Vastu Tips: మీరు మీ దైనందిన జీవితంలో వాస్తు శాస్త్ర నియమాలను దృష్టిలో ఉంచుకుంటే.. మీరు చాలా ప్రయోజనాలను పొందుతారు. అదే సమయంలో.. ఈ నియమాలను పాటించకపోవడం వల్ల కూడా మీకు ఇబ్బంది కలుగుతుంది. అందుకే ఈ రోజు మనం ఇంట్లోని ఏ వస్తువులను బయటి వారికి ఇవ్వకూడదు లేదా పొర పాటున కూడా ఎవరి నుండి తీసుకోకూడదు అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
వాస్తు శాస్త్రం అత్యంత పురాతన హిందూ వ్యవస్థలలో ఒకటి. వాస్తు శాస్త్రంలో ప్రతి దానికీ నియమాలు చెప్పబడ్డాయి. కొన్ని వస్తువులను ఇతరులకు ఉచితంగా ఇవ్వడం వల్ల సమస్యలు పెరుగుతాయి. కొన్నిసార్లు, మన చుట్టూ ఉన్నవారికి లేదా మన పొరుగు వారికి సహాయం చేయడానికి మనం వారికి ఇంటి సామాగ్రిని ఇస్తాము. లేదా మన స్వంత ఉపయోగం కోసం ఇతరులను అడుగుతాము. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం.. పొరపాటున కూడా మీ ఇంట్లోని కొన్ని వస్తువులను ఇతరులకు ఇవ్వకూడదు. ఇలా చేయడం వల్ల అనేక నష్టాలు ఎదుర్కోవలసి వస్తుంది.
వీటితో ఇబ్బందులు పెరుగుతాయి:
చాలా సార్లు.. మన దగ్గర ఉప్పు అయిపోయినప్పుడు మనం వేరొకరిని అడుగుతాము లేదా మరొకరికి కూడా ఇస్తాము. కానీ ఉప్పు శని గ్రహానికి సంబంధించినదిగా పరిగణించబడుతుంది. ఎవరికైనా ఉప్పు ఉచితంగా ఇస్తే ఆ వ్యక్తిపై అప్పుల భారం పెరుగుతుందని నమ్ముతారు. దీంతో పాటు.. వ్యాధులు మొదలైనవి చుట్టుముడతాయి. ఇది మాత్రమే కాదు కత్తి, సూది మొదలైన పదునైన వస్తువులను కూడా ఎవ్వరికీ ఇవ్వకూడదు.
వాస్తు శాస్త్రంలో.. ఇనుము కూడా శని దేవుడికి సంబంధించినదిగా చెబుతారు. మీరు ఎవరికీ ఇనుప వస్తువులను ఇవ్వకూడదు లేదా ఎవరి నుండి ఇనుప వస్తువులను తీసుకోకూడదు. ఇలా చేయడం వల్ల మీ జీవితంలో ఒత్తిడి , అడ్డంకులు పెరుగుతాయి. దీంతో పాటు.. శనికి సంబంధించిన భావించే నూనెను కూడా ఎవరికీ ఉచితంగా ఇవ్వకూడదు. కానీ మీరు వీటిని దానం చేయవచ్చు.
కొన్నిసార్లు మనం ఎవరికైనా పర్సు లేదా చేతి రుమాలు మొదలైన వాటిని బహుమతిగా లేదా తీసుకోమని గిఫ్టుగా ఇస్తాము. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం ఇలా చేయడం అస్సలు శుభప్రదంగా కాదు. ఇలా చేయడం ద్వారా.. ఒక వ్యక్తి డబ్బు సంబంధిత సమస్యలను ఎదుర్కునే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే ఇలాంటి విషయాల పట్లు జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది.
ఇంట్లోకి ప్రతికూల శక్తి ప్రవేశిస్తే.. ఆ వ్యక్తి అనేక రకాల సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఇలాంటి సమయంలోనే ప్రతికూల శక్తిని వదిలించుకోవడానికి వాస్తు శాస్త్రంలో పేర్కొన్న ఉప్పుకు సంబంధించిన ఈ నివారణను పాటించాలి. ఇందు కోసం.. నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి దానితో నేలను తుడవండి. ఇలా చేయడం వల్ల ప్రతికూలత తొలగిపోయి సానుకూల శక్తి ప్రవాహం పెరుగుతుంది.
Also Read: గరుడ పురాణం ప్రకారం.. అతిపెద్ద పాపాలు ఇవే !
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం ఒక ముఖ్యమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఇక్కడే ప్రతికూల ,సానుకూల శక్తి రెండూ ప్రవేశిస్తాయి. ఇలాంటి సమయంలో ఇంటి ప్రధాన ద్వారం మీద నేమ్ ప్లేట్ , విండ్ చైమ్ ఏర్పాటు చేయాలి. దీంతో పాటు.. మీరు ప్రధాన ద్వారం వద్ద తులసి, మనీ ప్లాంట్ వంటి మొక్కలను కూడా ఉంచడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.