BigTV English

Family Star Trailer: ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ వచ్చేసింది బాసూ.. ఎలా ఉందో మీరూ చూసేయండి

Family Star Trailer: ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ వచ్చేసింది బాసూ.. ఎలా ఉందో మీరూ చూసేయండి
Family Star Trailer
Family Star Trailer

Family Star Trailer: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ నటిస్తోన్న కొత్త చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’. ‘గీతా గోవిందం’ మూవీ డైరెక్టర్ పరుశురామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో విజయ్‌కు జోడీగా అందాల ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, సాంగ్ సినిమాపై ఫుల్ హైప్ క్రియేట్ చేశాయి. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ వదిలారు. ఈ మేరకు ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.


ట్రైలర్ ప్రకారం.. విజయ్ దేవరకొండ ఓ కంపెనీలో వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ట్రైలర్ స్టార్టింగ్‌లో విజయ్ దేవున్ని ప్రార్థిస్తూ.. స్వామి నువు కొత్తగా నా లైఫ్‌లో బ్రేకులేమి ఇవ్వాల్సిన పనిలేదు.. ఉన్నదాన్ని మాత్రం చెడగొట్టకు అనే డైలాగ్‌తో స్టార్ట్ అయింది.

ఆ తర్వాత అతడు పనిచేసే కంపెనీకి వెళ్లేటప్పుడు లిఫ్ట్‌లో కాకుండా కొన్ని ఫ్లోర్లు మెట్లు ఎక్కి వస్తాడు. అయితే అక్కడ ఉండే సెక్యూరిటీ అతడిని.. ఎందుకు సార్ లిఫ్ట్ ఉంటుండగా.. ఇన్ని ఫ్లోర్లు మెట్లు ఎక్కి వస్తారు అని అంటాడు.


Also Read: బ్రేకింగ్: హీరో నవీన్ పొలిశెట్టికి యాక్సిడెంట్.. చేతికి తీవ్ర గాయాలు..

అయితే అప్పుడు విజయ్.. లిఫ్ట్‌లు ఉన్నాయని ఎక్కేసి, సిగరెట్లు ఉన్నాయని కాల్చేసి, మందు ఉందని తాగేస్తే హెల్త్ బొ… అనే డైలాగ్ చెప్తాడు. ఆ డైలాగ్ చెప్పిన తర్వాతి సీన్‌లోనే బీర్ బాటిల్ దించకుండా తాగేస్తాడు. అలాగే హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఎంట్రెన్స్.. అయితే తనకు సరదాగా ఉండేవాళ్లే ఇష్టమంటూ చెప్తుంది.

అయితే ఇందులో ఫస్ట్ హాఫ్ మొత్తం విజయ్ జెంటిల్ మ్యాన్‌లా కనిపిస్తున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. ఆ తర్వాత విజయ్, మృణాల్ కలిసి మెలిసి ఒక ఫ్రెండ్స్‌లా ఉంటారు. ఆ తర్వాత వీరి మధ్య ప్రేమ స్టార్ట్ అవుతుంది. అది మొదట్లో చాలా క్యూట్ ఉన్నట్లు చూపించారు.

కానీ ఆ తర్వాత వారిద్దరి మధ్య గొడవలు, అలకలు, ఫైట్ సీన్స్ ఇలా చాలానే కట్ చేసి చూపించారు. ఒక రకంగా చెప్పాలంటే సినిమా ఫస్ట్ హాఫ్ కామెడీ ఎంటర్‌ట్రైనర్‌లా.. సెకండాఫ్ మొత్తం లవ్ ఎమోషన్స్ అండ్ ఫుల్ మాస్ యాక్షన్‌లా ఉండబోతున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది.

Related News

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

SivaJyothi: గుడ్ న్యూస్ చెప్పబోతున్న శివ జ్యోతి… బుల్లి సావిత్రి రాబోతోందా?

Movie Industry : ఇండస్ట్రీలో ఇవి మారాల్సిందే… లేకపోతే దుకాణం క్లోజ్ ?

Big Stories

×