Chanakyaniti: ఆచార్య చాణక్యుడు అత్యంత జ్ఞాన వంతుడు , పండితుడు. తన జీవిత కాలంలో.. మానవజాతి సంక్షేమం కోసం అనేక విధానాలను రూపొందించాడు. ఈ విధానాలే తరువాత చాణక్య నీతిగా ప్రసిద్ధి చెందాయి. ఎవరైనా విజయవంతమైన , సంపన్నమైన జీవితాన్ని కోరుకుంటున్నట్లయితే.. వారు చాణక్య నీతిలో పేర్కొన్న విషయాలను ఖచ్చితంగా గుర్తుంచుకోవాలని చెబుతారు.
మీరు మీ జీవితంలో పురోగతి సాధించాలనుకుంటే లేదా విజయం సాధించాలనుకుంటే కొన్ని ప్రశ్నల గురించి ముందుగా తెలుసుకోవాలి. ఈ ప్రశ్నలకు మీ దగ్గర సమాధానాలు ఉన్నప్పుడు.. మాత్రమే మీరు ఇబ్బందులకు దూరంగా ఉంటారు. అంతే కాకుండా సక్సెస్ సాధించి ఆర్థిక నష్టాన్ని ఎదుర్కుంటారు.
1. నిజమైన స్నేహితుడు ఎవరు ?
చాణక్య నీతి ప్రకారం.. ఒక వ్యక్తి తన చుట్టూ ఉన్న వారిలో ఎవరు తన నిజమైన స్నేహితులు, తనను ఎవరు ఉపయోగించుకుంటున్నారనే అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలి. మీరు మీ స్నేహితులు ఎవరో, శత్రువులేవరో గుర్తించకపోతే.. మీరు మీ జీవితంలో ఎప్పటికీ విజయం సాధించ లేరు. ఇతరులకు ఇబ్బంది కలిగించడం ద్వారా ఆనందం పొందే వారితో స్నేహం చేయకుండా ఉంటేనే మంచిది. అలాంటి వ్యక్తుల నుండి మీరు వీలైనంత దూరం పాటించాలి. ఈ రకమైన వ్యక్తులు చాలా చెడ్డ మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అందుకే ఎవరు ఎలాంటి వారో ముందుగానే అవగాహన కలిగి ఉండటం చాలా ముఖ్యం.
2.విషయాలు ఎలా జరుగుతున్నాయి ?
ఆచార్య చాణక్యుడి ప్రకారం.. తన సమయం లేదా జీవితం ప్రస్తుతం ఎలా గడుస్తుందో తెలిసిన వ్యక్తి మాత్రమే జీవితంలో విజయం సాధించి తెలివైనవాడిగా మిగిలిపోతాడు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం అతనికి తెలిసి నప్పుడు మాత్రమే అతను సరైన నిర్ణయం తీసుకోగలడు. మంచి నిర్ణయాలు తీసుకున్నప్పడు మాత్రమే సక్సెస్ మీ సొంతం అవుతుంది.
3. ఎలాంటి ప్రదేశంలో నివసిస్తున్నాడు ?
ఒక వ్యక్తి తన జీవితంలో పురోగతి సాధించాలనుకుంటే లేదా విజయం సాధించాలనుకుంటే.. అతను ఏ నగరంలో, ఏ ప్రదేశంలో నివసిస్తున్నాడు అనే ప్రశ్నకు అతని వద్ద సమాధానం ఉండాలి. ఇది మాత్రమే కాదు.. అతను పనిచేసే ప్రదేశం గురించి కూడా తెలుసుకోవాలి. ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరికితే.. అతను జీవితంలో ఖచ్చితంగా విజయం సాధిస్తాడు.
4.ఆదాయం, ఖర్చులు ఎంత ?
తెలివైన , విజయవంతమైన వ్యక్తి యొక్క అతిపెద్ద లక్షణం ఏంటంటే..అతని ఆదాయం, డబ్బు ఎక్కడ ఖర్చు చేయబడుతుందో అతనికి పూర్తి అవగాహన ఉంటుంది. తన దగ్గర ఎంత డబ్బు ఉందో.. ఎంత ఖర్చు చేయాలో అతనికి బాగా తెలుస్తుంది. ఈ ప్రశ్నకు సమాధానం దొరికినప్పుడు.. మాత్రమే డబ్బు ఆదా చేయడం చాలా సులభం అవుతుంది.
Also Read: ఈ వస్తువులను పొరపాటున కూడా ఎవ్వరికీ ఇవ్వకూడదు, ఎందుకంటే ?
5. మీరు ఏం చేయగలరు ?
చాణక్య నీతి ప్రకారం.. ఒక వ్యక్తి తాను ఏమి చేయగలడో , అతని సామర్థ్యం ఏమిటో ముందుగా తెలుసుకోవాలి. ఈ ప్రశ్నకు సమాధానం దొరికినప్పుడు.. మాత్రమే దానికి అనుగుణంగా ప్రవర్తించేందుకు అవకాశం ఉంటుంది. ఒక వేళ మీరు ఈ ప్రశ్నకు సమాధానం లభిస్తే గనక సక్సెస్ కోసం మీ సామర్థ్యం కంటే ఎక్కువగా పనిచేయడం ప్రారంభిస్తారు.