BigTV English

Arowana Fish:అరోవానా ఫిష్ ఇంట్లో ఉంటే పాజిటివ్ అదృష్టం కలిసొస్తుందా..

Arowana Fish:అరోవానా ఫిష్ ఇంట్లో ఉంటే పాజిటివ్ అదృష్టం కలిసొస్తుందా..

Arowana Fish:వాస్తు-శాస్త్రం ఇంటి లోపల లేదా బయట ఉంచిన వస్తువుల ప్రాముఖ్యత గురించి స్పష్టంగా వివరించింది. మీ ఇంట్లో ఉంచిన వస్తువులు పాజిటివ్, నెగిటివ్ ఎనర్జీని నియంత్రించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. వాటిలో అరోవానా చేప ఒకటి. వీటిని ఇంట్లో ఉంచుకుంటే వాస్తు పరంగా ఎంతో మేలు కలుగుతుందని నమ్మకం గోల్డ్ ఫిష్‌తో పాటు అరోవానా చేప చాలా పవిత్రమైనదిగా వాస్తు-శాస్త్రం చెబుతోంది. అరోవానా చేపని ఆయురారోగ్య అష్ట ఐశ్వర్యాలకు, శక్తికి చిహ్నంగా వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతుంటారు. అందుకే దీనిని ఇంట్లో ఉంచడం ద్వారా చక్కటి ప్రయోజనాలు పొందవచ్చు.


అక్వేరియంలో చేపల్ని పెంచలేని వాళ్లు ఇంటి తూర్పు భాగంలో ఉన్న అరోవానా చేప విగ్రహం ఇంటికి పాజిటివ్ ఎనర్జీని తెస్తుంది. అరోవానా చేపను శుభప్రదమైన వాస్తు అలంకరణ వస్తువుగా పరిగణిస్తారు, ఎందుకంటే ఇది మీ ఇంటికి మంచి ఆరోగ్యం , అదృష్టంతో పాటు సంపద శ్రేయస్సును స్వాగతిస్తుందిఅక్వేరియం లేకుంటే మరియు నిజమైన అరోవానా చేపను కలిగి ఉండలేకపోతే, చేప నోటిలో నాణెం ఉన్న విగ్రహాన్ని కూడా ఉంచవచ్చు.అరోవానా చేప విగ్రహాన్ని మీ ఇళ్లలోని ఈశాన్య లేదా తూర్పు భాగాలలో ఉంచడం వల్ల మీ ప్రదేశంలో సానుకూల శక్తి ప్రవహిస్తుంది.

కొందరు జంతుశాస్త్రజ్ఞుల అభిప్రాయం ప్రకారం, భూకంపానికి ముందు అరోవానా చేప పర్వత ప్రాంతాలకే పరిమితం అయ్యాయట. ఈ చేప ప్రత్యేకత ఏంటంటే.. ఇది భూకంపం సంభవించడానికి ముందుగానే సంకేతాలను ఇస్తుందట.. భూకంపం వస్తుందని ఈ చేపలు అందరికంటే ముందుగానే గ్రహించి అప్రమత్తం చేస్తాయి. వాటిని గుర్తిస్తే ప్రకృతి వైపరీత్యం సంభవించక ముందే సురక్షితమైన ప్రాంతానికి తరలి పోవచ్చని కొందరు చెబుతుంటారు.


Related News

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Big Stories

×