ఒకే ఇంట్లో జీవిస్తున్న వారు లేదా హాస్టల్లో ఉంటున్న యువత పక్కవారి చెప్పులు వాడుతూ ఉంటారు. స్నేహితులు మంచి చెప్పులు కొనుక్కున్నా, బూట్లు కొనుక్కున్నా అవి వేసుకోవాలనిపిస్తుంది. కాబట్టి ఇలా పక్క వారు చెప్పులు, బూట్లు వాడడం అనేది ఎక్కువ మందికి అలవాటైపోయింది. కానీ పక్క వారికి చెప్పులు, బూట్లు వాడడం వల్ల మీ జీవితంలో ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి.
శనిగ్రహంతో బంధం
జ్యోతిష్శాస్త్రం ప్రకారం పక్కవారి చెప్పులు, బూట్లు వాడడం ఏ మాత్రం మంచి పద్ధతి కాదు. చెప్పులు, బూట్లు అనేవి శని గ్రహాలతో అనుబంధం కలిగి ఉంటాయి. మీరు ఇతరుల బూట్లు ధరించి బయటికి వెళ్తే మీ జాతకంలో శని స్థానం బలహీన పడవచ్చు. దీనివల్ల జీవితంలో కష్టాలు, కెరీర్లో సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు వస్తాయి.
అలాగే బూట్లు, చెప్పులు అనేవి రోజంతా నేలతో అనుబంధాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి అరికాళ్ళలో ఆ ప్రతికూల శక్తి మొత్తం పేరుకుపోతుంది. వేరొకరి బూట్లు, చెప్పులు ధరించినప్పుడు వారికి చెందిన ప్రతికూల శక్తులు కూడా మీలో ప్రవేశించే అవకాశం ఉంది. దీని కారణంగా మీ జీవితంలో ఒత్తిడి పెరిగిపోతుంది. అశాంతి నెలకొంటుంది. మీపై మీకు ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది. జీవితం చాలా కష్టంగా మారిపోతుంది.
చెడు శక్తి వల్ల
జ్యోతిష్కులు చెబుతున్న ప్రకారం వేరొకరు బూట్లు, చెప్పులు ధరించడం ఏమాత్రం మంచి పద్ధతి కాదు. ఇది మీ జీవితంలోకి చెడు శక్తిని ఆహ్వానిస్తుంది. ఆ చెడు శక్తి జీవితంపై ఆధిపత్యం చెలాయిస్తుంది. దీనివల్ల ఆ వ్యక్తి అదృష్టం కూడా దురదృష్టంగా మారిపోతుంది. ఆయన జీవితంలో అన్నీ ప్రతికూలంగానే జరగడం మొదలవుతాయి. ప్రతి పనిలోనూ అడ్డంకులు తలెత్తుతాయి.
పేదరికం వస్తుంది
ఇతరుల చెప్పులు వేసుకోవడం వల్ల పేదరికం బారిన పడే అవకాశం కూడా ఉంది. కొత్త ఆదాయ వనరులు లభించవు. ఉన్న ఆదాయ వనరులు కూడా మూసుకుపోతాయి. ఖర్చులు పెరిగిపోయి అనారోగ్యం బారిన పడుతూ ఉంటారు. కాబట్టి ఇతరుల చెప్పులు ఎంత నచ్చిన కూడా వాటి జోలికి వెళ్ళకండి.
ఇతరుల బూట్లు, చెప్పులు వేసుకునే వారి వ్యక్తిత్వం కూడా ఎంతగానో ప్రభావితం అవుతుంది. దేవుడు ఒక్కో వ్యక్తికి ఒక్కో రకమైన స్వభావాన్ని ఇస్తాడు. కొందరు ఉల్లాసంగా ఉంటారు. మరికొందరు ఎప్పుడూ చిరాకుగా, కోపంగా, ఒత్తిడితో ఉంటారు. అలాంటి వారి చెప్పులు మీరు అనుకోకుండా వేసుకుంటే మీ జీవితంలో కూడా చిరాకు, మానసిక ఒత్తిడి, కోపం వంటివి పెరిగిపోతాయి. ఇది మీ వ్యక్తిత్వాన్ని, మీ స్వభావాన్ని దెబ్బతీస్తాయి. కాబట్టి ఎప్పుడూ కూడా ఇతరుల చెప్పులు వేసుకునేందుకు ప్రయత్నించకండి.