E-Paper
Advertisement

Mistery temples: సైటింస్టులకే అంతు చిక్కని మిస్టరీ – ఆ టెంపుల్స్‌ హిస్టరీ చూస్తే గూస్‌ బంప్సే

Mistery temples: సైటింస్టులకే అంతు చిక్కని మిస్టరీ – ఆ టెంపుల్స్‌ హిస్టరీ చూస్తే గూస్‌ బంప్సే
Advertisement

Mistery temples: ఇండియా అంటేనే మిస్టరీలకు పెట్టింది పేరు. భారతదేశంలో ఎక్కడ చూసినా దేవాలయాలు దర్శనమిస్తూనే వుంటాయి. అయితే వీటిలో కొన్ని మిస్టరీతో మిళితమై ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.  మన దేశంలో ఎన్నెన్నో మిస్టరీలున్న దేవాలయాలు చాలా వున్నాయి. ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క ప్రత్యేకత కలిగివుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.

తంజావూరు:

తంజావూరులోని బృహదీశ్వరాలయం ఇప్పటికి ఒక మిస్టరీగానే వుంది. ఈ ఆలయపు నీడలు ఎవరికి కనిపించవు. సంవత్సరం పొడుగునా ఏ రోజైనా ఈ ఆలయపు నీడ కనిపించదు. ఎతో ఎత్తులో ఉన్న గోపురం నీడ కూడా భూమి మీద పడకపోవడం ఈ ఆలయం మిస్టరీ. ఎంతో మంది సైంటిస్టులు ఈ ఆలయ రహాస్యాన్ని చేధించేందుకు కృషి చేసి విఫలం అయ్యారు. ఇక ఆ ఆలయానికి ఉపయోగించిన గ్రానైట్ కూడా ఎక్కడ నుండి తీసుకోచ్చారనేది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. ఈ ఆలయాన్ని రాజరాజచోళుడు 11 వ శతాబ్దంలో నిర్మించాడు.

శని శింగనాపూర్‌:

Advertisement

ఈ ఊరిలో ఏ ఇంటికి తలుపులు ఉండవు. ఇక్కడి జనానికి దొంగతనం చేయాలనే తలంపే రాదట. ఒకవేళ అలా చేస్తే ఇక్కడి శనీశ్వరుడు శిక్షిస్తాడని స్థానికుల నమ్మకం. వేరే ఊరి వ్యక్తులు ఈ ఊరిలో దొంగతనం చేసినా.. వాళ్లు ఎంత దూరం వెళ్లినా తిరిగి ఇదే గ్రామానికి సరిగ్గా ఆ దొంగ.. దొంగతనం చేసిన చోటికే చేరుకుంటాడని స్థానికులు చెప్తుంటారు.. ఈ మిస్టరీ చేధించడానికి ఎంతో మంది సైంటిస్టులు ప్రయత్నించి విఫలం అయ్యారట. ఈ శని శింగనాపూర్‌ గ్రామం మహారాష్ట్రలో ఉంది.

షోలాపూర్:

మహారాష్ట్రలోని షోలాపూర్ మనం రోజూ ఉపయోగించే బెడ్ షీట్ లకు పెట్టింది పేరు. ఇక్కడ ఒక వింత గ్రామం వుంది పేరు షెత్పల్.. ఈ గ్రామంలో పాములకు పూజ చేయటం ఆనవాయితీ. ఈ గ్రామంలో ప్రతి ఇంట్లో పాములకు కూడా ఒక గది ఉంటుందట. ప్రతి ఇంట్లో మనుష్యులు తిరిగినట్టే పాములు కూడా తిరుగుతూ ఉంటాయట. కానీ ఇంతవరకూ ఆ గ్రామంలో ఏ పాము ఎవరినీ కరిచినట్టు కంప్లైంట్స్ కూడా లేవట.  ఆ పాముల మిస్టరీని చేధించేందుకు రంగంలోకి దిగిన శాస్త్రవేత్తలు ఉత్తి చేతులతో  ఆ ఊరు వదిలి వెళ్లిపోయారట.

