BigTV English

Virat Kohli Pub| విరాట్ కోహ్లికి చెందిన పబ్ పై కేసు నమోదు.. బెంగళూరులో ఎఫ్ఐఆర్

క్రికెటర్ విరాట్ కోహ్లీకి చెందిన బెంగళూరులోని వన్8 కమ్యూన్ పబ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. రాత్రి అనుమతించిన సమయానికి మించి పబ్ తెరిచి ఉండడం, స్థానికులకు ఇబ్బంది కలిగించడం వంటి ఫిర్యాదులు రావడంతో బెంగళూరులోని MG రోడ్‌లో వన్8 కమ్యూనల్, ఇతర పబ్ లపై పోలీసులు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

Virat Kohli Pub| విరాట్ కోహ్లికి చెందిన పబ్ పై కేసు నమోదు.. బెంగళూరులో ఎఫ్ఐఆర్

Virat Kohli Pub| ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీకి చెందిన బెంగళూరులోని వన్8 కమ్యూన్ పబ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. రాత్రి అనుమతించిన సమయానికి మించి పబ్ తెరిచి ఉండడం, స్థానికులకు ఇబ్బంది కలిగించడం వంటి ఫిర్యాదులు రావడంతో బెంగళూరులోని MG రోడ్‌లో వన్8 కమ్యూనల్, ఇతర పబ్ లపై పోలీసులు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. MG రోడ్‌లో ఉన్న పబ్ లకు అర్ధరాత్రి ఒంటి గంట వరకు వ్యాపార కలాపాలు నిర్వహించే అనుమతి ఉంది. కానీ స్థానిక పబ్ లు ఒంటి గంట దాటిన తరువాత కూడా తెరిచి ఉన్నాయి. అంతే కాకుండా పబ్ ల నుంచి అనుమతికి మించి బిగ్గరగా సంగీతం, శబ్దాలు రావడంతో స్థానికులకు ఇబ్బంది కలుగుతున్నట్లు ఫిర్యాదులు అందాయి.

Also Read: Income Tax Return| ఆదాయపు పన్ను రీఫండ్‌ను క్లెయిమ్ చేసుకోండి ఇలా.. జూలై 31 వరకు గడువు


ఈ క్రమంలో చిన్నస్వామి క్రికెట్ స్టేడియం సమీపంలో ఉన్న వన్8 కమ్యూన్ పబ్, ఇతర పబ్ లు నిబంధనలను ఉల్లంఘించినందుకు పోలీసులు కేసు నమోదు చేశారు. “రాత్రిపూట కూడా బిగ్గరగా సంగీతం వినిపించినట్లు మాకు ఫిర్యాదులు అందాయి. విచారణ కొనసాగుతోంది, తదుపరి చర్యలు తీసుకుంటాం” అని పోలీసులు తెలిపారు.

విరాట్ కోహ్లీకి చెందిన వన్8 కమ్యూన పబ్ శాఖలు ఢిల్లీ, ముంబై, పూణె, కోల్‌కతా, ఇతర మెట్రో నగరాల్లో ఉన్నాయి. గత ఏడాది డిసెంబర్‌లో బెంగళూరు బ్రాంచ్‌ను ప్రారంభమైంది. ఇది రత్నం కాంప్లెక్స్‌లోని ఆరవ అంతస్తులో ఉంది.

Also Read: Mihir Shah Hit-and-Run Case| కారు ప్రమాదం తరువాత కొనఊపిరితో ఉన్న మహిళ హత్య.. డ్రైవర్ కూడా నిందితుడే!

కోహ్లీ పబ్ ఇంతకుముందు కూడా వివాదాల్లో నిలిచింది. గత సంవత్సరం, తమిళనాడుకు చెందిన ఒక వ్యక్తి పంచెకట్టు ధరించి వెళ్లడంతో అతడిని పబ్ లోపల అనుమతించలేదు. ఈ విషయాన్ని అతడు సోషల్ మీడియాలో వీడయా ద్వారా తెలియజేశాడు. అలాగే కాపీరైట్ సంగీతం, సినిమ పాటలను పబ్ లో అనుమతి లేకుండా ప్లే చేస్తున్నారని ఢిల్లీ కోర్టులో కేసు నడిచింది. కోర్టు కాపీరైట్ సంగీతం ప్లే చేయకూడదని వన్ 8 కమ్యూన్ పబ్ కు వ్యతిరేకంగా తీర్పు చెప్పింది.

Also Read: Alcohol Distributed at BJP MP’s Party: ఉచితంగా మద్యం పంపిణీ.. ఎక్కడంటే..?

Virat Kohli, Bengaluru, One8commune pub,

 

Related News

Virender Sehwag: డైపర్ వేసుకొని సచిన్ సెంచరీ కొట్టాడు.. సీక్రెట్ బయటపెట్టిన సెహ్వాగ్

Watch Video : ఇదెక్కడి క్రికెట్ రా.. ఇలా ఆడితే అస్సలు రన్ అవుట్ కాబోరు

Sanju Samson : సంజూ అరాచకం.. వరుసగా 6,6,6,6,6,6

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Free Hit : ఇకపై వైడ్ బాల్ కు కూడా Free Hit ఇవ్వాల్సిందే.. ఎప్పటినుంచి అంటే ?

Big Stories

×