BigTV English

VC Sajjanar: యూట్యూబర్ హర్షసాయిపై కేస్ ఫైల్.. వదిలిపెట్టేది లేదంటున్న సజ్జనార్..!

VC Sajjanar: యూట్యూబర్ హర్షసాయిపై కేస్ ఫైల్.. వదిలిపెట్టేది లేదంటున్న సజ్జనార్..!

VC Sajjanar: బెట్టింగ్ యాప్స్.. ఎంతలా ప్రజలను బలి చేస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బెట్టింగ్ యాప్స్ అనేవి మద్యం కంటే ప్రమాదకరం.. క్యాన్సర్ కంటే హానికరం.. ముఖ్యంగా ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి మెదడును పురుగులాగా తినేస్తున్నాయని ఇప్పటికే ఎంతోమంది చెబుతున్నా.. దీని బారిన పడినవారు మాత్రం బయటపడ్డానికి.. ఊబిలో పడ్డట్టు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్ లో డబ్బు పెట్టుబడిగా పెట్టడం మొదలైన తర్వాత ఆస్తులను కూడా అమ్ముకొని, చివరికి అప్పుల పాలై, ఆ అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకున్న వారు కూడా ఉన్నారు. ఇక ప్రజలు ఇలా ఈ బెట్టింగ్ యాప్స్ బారినపడి తమ డబ్బును ఇతరులకు ధారాళంగా ధారపోస్తూ ప్రాణాలు కోల్పోతున్న నేపద్యంలో .. తెలంగాణ ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఐఏఎస్ వీసీ సజ్జనార్ (IAS VC Sajjanar) సమాజానికి హాని కలిగించే ఈ చీడపురుగులను ఏరిపారేస్తున్నారు. అందులో భాగంగానే ఒక్కొక్కరిగా సోషల్ మీడియా ద్వారా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిని ఏరుతూ అరెస్టు చేస్తున్నారు.


హర్ష సాయి పై కేస్ ఫైల్..

అందులో భాగంగానే మొత్తం 74 మందిని ఐడెంటిఫై చేసినట్లు సమాచారం. అంతేకాదు ఇలాంటి వారిని గుర్తిస్తే వెంటనే డైరెక్ట్ గా మెసేజ్ పెట్టండి అంటూ సోషల్ మీడియా ద్వారా యువతను సజ్జనార్ కోరిన విషయం తెలిసిందే. ఇప్పటికే యూట్యూబర్ నానిని అరెస్టు చేయగా.. భయ్యా సన్నీ యాదవ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. సినీ సెలబ్రిటీ విష్ణుప్రియ(Vishnu Priya) పై కూడా యాక్షన్ తీసుకోవాలని ఇటీవలే కొంతమంది నెటిజన్స్ కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ లో పలుమార్లు దొరికిపోయిన యూట్యూబర్ హర్ష సాయి(Harsha Sai) పై కూడా ఫైర్ అయ్యారు సజ్జనార్. దీంతో రంగంలోకి దిగిన సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ముఖ్యంగా నిబంధనలకు విరుద్ధంగా బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తూ.. పైగా తానేదో గొప్ప పని చేస్తున్నానంటూ సమర్ధించుకుంటున్న యూట్యూబ్ హర్ష సాయికి సర్జనార్ భారీ షాక్ ఇస్తూ కేసు ఫైల్ చేయించారు.


కలుపు మొక్కలు తీసి పారేయడమే పని – సజ్జానార్

ఇదే విషయంపై వీసీ సజ్జనార్ మాట్లాడుతూ.. “నేను ఎవరిపైన వ్యతిరేకంగా పోరాటం చేయడం లేదు. ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్ ను ప్రోత్సహిస్తూ.. పబ్బం గడుపుతున్న సోషల్ మీడియా ఇన్ఫ్లు యెన్సర్ లతో మాత్రమే పోరాడుతున్నాను. ముఖ్యంగా వీరు తమను ఫాలో అవుతున్న లక్షలాదిమంది అమాయకపు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. వీరి జీవితాలను నాశనం చేస్తున్నారు. ముఖ్యంగా ఇది మనకు ఆర్థికంగా ఎంతో నష్టం కలిగిస్తోంది. దేశ భవిష్యత్తును అగమ్య గోచరం చేస్తోంది. ప్రస్తుతం ప్రపంచంలోని ఎన్నో ప్రముఖ సంస్థలకు భారతీయులు నాయకత్వం వహిస్తున్నారు. అదే సమయంలో చాలామంది యువకులు తమ జీవితాలను ఇలాంటి కేటుగాళ్ల చేతిలో పెడుతున్నారు. ఈ బెట్టింగ్ అనేది వ్యక్తిగతంగానే కాకుండా సామాజిక, ఆర్థిక భద్రతకు మప్పుగా వాటిల్లింది. ఇప్పటికే ఎంతోమంది జీవితాలను విచ్ఛిన్నం చేసింది. ఆలస్యం కాకముందే అందరూ మేల్కోండి. బెట్టింగ్ యాప్స్ తో కలిగే నష్టాన్ని గుర్తించండి .ఇది మీ భవిష్యత్తుకు, వ్యక్తిగత జీవితానికి, సమాజ నిర్మాణానికి,కుటుంబ శ్రేయస్సుకు తోడ్పడుతుంది ” అంటూ ట్వీట్ లో రాసుకొచ్చారు. ఇక మొత్తానికైతే సజ్జనార్ రంగంలోకి దిగి తనను తాను సమర్ధించుకుంటున్న హర్ష సాయిపై కేసు ఫైల్ చేశారు.

Pushpa 3: ‘పుష్ప3’ రిలీజ్ డేట్ లాక్.. పుష్పగాడి ర్యాంపేజ్ షురూ ..!

గతంలో లైంగిక వేధింపులు ఎదుర్కొన్న హర్ష సాయి..

ఇదిలా ఉండగా గత కొన్ని నెలల క్రితమే ఒక అమ్మాయిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు. అతడికి ఈ కేసులో అరెస్టు వారెంట్ కూడా జారీ అయింది. మొత్తానికైతే ఈ కేసులో బెయిల్ రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఇప్పుడు ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ మళ్ళీ వివాదంలో ఇరుక్కున్నాడు. ఇక మొత్తానికైతే సైబరాబాద్ పోలీసులు ఇతనిపై కేసు నమోదు చేశారు? దీని నుండి హర్ష సాయి ఎలా తప్పించుకుంటారో చూడాలి అంటూ నెటిజన్స్ సైతం హర్షసాయి పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×