BigTV English

KTR: ఆ కలెక్టర్లు వారేనా?.. బండి సంజయ్, రేవంత్ ఒకే పాయింట్ మీదున్నారా?

KTR: ఆ కలెక్టర్లు వారేనా?.. బండి సంజయ్, రేవంత్ ఒకే పాయింట్ మీదున్నారా?

KTR: రాజకీయ నాయకులు పరస్పరం విమర్శలు చేసుకోవడం కామనే. వాళ్లను వీళ్లు అంటారు.. వీళ్లను వాళ్లు అంటారు. ఇదంతా రొటీన్ గా జరిగే పొలిటికల్ వారే. కానీ, ఆసక్తికరంగా ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఓ నలుగురు కలెక్టర్ల మీద ఫోకస్ పెట్టారు. వరుసబెట్టి విమర్శలు, హెచ్చరికలు చేస్తున్నారు. ఆ నలుగురు జిల్లా కలెక్టర్లు కేసీఆర్ కుటుంబానికి భూములు దోచిపెడుతున్నారని ఆరోపిస్తున్నారు. భారీగా అవినీతికి పాల్పడుతున్న ఆ నలుగురు పద్దతి మార్చుకోకపోతే భరతం పడతామని వార్నింగులు ఇచ్చారు.


జస్ట్ మాటలకే పరిమితం కాలేదు బండి సంజయ్. ఓ బ్యాగులో ఆధారాలన్నీ ప్యాక్ చేసి.. నేరుగా ఢిల్లీ వెళ్లారు. కేంద్ర పరిపాలనా శాఖలో ఆ నలుగురు కలెక్టర్లపై కంప్లైంట్ చేశారు. వారి భూదందాలపై తాను సేకరించిన ఆధారాలను అందజేశారు. కేంద్ర సర్వీసు అధికారులైన ఆ కలెక్టర్లపై త్వరలోనే ఢిల్లీ నుంచి యాక్షన్ తప్పదని అంటున్నారు. అయితే, ఆ నాలుగు జిల్లాలు ఏంటో.. ఆ నలుగురు కలెక్టర్లు ఎవరో.. ఇంత వరకూ పేర్లు బయటపెట్టలేదు బండి సంజయ్.

అయితే, ఆసక్తికరంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి లేటెస్ట్ గా సేమ్ టు సేమ్ అలాంటి కామెంట్లే చేయడం విశేషం. కేటీఆర్, అతని మిత్రపక్షం కలిసి.. ధరణి పోర్టల్ సాయంతో వేల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కల్వకుంట్ల కవితకు మియాపూర్ లో 500 కోట్ల భూమి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ కు చెందిన ఆదిత్య కన్ స్ట్రక్షన్ కు ధరణి పోర్టల్ సాయంతో భూములు బదలాయించారని ఆరోపించారు. నిషేధిత జాబితాలో ఉన్న భూములను కొందరి పేర్ల మీదకు మార్చేశారని.. ఆ వివరాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.


ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ఓ మూడు జిల్లాల పేర్లను ప్రముఖంగా ప్రస్తావించారు. అవి హైదరాబాద్ పరిసర జిల్లాలే కావడంతో.. ఆ భూములు విలువ అంతకుమించే ఉంటుందంటున్నారు. ఇంతకీ రేవంత్ రెడ్డి చెప్పిన జిల్లాల పేర్లు ఏంటంటే… రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్. ఈ మూడు జిల్లాల్లోని విలువైన భూములను కేటీఆర్ బృందం కొల్లగొట్టిందనేది రేవంత్ ఆరోపణ. కేవలం ఆరోపణతోనే ఆగిపోలేదు టీపీసీసీ చీఫ్.. తన ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమా? అంటూ మంత్రి కేటీఆర్ కు సవాల్ కూడా చేశారు. అంటే, ధరణి అక్రమాలపై రేవంత్ రెడ్డి దగ్గర పక్కా సమాచారమే ఉండి ఉంటుందని అంటున్నారు.

ఇక, బండి సంజయ్ పదే పదే చెబుతున్న నాలుగు జిల్లాల్లో మూడు జిల్లాలు ఇవే కావొచ్చని అంచనా వేస్తున్నారు. బీజేపీ అధ్యక్షుడు ఎక్కడా ఫలానా జిల్లా కలెక్టర్ అని పేరు ప్రస్తావించకున్నా.. ఆ నలుగురిలో ముగ్గురు రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లా కలెక్టర్లే అయి ఉంటారనే ప్రచారం జరుగుతోంది. మరి, బండి సంజయ్ లిస్ట్ లో ఉన్న ఆ నాలుగో జిల్లా ఏంటో…!?

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×