యాగంటి:

Advertisement

యాగంటి బసవన్న లేచి రంకెలేస్తే కలియుగం అంతం అవుతుందని కాలజ్ఞానంలో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పారు. ఆయన చెప్పిన నంది విషయంలో చేధించలేని మిస్టరీ ఒకటి హిస్టరీగానే మిగిలిపోయింది. యుగాల నాటి ఆ నంది విగ్రహం రోజు రోజుకు ఎత్తు పెరుగుతుందట. అందకు సాక్ష్యాలు కూడా చూపిస్తున్నారు ఆలయ నిర్వాహకులు. ప్రతి 20 సంవత్సరాలకు ఒక ఇంచు చొప్పున ఆ నంది పెరుగుతుందట. అయితే నంది పెరగడంపై శాస్త్రవేత్తలు ఆ నందిని చెక్కిన రాయికి పెరిగే గుణం ఉందని సైంటిఫిక్‌ రీజన్‌ చెప్తున్నారు కానీ అది ఎలా పెరుగుతుందన్నది మాత్రం కచ్చితంగా చెప్పలేకపోయారు. అందుకే ఈ నంది మిస్టరీ కూడా హిస్టరీగానే మిగిలిపోయింది.

లేపాక్షి:

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలోని లేపాక్షి ఆలయంలో కూడా శాస్త్రవేత్తలు చేధించలేని మిస్టరీ ఉంది. అక్కడి గుడిలో స్థంభాలు కింద ఎటువంటి ఆధారం లేకుండా ఉంటాయి. వాటి కింద నుంచి పేపర్‌ కానీ క్లాత్‌ కానీ ఈజీగా అటూ ఇటూ తిప్పొచ్చు.. అంటే ఈ స్థంభాలకు కింద భూమికి మధ్య గ్యాప్‌ ఉందని అవి గాలిలో ఆలా ఎలా నిలబడి ఆలయ బరువును మోస్తున్నాయో ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది.

పూరీజగన్నాథ్ ఆలయం:

పూరీజగన్నాథ్ ఆలయంలో నీడ ఎలాంటి సమయంలో కూడా కనిపించదు. అంతే కాదు పూరీ క్షేత్రానికి సమీపంలో బంగాళాఖాతం సముద్రం వుంది. ఆ సముద్రపు శబ్దం కూడా ఈ ఆలయంలోకి వినిపించదు. ఆలయ సింహద్వారం వరకూ సముద్రఘోష వినిపిస్తుంది. అది దాటి లోపలికి వెళ్తే శబ్దం అనేదే వుండదు. మరి ఆ టెక్నాలజీ ఏంటో కూడా ఇప్పటికీ అంతు చిక్కలేదు..

అమ్రోహా:

ఉత్తరప్రదేశ్ లోని అమ్రోహా షర్ఫుద్దీన్ షావిలాయత్ కు ప్రసిద్ధిచెందింది. ఈ పుణ్యక్షేత్రం చుట్టూ కాపలాగా ఎవరుంటారో తెలుసా? తేళ్ళు! అవును.. ఇక్కడ ఆలయం లోపల.. చుట్టూ తేళ్ళు తిరుగుతూనే వుంటాయి. ఒకటి కాదు, రెండు కాదు వేలసంఖ్యలో.. అయితే ఇవి అక్కడకు వచ్చే భక్తులను కుట్టవు. వారు వాటిని పట్టుకుంటారు కూడా

ఇలాంటి ఎన్నో మిస్టరీలు మనదేశంలో ఉన్నాయి. వీటి రహస్యాలు ఏంటి అన్నది మన శాస్త్రవేత్తలకు ఇంతవరకు అంతుచిక్కడం లేదు. అవి ఇప్పటికీ  మిస్టరీ గానే మిగిలిపోయాయి.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

 

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×