E-Paper
Advertisement

Financial Remedies: గ్రహ బాధలు పట్టి పీడిస్తున్నాయా..? ఆర్థికంగా చితికి పోయారా..? ఈ రెమెడీస్ పాటిస్తే కోట్లు కొల్లగొడతారట

Financial Remedies: గ్రహ బాధలు పట్టి పీడిస్తున్నాయా..? ఆర్థికంగా చితికి పోయారా..? ఈ రెమెడీస్ పాటిస్తే కోట్లు కొల్లగొడతారట
Advertisement

Financial Remedies: గ్రహ బాధలు పట్టి పీడిస్తున్నాయా..? ఎంత సంపాదించినా ఖర్చులు పెరిగిపోతున్నాయా..? ఆర్థికంగా ఎదగలేకపోతున్నారా..? అయితే మీరు చేయాల్సిందిల్లా సింపుల్‌ రెమెడీస్‌ పాటించడమే.. మీ గ్రహబాధలు ఉపశమనం చెంది మీ జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడం ఖాయం అంటున్నారు పండితులు. మరి ఆ రెమెడీస్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

రాహుగ్రహ బాధల ఉపశమనం కోసం:

మీ జాతకంలో రాహుగ్రహ పీడ అధికంగా ఉంటే , రాహువు దశ యోగించకుండా ఉంటే మీరు భోజనం చేసేటప్పుడు మొదటి పొడి అన్నము ముద్దగా చేసి గిన్నెలో పెట్టాలి . కూర కలిపిన పిదప కూడా మరో ముద్దను అదే గిన్నెలో పెట్టండి . భోజనం తర్వాత మీరు తినే అన్నం కొంత పళ్ళెంలో మిగల్చండి. తాగే నీరును కూడా కొంత విడిచిపెట్టాలి. మొట్టమొదటిగా తీసి పెట్టిన ముద్దల అన్నాన్ని తలచుట్టూ 3 సార్లు త్రిప్పుకోని కుక్కకు ఆహారం పెట్టాలి.

శని దోష నివారణ కోసం:

Advertisement

శని దోషం నివారణ కోసం ప్రతీ శనివారం ఆంజనేయ స్వామి గుడి చుట్టూ 19 ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణ అయిన తరువాత బెల్లం నువ్వుల ఉండలను యాచకులకు పంచండి.

సమస్త గ్రహాలు బాధిస్తుంటే:

సమస్త గ్రహాలు బాధిస్తుంటే అంటే రాహువు, కేతువు, శని , కుజుడు, రవి కలిగించే బాధల నుంచి బయటకు రావాలంటే ఎండు కొబ్బరి చిప్పలలో నువ్వులు, మినుములు, కందులు, ఉలవలు , కొద్దిగా బెల్లం, ఆవునూనె , నువ్వుల నూనె ఆ చిప్పలలో వేసి రెండు ఒక కొబ్బరి కాయలాగా చేసి తెల్లని వస్త్రంలో మూట కట్టి నది ప్రాంతంలో ఇసుకలో పూడ్చి పెట్టండి.

ఏలినాటి శని దోష నివారణ:

Advertisement

ఏలినాటి శనిదోషం వలన అనారోగ్యం తో ఇబ్బందులు పడుతున్న వారు మందులకు కూడా జబ్బు నయం కాకుండా ఉంటే తన బరువు ఎంత ఉంటుందో అంత మేరకు ముడి ధాన్యాన్ని గేదె లకు దాణాగా ఇవ్వండి. తన వయసు ఎంత ఉందో అంత బెల్లాన్ని,  నువ్వులను ప్రవహించే నదిలో వేయండి. 19 కేజీల బొగ్గుని చాకలి వారికి దానంగా ఇవ్వండి. ఇవి అన్ని కూడా శనివారం రోజు గానీ  తమ జన్మ నక్షత్రం రోజున కానీ, నామ నక్షత్రం రోజు గానీ చేస్తే ఫలితం ఉంటుంది.

శుక్ర బలం కోసం:

శుక్రుడి బలం కావాలనుకుంటే ఇంటి బయట కొంత భాగం పచ్చికబయలు పెంచుకోండి. ఇంటి లోపల తులసి చెట్టు పెంచాలి. మనీప్లాంట్ ని ఇంటి పై భాగానికి పాకించే విధంగా ఏర్పాటు చేయండి. శుక్ర బలం పెరిగి ఆ ఇంట్లో ఉన్న వారంతా సుఖసంతోషాలతో ఉంటారు.

చంద్ర బలం కోసం:

జాతక చక్రం లో చంద్రుడు బలహీన పడటం గానీ , చంద్రుడు దుఖః స్థానంలో ఉన్నా గానీ , చంద్ర మహర్థశలో అరిష్టములు కలుగుతుంటే , ఇంట్లో  తల్లితోనూ, తల్లితో సమానంగా ఉండే స్ర్తీలతో గానీ , వ్యతిరేకతలు ఏర్పడుతుంటే గానీ , మానసిక ప్రశాంతత కరువు అవుతుంటే గానీ, మారేడు చెక్కతో చేసిన శివలింగాన్ని 10 సోమవారాలు అర్చన చేసి , 11 వ సోమవారం ప్రాతః కాలం లో బియ్యం, కొత్త తెల్ల వస్త్రములో దక్షిణ తాంబూలాలు ఉంచి, లింగయుక్తంగా ఉత్తమ వృద్ద బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. దీంతో  మనోబలం పెరుగుతుంది. మానసిక ఇబ్బందులతో ఉంటే వాటి నుంచి విముక్తి కలగడం తో పాటు ఆదాయం కూడా వస్తుంది.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: తిరుమలలో వెయ్యేళ్ల నాటి ఘటాటోపం ఇప్పటికీ చూడొచ్చు – ఎక్కడ కనిపిస్తుందో తెలుసా

 

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×