BigTV English

Attukal Bhagavathy Temple:- మహిళల శబరిమల ఎక్కడుంది…?

Attukal Bhagavathy Temple:- మహిళల శబరిమల ఎక్కడుంది…?


Attukal Bhagavathy Temple:- కేరళ రాజధానిలోని అట్టుకల్ భగవతి మహిళల శబరిమలగా పేరున్న ఆలయం. సుమారు రెండు వేల సంవత్సరాల క్రితం పరశరాముడు ఈ ఆలయాన్ని నిర్మించాడని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ అమ్మవారు భద్రకాళీ అవతారంలో దర్శనమిస్తుంటారు. చూడటానికి ఎంతో విశాలంగా కనిపించే ఈ ఆలయం శక్తివంతమైన క్షేత్రంగా భక్తులు విశ్వసిస్తుంటారు. అమ్మవారిని శక్తి, ధైర్యానికి ప్రతీకగా భావిస్తుంటారు. గర్భుగుడి చూసేందుకు చిన్నగా ఉంటుంది. ఆలయంలో రెండు భగవతిదేవి విగ్రహాలు దర్శనమిస్తుంటాయి. అందులో ఒక విగ్రహాన్ని పనస చెట్టు కాండంతో తయారు చేయగా…రెండో విగ్రహాన్ని పంచలోహాలతో రూపొందించారు.

అట్టుకల్ భగవతి తమిళ ఆడపడుచు. అందుకే తిరువనంతపురంలోనే ఈ గుడి మిగితా వాటికి భిన్నంగా కనిపిస్తుంది. ఆలయ నిర్మాణశైలి కూడా అదే విధంగా ఉంటుంది.ఏటా లక్షల సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తుంటారు. ఈ ఆలయం కేవలం మహిళలను మాత్రమే అనుమతిస్తారు. పురుషులకు ఎలాంటి ప్రవేశం ఉండదు. అట్టుకల్ పొంగళ్ ఈ ఆలయంలో జరిపే అతి ముఖ్యమైన పండుగ. పది రోజులపాటు ఈ వేడుకను ఆనందంగా నిర్వహిస్తుంటారు . ఆసమయంలో మహిళా భక్తులతో ఆలయం మొత్తం నిండిపోతుంది. ఊరేగింపులు, సాంస్కృతిక కార్యక్రమాలు ఒక రేంజ్ లో జరుగుతాయి. ఉత్సవాల పదో రోజు గుడిచుట్టు పొయ్యిలు ఏర్పాటు చేసి పొంగల్ తయారు చేస్తారు. సాయంత్రానికి అమ్మవారు స్వయంగా వచ్చి అందరి నైవేద్యాలను స్వీకరిస్తారని భక్తుల నమ్మకం. ఈ ఉత్సవం గిన్నీస్ రికార్డుల్లోకి కూడా ఎక్కింది.


అమ్మవారు 8 చేతులతో భయంకరమైన రూపంలో ఇచ్చే దర్శనం భక్తులకి అభయమిస్తున్నట్టు ఉంటుంది. ఆలయం అంతా అద్భుతమైన శిల్పకళాసౌందర్యంతో ఉట్టిపడుతుంది. అష్ట కరములతో అష్ట ఆయుధాలు పట్టుకుని అమ్మవారు దర్శనమిస్తుంటారు. కేరళ సాంస్కృతిక వారసత్వానికి ఈ ఆలయం నిదర్శనంగా నిలుస్తుంది. అట్టుకల్ భగవతి ఆలయంలో జరిపే ఇతర పండుగల్లో నవరాత్రి ఫెస్టివల్ సంబరాన్ని అంబరాన్ని తాకుతుంది.

Tags

Related News

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Big Stories

×