Mangal Gochar: జ్యోతిషశాస్త్రంలో అంగారకుడిని ధైర్యం, బలం, విశ్వాసం మరియు పరాక్రమానికి కారకంగా పరిగణిస్తారు. ఏదైనా గృహంలో కుజుడు యొక్క అనుకూల స్థానం ఉంటే అది మంచి ఫలితాలను ఇస్తుంది. అయితే గ్రహం యొక్క అధిపతి అశుభ స్థానంలో ఉంటే మాత్రం అశుభ ఫలితాలను ఇస్తుంది. జూలై 12వ తేదీ రాత్రి 7:12 గంటలకు కుజుడు వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. వృషభరాశిలోకి కుజుడు ప్రవేశం అన్ని రాశులను ప్రభావితం చేస్తుంది. మరోవైపు కొన్ని రాశుల వారు కుజుడు సంచారంలో మంచి ఫలితాలను పొందినప్పటికీ, కొంతమందికి చెడు ఫలితాలను ఇవ్వవచ్చు. అయితే ఏ రాశుల వారికి కుజుడి సంచారం చెడు ఫలితాలను ఇవ్వనుందో తెలుసుకుందాం.
ధనం, కీర్తి ప్రతిష్టలు
కుజుడు బలం, ధైర్యం మరియు విశ్వాసాన్ని ప్రసాదిస్తాడు. కోస్థిలో మంగళ్ శుభప్రదంగా ఉంటే ఏ వ్యక్తి అయినా లక్ష్యాన్ని సాధించవచ్చు. సమాజంలో చాలా పేరు ప్రతిష్టలు పొందుతారు. అంతేకాదు కోట్లలో ఆస్తులను పొందుతాడు.
Also Read: ఆషాఢమాసం విశిష్టత ఏమిటి ? ఈ మాసంలో ఎవరిని పూజించాలి ?
వీరికి కష్టాలే..
జూలై 12వ తేదీ రాత్రి 7:12 గంటలకు కుజుడు వృషభరాశిలోకి ప్రవేశించి ఆగస్టు 26 వరకు ఈ రాశిలో ఉంటాడు. ఈ సమయంలో అంగారకుడు అన్ని అంటే 12 రాశులను ప్రభావితం చేస్తాడు. కానీ 3 రాశుల వారు మాత్రం అనేక సమస్యలను ఎదుర్కొంటారు. అయితే ఆ రాశుల వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మిథున రాశి
అంగారక సంచారం మిథున రాశి వారికి ఉత్సాహాన్ని పెంచుతుంది. అనవసర ఖర్చులు ప్రశాంతతను కోల్పోయేలా చేస్తాయి. శత్రువులు చురుకుగా ఉండి సమస్యలను సృష్టిస్తారు. కెరీర్ నిర్ణయాలు ఆలోచనాత్మకంగా తీసుకుంటే కాస్త మంచి ఫలితాలు ఉంటాయి.
కర్కాటక రాశి
Also Read: ఆశ్లేష నక్షత్రంలోకి బుధుడు.. నేటి నుంచి ఈ రాశులవారికి అన్నీ శుభాలే
కర్కాటక రాశి వారు కుజుడు మారడం వల్ల ఆర్థికంగా నష్టపోవచ్చు. కాబట్టి ప్రమాదకర పెట్టుబడుల నుండి దూరంగా ఉంటే మంచిది. ఏదైనా పనులు తలపెట్టే మందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. ఈ సమయంలో అనారోగ్య పరిస్థితులు ఎదుర్కుని ఆసుపత్రి మరియు మందుల కోసం ఖర్చు చేయవలసి రావచ్చు.
కుంభ రాశి
కుజుడు కుంభరాశి వారికి అనేక సమస్యలను తెచ్చిపెడుతుంది. ఆర్థిక విషయాలలో ఒడిదుడుకులు ఉంటాయి. మాటలు లేదా విశ్వాసం మద్దతు ఇవ్వదు. ఎవరితోనైనా వివాదం ఉండే అవకాశాలు ఉంటాయి. అటువంటి సమయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది.