Nirupam Paritala: నిరుపమ్ పరిటాల (Nirupam Paritala).. ఈ పేరు చెప్తే అంత త్వరగా గుర్తుపట్టరు కానీ.. డాక్టర్ బాబు అని చెప్పగానే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇట్టే గుర్తు పట్టేస్తారు. కార్తీకదీపం సీరియల్ (Karthika Deepam Serial) ద్వారా డాక్టర్ బాబు, వంటలక్క పాత్రలకు ప్రతి ఇంట్లో అభిమానులు ఉన్నారు. అలా కార్తీకదీపం సీరియల్ తో బుల్లితెరపై సరికొత్త బ్రాండ్ ని క్రియేట్ చేసిన డాక్టర్ బాబు,వంటలక్క పాత్రల ద్వారా నిరుపమ్ పరిటాల, ప్రేమీ విశ్వనాథ్ (Premi Vishwanath) లు ఒక హీరో, హీరోయిన్లకు ఎలాంటి క్రేజ్ ఉంటుందో అంత క్రేజ్ సంపాదించుకున్నారు. అయితే అలాంటి నిరుపమ్ పరిటాల ఏపీ రాజకీయాల్లో కీలకంగా ఉన్న పరిటాల శ్రీరామ్ కి బంధువా..? వీరిద్దరి మధ్య ఉన్న బంధుత్వం ఏంటి? అనే విషయాలు వైరల్ గా మారుతున్నాయి. ఈ విషయంపై డాక్టర్ బాబు క్లారిటీ ఇచ్చారు. సందేహాలకు చెక్ పడేలా నిరూపమ్ ఇచ్చిన సమాధానం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
నిరుపమ్‌కి ‘పరిటాల’ బంధువా?
సాధారణంగా ఎక్కడైనా సరే ఇంటి పేరు ఒక్కటే ఉంటే వారి మధ్య బంధుత్వం ఉంది అనుకుంటారు.. అంతేకాదు ఒకే ఇంటి పేరు ఉన్నవారు అందరూ కచ్చితంగా బంధువులనే అనుకుంటారు. కానీ అలా అనుకుంటే పొరపాటు పడ్డట్లే. సరిగ్గా ఇలాంటి సంఘటనే ఇక్కడ చోటు చేసుకుంది. అటు రాజకీయ నేత పరిటాల శ్రీరామ్.. ఇటు బుల్లితెర నటుడి నిరుపమ్ పరిటాల ఇంటిపేర్లు ఒకే ఉండడంతో నిజంగా వీరిద్దరూ బంధువులే అని అందరూ అనుకున్నారు. దీనికి తోడు నిరుపమ్ పరిటాల, శ్రీరామ్ పరిటాల(Sriram Paritala) ను కలవడంతో వీరిద్దరి మధ్య బంధుత్వం ఉందని.. వీరిద్దరూ వరుసకేం అవుతారో అంటూ సోషల్ మీడియాలో వీరి ఫోటో కింద కామెంట్లు పెడుతున్నారు నెటిజన్స్.
పరిటాల శ్రీరామ్ తో బంధుత్వంపై నిరుపమ్ క్లారిటీ..
కానీ ఈ విషయం గురించి ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు నిరుపమ్.. “పరిటాల అని ఒకే ఇంటి పేరు ఉన్నంత మాత్రాన మా ఇద్దరి మధ్య బంధుత్వం ఏమీ లేదు. మేమిద్దరం బంధువులం కాము. కానీ పరిటాల శ్రీరామ్ మాత్రం రియల్ హీరో.అందుకే ఆయన్ని కలవాలనిపించి ఒకసారి కలిసాను.. అంతకుమించి మా మధ్య ఎలాంటి బంధుత్వం లేదు.ఇంటి పేరు ఒక్కటే కానీ రిలేషన్ మాత్రం లేదు” అంటూ నిరుపమ్ పరిటాల క్లారిటీ ఇచ్చారు..
ఆ సీరియల్స్ తో భారీ పాపులారిటీ..
ఇక బుల్లితెర మీద పలు సీరియల్స్ చేస్తూ రాణిస్తున్న నిరుపమ్ పరిటాలకి చంద్రముఖి (Chandramukhi), కార్తీకదీపం వంటి రెండు సీరియల్స్ మంచి గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా అప్పటి జనరేషన్ వాళ్లకు చంద్రముఖి,ఇప్పటి జనరేషన్ వాళ్లకి కార్తీకదీపం సీరియల్స్ ద్వారా బాగా దగ్గరైపోయాడు..
నిరుపమ్ పరిటాల వ్యక్తిగత జీవితం..
ఇక నిరుపమ్ పరిటాల వ్యక్తిగత విషయానికి వస్తే.. ఆయన బుల్లితెర నటి మంజుల (Manjula) ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరి మధ్య పరిచయం చంద్రముఖి సీరియల్ సమయంలోనే ఏర్పడింది. అయితే మంజుల మొట్టమొదటిసారి నిరుపమ్ ను చూసిన సమయంలో ఈ సీరియల్ లో పెట్టడానికి ఇంకా వేరే హీరో ఎవరు దొరకలేదా.? అసలు ఈయన హీరో కటౌట్ లో ఉన్నారా? అంటూ అవమానిస్తూ మాట్లాడిందట.అయితే ఆ సమయంలో నిరుపమ్ తండ్రిని కోల్పోవడంతో గుండు కొట్టించుకొని ఉన్నారు. అంతేకాకుండా ఆయన చాలా సన్నగా ఉండడంతో మంజుల నిరుపమ్ ని చూసి అలా అర్థం చేసుకుందట.కానీ ఆ తర్వాత క్రమంలో వీరిద్దరే ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. ఇక కార్తీకదీపం సీరియల్ అయిపోయాక కార్తీకదీపం 2 నవవసంతం(Karthika Deepam 2 Nava Vasantham) పేరిట మళ్లీ కొత్త సీరియల్ ని స్టార్ట్ చేశారు.
ALSO READ:Kingdom Ragile Ragile Song : కింగ్డమ్ నుండి “రగిలే రగిలే” లిరికల్ సాంగ్ అవుట్.. సాంగ్ తోనే హైప్!