akshay kumar: యుద్ధం ఎక్కడో పశ్చిమాసియా (Middle East)లో జరుగుతుంటే.. దాని వేడి ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోల కిచెన్ వరకు చేరింది. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ఎల్పీజీ (LPG) సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. ముఖ్యంగా ముంబై వంటి నగరాల్లో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రమవ్వడంతో, సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఆల్టర్నేట్ ఎంటని చూస్తున్నవాళ్ళే. ఇపుడు తాజాగా ఈ జాబితాలోకి బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ కూడా చేరిపోయారు.

ట్వింకిల్ ఖన్నా ‘మాస్టర్ ప్లాన్’.. బ్యాకప్ రెడీ
ముంబైలో మంగళవారం జరిగిన ‘ముంబై క్లీన్ లీగ్’ కార్యక్రమంలో పాల్గొన్న అక్షయ్ కుమార్‌కు మీడియా నుంచి ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. ముంబైలో నెలకొన్న గ్యాస్ కొరతపై మీ స్పందన ఏంటని అడగ్గా.. అక్షయ్ తనదైన శైలిలో స్పందించారు.’ప్రస్తుతానికి మా ఇంట్లో అయితే గ్యాస్ సమస్య లేదు. కానీ మున్ముందు ఏమవుతుందోనని నా భార్య (ట్వింకిల్ ఖన్నా) మొన్ననే రెండు ఇండక్షన్ స్టవ్‌లు ఆర్డర్ చేసింది. అవి ఇంకా డెలివరీ అయ్యాయో లేదో నాకు తెలియదు కానీ.. ముందు జాగ్రత్తగా ఆమె ఈ నిర్ణయం తీసుకుంది’ అని చెప్పుకొచ్చారు ఈ కిలాడీ.అంతేకాదు, ‘ఎందుకైనా మంచిది.. మీరు కూడా ఒక ఇండక్షన్ స్టవ్ కొనుక్కుంటే బెటర్’ అంటూ అక్కడున్న వారికి, తన ఫ్యాన్స్‌కు సరదాగా సలహా ఇచ్చారు కూడా.

Advertisement

యుద్ధం ఎఫెక్ట్: ఇండక్షన్ స్టవ్‌లకు పెరిగిన డిమాండ్
భారత్ తన ఎల్పీజీ అవసరాల కోసం 60% పైగా దిగుమతులపైనే ఆధారపడుతుంది. యుద్ధం కారణంగా హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) గుండా వచ్చే సరఫరా నిలిచిపోవడంతో దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత ఏర్పడింది.  ఇప్పటికే చాలా హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడగా.. మరికొన్ని కట్టెల పొయ్యిలు, ఇండక్షన్ స్టవ్‌ల వైపు మొగ్గు చూపుతున్నాయి. అక్షయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలతో ఇప్పుడు సామాన్యులు కూడా ఇండక్షన్ స్టవ్‌ల కోసం ఎగబడుతున్నారు.

కిలాడీ చేతిలో అరడజను సినిమాలు.. త్వరలో ‘భూత్ బంగ్లా’
ఒకపక్క ఇంటి గ్యాస్ కష్టాలు ఇలా ఉంటే.. అక్షయ్ కుమార్ మాత్రం వరుస సినిమాలతో బాక్సాఫీస్ వద్ద యుద్ధానికి సిద్ధమవుతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న హారర్ కామెడీ చిత్రం ‘భూత్ బంగ్లా’ (Bhooth Bangla) ఏప్రిల్ 10, 2026న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. సుమారు 16 ఏళ్ల తర్వాత దర్శకుడు ప్రియదర్శన్‌తో అక్షయ్ చేస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇందులో టబు, పరేష్ రావల్, రాజ్‌పాల్ యాదవ్ వంటి స్టార్ కాస్ట్ నటిస్తున్నారు.ఇవే కాకుండా వెల్కమ్ టు ది జంగిల్ ,హేరా ఫేరి 3 హైవాన్ (సైఫ్ అలీ ఖాన్‌తో కలిసి) వంటి క్రేజీ ప్రాజెక్టులు అక్షయ్ చేతిలో ఉన్న సంగతి తెలిసిందే.

Advertisement

ఈ కష్టాలు తీరేదెప్పుడో ..
కోట్లు సంపాదించే అగ్ర హీరో సైతం గ్యాస్ సమస్యలకు భయపడి ఇండక్షన్ స్టవ్ కొంటున్నారంటే.. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరి యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో.. ఈ గ్యాస్ కష్టాలు ఎప్పుడు తీరుతాయో చూడాలి!

also read: రిలీజ్‌కు ముందే రికార్డ్ క్రియేట్ చేస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. ప్రీ రిలీజ్ వసూళ్లు ఎంతంటే?

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 14th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ఏమైనట్టు.. ? మాలిని జైలుకు వెళ్తుందా..?            

సోని నుంచి మరో అద్భుతం..Sony WF-C510 ఇయర్ బడ్స్ లాంచ్

హైడ్రా రంగంలోకి వస్తోంది.. ప్రకటనలు ఇచ్చేముందు ఈ రూల్స్ తెలియాలోచ్!

రూమ్ ఏదైనా సరే..ఈ టాప్-7 ప్రొజెక్టర్లతో విజువల్స్ నెక్స్ట్ లెవెల్!

Ninnu kori Serial Today Episode October 6th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ కు నిజం తెలుస్తుందా..? జీవన్ పరిస్థితి ఏంటి..?  

అంగవైకల్యంతోనే పుట్టాను…6 ఏళ్ళకే చనిపోతానని చెప్పారు, కానీ

Illu Illalu Pillalu Serial Today Episode October 2nd ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌: నర్మదను మెచ్చుకున్న రామరాజు – శ్రీవల్లి ప్లాన్ సక్సెస్ అయ్యేనా..?             

Ninnu kori Serial Today Episode October 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను  శ్రీజ మర్చిపోతుందా..? – మదన్ ప్లాన్ సక్సెస్ అవుతుందా..?    

Big Stories

Advertisement
×