E-Paper
Advertisement

Garuda Purana Part 04: ఆత్మ చేరుకునే నాలుగో పట్టణం గంధర్వపురం – ఆత్మను వేధించే మానసిక వేదన, తీవ్రమైన ఆకలి

Garuda Purana Part 04: ఆత్మ చేరుకునే నాలుగో పట్టణం గంధర్వపురం – ఆత్మను వేధించే మానసిక వేదన, తీవ్రమైన ఆకలి
Advertisement

Garuda Purana Part 04: గరుడ పురాణం ప్రకారం ఆత్మ యమలోకానికి చేసే ప్రయాణంలో గంధర్వపురం అనేది నాలుగవ పట్టణం. వైతరిణి నదిని దాటిన తర్వాత, తన పాపపు మూటను మోస్తూ ఆత్మ ఈ నగరానికి చేరుకుంటుంది.

గంధర్వపురం ఎలా చేరుకుంటుంది: ఆత్మ తన ప్రయాణంలో మూడవ పట్టణమైన ‘సౌరిపురం’ దాటిన తర్వాత, ఒక నెల కాలం పాటు నడుస్తూ గంధర్వపురం చేరుకుంటుంది. ఈ మార్గం అంతా ముళ్ళతో, రాళ్లతో నిండి ఉంటుంది. మరణించిన తర్వాత నాలుగవ నెలలో ఆత్మ ఈ నగరానికి చేరుకుంటుంది. అప్పటికే ఆకలి దప్పులతో అలమటిస్తున్న ఆత్మ, యమదూతల హింస భరించలేక దీనంగా విలపిస్తూ ఇక్కడికి వస్తుందట.

Advertisement

అక్కడ అనుభవించే శిక్షలు మరియు బాధలు: గంధర్వపురంలో ఆత్మ పడే బాధలు అత్యంత భయంకరంగా ఉంటాయని గరుడపురాణంలో ఉందని పండితులు చెప్తున్నారు. యమదూతలు ఆత్మను పాశాలతో కట్టి, గదల వంటి ఆయుధాలతో కొడుతూ నడిపిస్తారట. “నువ్వు బతికున్నప్పుడు పుణ్యకార్యాలు ఎందుకు చేయలేదు?” అంటూ గద్దిస్తూ హింసిస్తారట. ఈ ప్రయాణంలో ఆత్మ తన ఇంటిని, భార్యాపిల్లలను, సంపాదించిన ఆస్తిని తలచుకుని భోరున ఏడుస్తుందట. అక్కడ ఉండే ఇతరుల రోదనలు విని ఆత్మ మరింత భయభ్రాంతులకు గురవుతుందట. ఆ సమయంలో ఆత్మకు విపరీతమైన ఆకలి వేస్తుందట. కానీ అక్కడ తినడానికి ఏమీ ఉండదట. కేవలం ఆ నాలుగవ నెలలో బంధువులు పెట్టే ‘మాసిక శ్రాద్ధం’ (పిండం) మాత్రమే ఆత్మకు ఏకైక ఆహారమట. గంధర్వపురంలో ఆత్మ తాను చేసిన ప్రతి అబద్ధాన్ని, ప్రతి అన్యాయాన్ని గుర్తు చేసుకుని పశ్చాత్తాపంతో కుమిలిపోతుందట.

గంధర్వపుర విశేషాలు: ఈ నగరానికి గంధర్వులు అధిపతులుగా ఉంటారట. వారు ఆత్మను పరీక్షకు గురిచేస్తారట. ఆత్మ గంధర్వపురంలో ఉన్నప్పుడు బంధువులు ఇచ్చే నాలుగవ మాసిక పిండం ఆత్మకు బలాన్నిస్తుందట. ఒకవేళ బంధువులు ఈ కర్మలు చేయకపోతే, ఆత్మ ఆకలితో అలమటిస్తూ, ఆ దప్పిక తీరక మరింత నరకయాతన అనుభవిస్తుందట. ఈ పట్టణంలో కొంతకాలం గడిపిన తర్వాత, ఆత్మ తన తదుపరి పట్టణమైన ‘శైలాగమం’ వైపు ప్రయాణించాల్సి ఉంటుందట.

Advertisement

వైతరిణి నది దాటిన తర్వాత వచ్చే ఈ గంధర్వపురం, ఆత్మకు తన పాపాల తీవ్రతను మొదటిసారిగా పూర్తిస్థాయిలో రుచి చూపిస్తుందట. అందుకే మన సంప్రదాయంలో మరణానంతరం చేసే మాసిక కర్మలకు అంత ప్రాధాన్యత ఉందని పండితులు చెప్తుంటారు.

NOTE: ఇక ఆత్మ తన యమలోక ప్రయాణంలో ఐదవ పట్టణమైన శైలాగమానికి ఎలా చేరుకుంటుంది. ఎన్ని కష్టాలు, బాధలు అనుభవిస్తుంది. అక్కడ ఆత్మకు విధించే భయంకరమైన శిక్షలు ఏంటి..? అనే విషయాలు రేపటి కథనంలో తెలుసుకుందాం.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: మూడో పట్టణం నగేంద్రభవనం చేరుకున్న ఆత్మ – పెళ్లాం పిల్లలు గుర్తొచ్చి రోదిస్తుందట

 

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×