E-Paper
Advertisement

RS Praveen Kumar: బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌ది నోరా? మోరా? బీఆర్ఎస్ నేత ప్రవీణ్ కుమార్ సంచలన కామెంట్స్!

RS Praveen Kumar: బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌ది నోరా? మోరా? బీఆర్ఎస్ నేత ప్రవీణ్ కుమార్ సంచలన కామెంట్స్!
Advertisement

RS Praveen Kumar:  బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ది నోరా..మోరా అని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ భవన్ లో  మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అరాచకాలకు పాల్పడిందని ఆరోపించారు. 2020లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 4 మున్సిపాలిటీలు వచ్చాయని, ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 30 శాతానికి పైగా ఓట్లు వచ్చాయన్నారు. మున్సిపల్ ఎన్నికలను వారం రోజుల్లోనే ముగించారని ఆరోపించారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను ఎవరు ఉల్లఘించినా ఎన్నికల కమీషన్ నోటీసులు ఇవ్వాలని అయినా ఇవ్వలేదన్నారు. అభ్యర్థులను ఎంపిక చేసుకునే సమయం కూడా లేదన్నారు. ఎన్నికల రోజు సంగారెడ్డిలో జగ్గారెడ్డి,నిజామాబాద్ లో ఎంపీ ధర్మపురి అరవింద్ పోలీసులను బూతులు తిట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫార్ములా ఈ కార్ రేస్ పై మళ్లీ లీకులు ఇస్తున్నారని ఆరోపించారు. సీఎం డబ్బులు మూటలు పంపినా కాంగ్రెస్ 51 శాతం వార్డులు గెలిచిందన్నారు.

Also Read: Medak News: కన్నుల పండువగా మహాశివరాత్రి వేడుకలు.. భక్తులతో కిక్కిరిసిన ఏడుపాయల జాతర!

కొన్ని చోట్ల కాంగ్రెస్,బీజేపీ కుమ్మక్కు

Advertisement

36 మున్సిపాలిటీలు హంగ్ లో ఉన్నాయని, మున్సిపాలిటీలు కాంగ్రెస్ గెలవాలని సీఎం ఆదేశాలు ఇచ్చారని ఆరోపించారు. ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్ కు మెజారిటీ వచ్చిందని, వాళ్ళు క్యాంపులో ఉంటే ఫోన్ ట్యాపింగ్ ద్వారా కనుక్కుని పోలీసులను పంపారని కొన్ని చోట్ల మఫ్టీ పోలీసులను క్యాంపులకు పంపారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఏమైనా బనానా? రిపబ్లిక్ నా? అని ప్రశ్నించారు. చేర్యాలలో భార్య బీఆర్ఎస్ నుంచి కౌన్సిలర్ గా పోటీ చేస్తే భర్తను సస్పెండ్ చేశారని, కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రుల కుటుంబీకులు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నారని, వారిని ఏమైనా బిఆర్ఎస్ హయాంలో సస్పెండ్ చేశారా లని నిలదీశారు. కొన్ని చోట్ల కాంగ్రెస్,బీజేపీ కుమ్మక్కు అయ్యాయన్నారు. ఢిల్లీ బాబుల చేతుల నుంచి తెలంగాణను రక్షించుకోవాలని కోరారు. రాత్రికి రాత్రే ఎక్స్ అఫిషియో ఓట్లు యాడ్ చేసుకుంటున్నారని ఆరోపించారు. విప్ జారీ చేస్తే పరిగణనలోకి తీసుకోవడం లేదన్నారు. కేసీఆర్ ఇంటికి ఎన్ని సార్లు నోటీసులు అంటించినా బీఆర్ఎస్ పార్టీని ఏం చేయలేరని స్పష్టం చేశారు. చైర్మన్,మేయర్ ఎన్నికలను పారదర్శకంగా జరపాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీ ఆర్ ఎస్ నేత పల్లె రవికుమార్ ,కసందీప్ పాల్గొన్నారు.

Also Read: Municipal Elections: రిసార్ట్ రాజకీయాల్లో మంత్రుల హడావుడి.. రేపే మున్సిపల్ చైర్మన్ ఎన్నిక, గెలుపు గుర్రమెవరో?

Tags

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×