Big Stories

Lemons Auction in Temple : 9 నిమ్మకాయలు రూ.2.36 లక్షలు.. ఎందుకంత స్పెషల్ ? ఏముంది వాటిలో ?

- Advertisement -

Lemons Auction in Tamilnadu Villupuram Temple : హిందువులకు దేవుళ్లంటే అమితమైన భక్తి. భయం కూడా అంతే ఉంటుంది. తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడని నమ్మేవాళ్లు ఈ రోజుల్లోనూ చాలామంది ఉన్నారు. దేవుడంటే భయం, భక్తి ఉండటం సహజం. కానీ.. టెక్నాలజీ కొత్తపుంతలు తొక్కుతున్న టెక్ యుగంలోనూ మూఢనమ్మకాలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. మంత్రించిన యంత్రాలు లేదా నిమ్మకాయలు ఇంట్లో పెట్టుకుంటే కోటీశ్వరులైపోతారన్న మాటలు విని.. ఉన్న సొమ్మును కూడా పోగొట్టుకుంటున్నారు. తాజాగా తమిళనాడు విల్లుపురంలో ఉన్న ప్రసిద్ధ దేవాలయంలో జరిగిన ఓ సంఘటన అందరినీ ముక్కున వేలేసుకునేలా చేస్తోంది.

- Advertisement -

ఇటీవల ఆ ఆలయంలో పంగుని ఉత్తిరం పూజా ఉత్సవం పూర్తయింది. ఆ తర్వాత ఆలయంలో 9 నిమ్మకాయల్ని వేలం వేశారు. ఈ వేలంలో నిమ్మకాయలు ఏకంగా 2 లక్షల 36 వేల రూపాయల వరకూ పలకడం గమనార్హం. ఈ నిమ్మకాయలు ఇంత వేలం పలకడానికి కారణం.. వాటిని దేవుడి పూజా ఉత్సవంలో ఉపయోగించిన ఈటెకు వాడటమే.

Also Read : శని రాశిలో శత్రు గ్రహాల సంయోగం.. ఈ రాశులకు ధన లాభం..

ప్రస్తుతం మార్కెట్ లో 20 రూపాయలకు 2 లేదా 3 నిమ్మకాయలు లభిస్తుండగా.. ఈ ఆలయం వేలంలో మాత్రం 9 నిమ్మకాయలు లక్షలు పలకడం షాక్ కు గురిచేసింది. అయితే ప్రతిఏటా ఈ ఆలయంలో ఇదే సంప్రదాయం కొనసాగుతుంది. దేవుడి పూజలో ఉపయోగించిన నిమ్మకాయల్ని ఆఖరిరోజున వేలం వేస్తారు. ఈ నిమ్మకాయల్లోని నిమ్మరసం తాగితే వంధ్యత్వం అంటే.. పిల్లలు లేనివారికి పిల్లలు కలుగుతారని నమ్మకం.

అలాగే కుటుంబంలో ఆనందం, శ్రేయస్సు ఉంటుందని విశ్వసిస్తారు. అందుకే సంతానం లేనివారు మురుగ భగవానుడి బల్లెంకు ఉంచిన ఈ నిమ్మకాయలకు అద్భుతమైన శక్తులున్నాయని నమ్ముతారు. 9 రోజుల ఉత్సవాల్లో ఆలయ పూజారి ప్రతిరోజూ ఈటెతో నిమ్మకాయను గుచ్చుతారు. ఆ తర్వాత పండుగ చివరి రోజున ఆలయ నిర్వాహకులు నిమ్మకాయలను వేలం వేస్తారు. వీటిలో తొలిరోజు నిమ్మకాయకు అత్యధిక శక్తులుంటాయని నమ్మకం. ఈ ఏడాది వేలంలో కులత్తూరుకు చెందిన దంపతులు తొలిరోజు నిమ్మకాయను రూ.50,500కు కొనుగోలు చేశారు. మొత్తం 9 నిమ్మకాయల్ని రూ.2,36,100కు వేలం వేశారు. ఇప్పుడీ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఈ విషయం తెలిసిన నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు ఇలాంటి నమ్మకాలే నిజంగా జరుగుతాయని చెబుతుంటే.. మరికొందరు మాత్రం ఈ రోజుల్లో కూడా ఇలాంటి మూఢనమ్మకాలేంటని కొట్టిపారేస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News