E-Paper
Advertisement

CM Revanth Reddy: మీరు హుస్సేన్ సాగర్‌కు వెళ్తున్నారా..? అయితే, సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన గుడ్‌న్యూస్ మీ కోసమే..

CM Revanth Reddy: మీరు హుస్సేన్ సాగర్‌కు వెళ్తున్నారా..? అయితే, సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన గుడ్‌న్యూస్ మీ కోసమే..
Advertisement

CM Revanth Reddy: రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా నగర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. తెలంగాణలో బౌద్ధ పర్యాటక స్థలాలను అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అందులో భాగంగా నల్లగొండలోని నాగార్జున సాగర్ లో ఉన్న బుద్ధవనంలో అంతర్జాతీయ మ్యూజియాన్ని ఏర్పాటు చేయాలని, దీనితోపాటు బోటింగ్ ను పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకున్నది.

వివరాల్లోకి వెళితే.. రాష్ట్రంలో ఉన్నటువంటి బౌద్ధ పర్యాటక స్థలాలను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు దేశ విదేశాల్లోని బుద్ధిస్టులను ఆకట్టుకునేలా బుద్ధవనంలో ఇంటర్నేషనల్ బుద్ధ మ్యూజియంను నెలకొల్పే ప్రతిపాదనలను సిద్ధం చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కొత్త టూరిజం పాలసీలో భాగంగా తెలంగాణలో చారిత్రాత్మకంగా పేరొందిన నేలకొండపల్లి, ఫణిగిరి, నాగార్జునసాగర్ బౌద్ధ క్షేత్రాలతోపాటు హుస్సేన్ సాగర్ లో ఉన్న బుద్ధ విగ్రహాన్ని ఒకే టూరిజం సర్క్యూట్ గా అభివృద్ధి చేయాలని ఆయన సంకల్పించారు. కేంద్రప్రభుత్వం ప్రకటించిన స్వదేశీ దర్శన్ 2.0 స్కీమ్ లో భాగంగా బుద్ధవనం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే కేంద్రానికి డీపీఆర్ ను సైతం పంపించిన విషయం తెలిసిందే. రూ. 25 కోట్ల అంచనాలతో బుద్ధవనంలో బుద్ధిస్ట్ డిజిటల్ మ్యూజియం అండ్ ఎగ్జిబిషన్, డిజిటల్ ఆర్కివ్స్ ఏర్పాటు చేయాలని అందులో ప్రతిపాదనలు చేసింది.

Advertisement

Also Read: మీరు గ్రూప్ -3 పరీక్ష రాస్తున్నారా..? అయితే, ఈ గుడ్‌న్యూస్ తెలుసా..??

అదేవిధంగా వీటితోపాటు తాజాగా ఇంటర్నేషనల్ బుద్ధ మ్యూజియంను ఈ ప్రణాళికలో పొందుపరచనున్నది. అందులో భాగంగా నాగార్జున సాగర్ బుద్ధవనాన్ని టూరిజం, స్పిర్చువల్ డెస్టినేషన్ సెంటర్ గా తీర్చిదిద్దనున్నారు. నాగార్జున సాగర్ డ్యామ్ అందాలతోపాటు పరిసరాల్లోని బుద్ధవనాన్ని అంతర్జాతీయ బౌద్ధక్షేత్రంగా అభివృద్ధి చేయాలని రాష్ట్రం సంకల్పించింది. నాగార్జున సాగర్ పర్యటనకు వెళ్లే పర్యాటకులు బ్యాక్ వాటర్ వరకు బోట్ లో విహరించేందుకు ఏర్పాటు పునరుద్ధరించాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకులను ఆకర్శించేందుకు అనువైన టూరిజం ప్యాకేజీలను రూపొందించనున్నారు. హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్ వరకు ఫోర్ లేన్ రోడ్ ను నిర్మించనున్నారు. ఈ రహదారికి ప్రతిపాదనలను తయారు చేయాలని ఆర్ అండ్ బీ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ఆదేశించారు.

Advertisement

Also Read: హైడ్రా ఏమైనా సర్వరోగ నివారిణా?: బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఫైర్

ఇదిలా ఉంటే.. రాష్ట్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ హుస్సేన్ సాగర్ బుద్ధ విగ్రహం చుట్టూ టూరిజం డెస్టినేషన్ సర్కిల్ గా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ట్యాంక్ బండ్, తెలంగాణ అమరుల జ్యోతి, నెక్లెస్ రోడ్డు, సంజీవయ్య పార్కు వరకు వలయాకారంలో స్కై వాక్ వే డిజైన్ చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఈ ప్రాంతాన్ని భవిష్యత్తులో వరల్డ్ క్లాస్ టూరిజం రూపొందించాలంటూ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అనుభవమున్న కన్సెల్టీన్సీలు, నిపుణులతో అంతర్జాతీయ స్థాయి నమూన డిజైన్లు తయారు చేయించాలన్నారు. పర్యాటకులు ఆహ్లాదంగా గడిపేలా ఫుడ్ కోర్టులు, వివిధ స్టాళ్లను ఏర్పాటు చేసి ఈ ప్రాంతాన్ని సిటీలో సుందరమైన ప్రాంతంగా తీర్చిదిద్దాలని ఆయన ఆదేశించారు. గోల్కొండ చుట్టూ ఉన్న రోడ్లు కూడా ఇరుకుగా ఉన్నాయని, వాటిని కూడా విశాలంగా చేయాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. ఆక్రమణలుంటే తొలగించాలని, అక్కడున్న ఇండ్లవాసులు, దుకాణదారులు నిరాశ్రయులు కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. వారికి ఇంకోచోట పునరావసం కల్పించాలన్నారు.

Related News

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

కుషాయిగూడ పీహెచ్‌సీలో ఊహించని పరిణామం.. డాక్టర్‌గా మారిన డీఎంహెచ్‌ఓ!

Big Stories

Advertisement
×