BigTV English

Deosan Temple:- చత్ పూజలకి ప్రసిద్ధి చెందిన డియోసన్ టెంపుల్ ఎక్కడుంది…?

Deosan Temple:- చత్ పూజలకి ప్రసిద్ధి చెందిన డియోసన్ టెంపుల్ ఎక్కడుంది…?


Deosan Temple:- ఆరో శతాబ్దంలో నిర్మించిన డియో సూర్యదేవాలయం ఎంతో ఘనమైన చరిత్ర ఉన్న ఆలయం. కోణార్క్ సూర్య దేవాలయానికి భిన్నంగా ఉంటుంది ఈ గుడి. గుప్త రాజవంశీయులు నిర్మించిన ఆలయం గురించి ఎన్నో గ్రంథాలు, శాసనాల్లో కూడా ప్రస్తావించారు. ఇస్లామిక్ రాజుల దండయాత్రలో ఆలయం దెబ్బతింది. మొఘల్ రాజులు ఆలయాన్ని పునరుద్దరించినా బ్రిటీషోళ్ల పాలనలో మళ్లీ దాడి గురైంది. ఎన్ని దండయాత్రలు చేసినా ఆలయం ఆనవాళ్లు, అవశేషాలు ఇంకా మిగిలే ఉన్నాయి. భారతీయ నిర్మాణశైలికి దర్పణంగా ఆలయం కనిపిస్తుంది. వంద అడుగుల ఎత్తున ఈగుడిని నిర్మించారు.

ఒక రాత్రిలో ఆలయాన్ని నిర్మించాలన్న సూర్యుడి కోరికతో విశ్వకర్మ స్వయంగా ఈ గుడిని నిర్మించారని పురాణాలు చెబుతున్నాయి. ఆలయానికి 4 ప్రవేశ ద్వారాలుంటాయి. అవి కూడా ఒక్కొక్కటి ఒక్కో దిశలో ఉంటాయి. తూర్పు వైపు ఉన్న ప్రధాన ద్వారం మిగతా వాటితో పోల్చితే పెద్దగా ఉంటుంది. నల్లరాతితో చేసిన ఆదిత్యుడి విగ్రహం సుమారు నాలుగు అడుగుల ఎత్తున రూపొందించారు. ఏడు గుర్రాలతో రథాన్ని నడుపుతున్నట్లు ఆదిత్యుడు దర్శనమిస్తాడు. ఏడు గుర్రాలు ఏడు రోజులకి సూచిక.


బీహార్ లోని డియో సన్ ఆలయం ప్రసిద్ద క్షేత్రంగా ఇప్పటికీ వెలుగొందుతోంది. ఏటా నిర్వహించే చత్ పూజలు ఈ ఆలయంలో చాలా ఘనంగా జరుగుతాయి. ఆలయంలోని సూర్య కుండ్ అని పిలుచుకునే చెరువును పరమ పవిత్రంగా భక్తులు భావిస్తుటారు. ఇందులోని జలం వైద్య చికిత్సలకి ఉపయోగపడుతుంది. సూర్యకుండ్ లో స్నానం చేస్తే కొన్ని మొండి రోగాలు సైతం నయమవుతాయని భక్తుల విశ్వాసం. డియో సూర్య దేవాలయం ప్రతి రోజు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు తెరిచే ఉంటుంది . గుడిలోకి వచ్చే భక్తులు కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. ఎంత డబ్బు ఉన్నా , ఏ పదవిలో ఉన్నా అందర్ని ఒక స్థాయి భక్తులగా పరిగణిస్తారు. సాధారణ వస్త్రాలు, సంప్రదాయ బద్దంగా ఉండే వాటితోనే లోపలికి రావాల్సి ఉంటుంది . చట్ పూజ కోసమే విశ్వకర్మ ఈ ఆలయాన్ని నిర్మించారు. గొడుగు లాంటి ఆకారంలో ఉన్న గుడి ఎన్ని సార్లు ఇంకా చూడాలని అనిపిస్తూనే ఉంటుంది.ఔరంగాబాద్ నుంచి ఈ ఆలయానికి వెళ్లేందుకు రోడ్డు మార్గం ఉంది.

Related News

Navaratri 2025: నవరాత్రి 6వ రోజు.. లలితా దేవిని ఏ విధంగా పూజించాలో తెలుసా ?

Bathukamma 2025: వేపకాయల బతుకమ్మ.. ఆ పేరు వెనక కథ, సమర్పించాల్సిన నైవేద్యం ఏంటి ?

Navratri 2025: దృష్టశక్తులు తొలగిపోవాలంటే.. నవరాత్రి సమయంలో ఇలా చేయండి !

Bastar Dussehra Festival: అక్కడ 75 రోజుల పాటు దసరా ఉత్సవాలు.. ప్రాముఖ్యత ఇదే!

Navratri Day 5: నవరాత్రుల్లో 5వ రోజు అమ్మవారిని.. ఏ విధంగా పూజించాలి ?

Bathukamma: అలిగిన బతుకమ్మ అనే పేరు ఎలా వచ్చింది ? ఈ రోజు నైవేద్యం ఎందుకు సమర్పించరు ?

Navratri Day-4: నవరాత్రి నాల్గవ రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Bathukamma 2025: ఐదో రోజు అట్ల బతుకమ్మ.. అట్లు నైవేద్యంగా పెట్టడం వెనక ఉన్న కారణం ఏంటి ?

Big Stories

×