ఈ భూమిపై అత్యంత శక్తివంతమైన బాంబులు అణ బాంబులే. అవి పడ్డచోట కనీసం ఒక మొక్క మొలకెత్తడానికి కూడా ఏళ్ళ సమయం పడుతుంది. ఇక మనిషి జీవితం పూర్తిగా నాశనం అయిపోతుంది. అణు బాంబు పడిన చోట మనిషి జీవించడం అసాధ్యం. కానీ ఒక జీవి మాత్రం ఎన్ని అణు బాంబులు వేసినా సంతోషంగా, ప్రశాంతంగా జీవిస్తుంది. ఆ జీవి అందరి ఇళ్లల్లోనూ కనిపిస్తుంది. అణు బాంబు వల్ల కడిగే రేడియేషన్ కూడా దాన్ని ఏమాత్రం ప్రభావితం చేయలేదు.
ఆ జీవి ఇదే
అణ బాంబు దాడిలో ఏదైనా సరే బూడిదగా మారాల్సిందే. కానీ ఎంత అణు విస్పోటనం జరిగినా కూడా బొద్దింకలు ప్రశాంతంగా జీవిస్తాయి. అణు దాడిలో నగరాలకు నగరాలు పూర్తిగా నాశనమైనా.. బొద్ధింకకు మాత్రం ఏమీ జరగదు. అది సాధారణంగానే ఆ చెత్తకుప్పల్లో తిరుగుతూ ఉంటుంది.
అణు బాంబు పేలినప్పుడు వచ్చే రేడియేషన్ విపరీతంగా ఉంటుంది. దాన్ని తట్టుకోవడం మనుషులు, జంతువులు, మొక్కల వల్ల కాదు. అవి బూడిదలాగా మారిపోతాయి. కానీ ఆ రేడియేషన్ ను తట్టుకునే శక్తి బొద్ధింకలకు మాత్రమే ఉంటుంది. బొద్దింకలపై అణువిస్పోటనం వల్ల కలిగే ప్రభావం ఏ మాత్రం ప్రభావం చూపించదు. అవి ఎంతో శక్తివంతమైన రేడియేషన్ను కూడా తట్టుకోగల శక్తిని కలిగి ఉంటాయి. ఒక మనిషి 800 రాడ్‌ల రేడియేషన్ వల్లే మరణిస్తాడు. కానీ బొద్దింకలు 10000 రాడ్‌ల రేడియేషన్లు తట్టుకోగలవు. అంటే మనిషి కన్నా అవి ఎంత శక్తివంతమైనవో తెలుసుకోండి.
రెండో ప్రపంచ యుద్ధంలో…
రెండో ప్రపంచ యుద్ధంలో అణు దాడి జరిగింది. నగరాలు పూర్తిగా నాశనం అయిపోయాయి. ఆ నగరాలలో ఒక్క మొక్క కూడా కనిపించలేదు. కానీ బొద్దింకల మాత్రం నేలపై తిరుగుతూనే ఉన్నాయి. ఇంత ప్రమాదకరమైన అణు దాడిలో కూడా బొద్దింకలు బతికే ఉండడాన్ని అప్పట్లోనే ఆశ్చర్యానికి గురి చేశాయి. శాస్త్రవేత్తలు బొద్దింకలపై చేసిన ప్రయోగాలలో అవి రేడియేషన్ ను ఎంతవరకు తట్టుకోగలవో తేలింది. అందుకే అణు బాంబులు పడిన చోట కూడా బొద్దింకలు సాధారణ జీవితాన్ని గడుపుతాయి. అవి రేడియేషన్ ను తట్టుకునే శక్తిని కలిగి ఉంటాయి. వాటి సంతతిని అడ్డుకోవడం చాలా కష్టం.