BigTV English

Desires to Ask God:- దేవుడ్ని కోరాల్సిన 3 కోరికలు

Desires to Ask God:- దేవుడ్ని కోరాల్సిన 3 కోరికలు


Desires to Ask God:- ప్రతీ మనిషికి ఎన్నో కోరికలు పుడుతుంటాయి. ఒక కోరిక తీరగానే మరోటి పుడుతుంది. ఒకరికి ఇల్లు కట్టుకోవాలని, మరోకరికి కోట్ల కొద్దీ డబ్బులు కావాలని, ఇంకొకరు ఇల్లంతా బంగారం కావాలని ఇలా అంతులేని కోరికలతో తపిస్తూ ఉంటారు. అయితే దేవుడ్ని నమ్మితే కోరాల్సిన కోరికలు అవి కావంటారు.

చావు అనేది ఎవరిని ఎప్పుడు ఎలా పలకరిస్తుందో తెలియదు. ఈరోజుల్లో పుట్టుకను కూడా ముహూర్తాలు నిర్ణయించే పరిస్థితి ఉంది. కానీ చావును ఇంకా మనిషి జయించ లేదు. జయించలేడు. అందుకే దేవుడ్ని కోరే కోరే మొదటి కోరిక ముగింపు సుఖంగా జరగాలనే కోరుకోవాలి. ప్రయాణ సమయంలో కలిగే శారీరక, మానసిక పరిస్థితులు మన కంట్రోల్ లో ఉండవు. ఆ సమయంలో ఏదైనా జరిగితే ఎలాంటి ఇబ్బంది లేకుండా భగవత్ స్మరణతో అనాయాసంగా శరీరాన్ని విడవడం ఒక వరంగానే చెప్పాలి..


ఇక రెండో కోరిక విషయానికి వస్తే జీవితం ఎలా గడపాలి.. బతుకు భారంగా లేకుండా ఉండాలి. చీకు చింత, బెంగ, రోగాలు, జబ్బులు లేకుండా మనసును మెలిదీసి కుంగదీసే పరిస్థితులు రాకుండా సాఫీగా జీవితం సాగాలనే కోరుకోవాలి. ఆరోగ్యంగానే ఉన్నప్పుడే ఏదైనా చేయాలి. రోగాలతో బాధపడుతూ రోజులు వెళ్లదీయడం నరకమే..

ఇక మూడో కోరిక. మనిషి అంతిమలక్ష్యం ,జీవితానికి చివరి గమ్యం చావు కాదు. మృత్యువు తరువాత బతికి ఉన్నప్పుడు చేసిన దుష్కర్మలకు ఫలితాలు అనుభవించక తప్పవు. అందుకే మళ్ళీ దుర్గతుల పాలవకుండా, జన్మజన్మలు ఎత్తకుండా మోక్షం కలగాలని కోరుకోవాలి. పరమాత్ముడిలో ఐక్యం కావాలని దేవుడ్ని ప్రార్థించాలి.

జీవితాన్ని నడిపించే ఈ మూడు కోరికలు తీరాలంటే ముందు మంచి ఆలోచనలతో బుద్ధులతో భక్తితో మెలగాలి. అలాంటి జీవితమే దైన్యరహితం అవుతుంది. నిరంతరం భక్తితో దేవుడ్ని స్మరించేవారికి , ఆరాధన చేస్తేనే ఫలితం కలుగుతుంది.

Tags

Related News

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Big Stories

×