BigTV English

Astrology: రాశి ఫలాలు..వారికి వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ధి 

Astrology: రాశి ఫలాలు..వారికి వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ధి 

Astrology today: నేటి రాశి ఫలాలు.మేష రాశి నుంచి మీన రాశి వరకు ఈరోజు ఎవరికి అనుకూలంగా ఉంది ఎవరికి కలిసి వచ్చే అవకాశం ఉందో తెలుసుకుందాం.


మేషం

మేష రాశివారికి అనుకూలంగా ఉంది. ఆదాయం బాగానే ఉంటుంది. స్థిరమైన నిర్ణయాలతో అభివృద్ధి సాధిస్తారు.అనవసర ఖర్చులు తగ్గించుకోవడం ఉత్తమం. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలతలు పెరుగుతాయి.మిత్రుల నుంచి సహాయం లభిస్తుంది. ఆంజనేయ స్తోత్రం పారాయణం చేయాలి.


వృషభం

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి ఫలితాలు లభిస్తాయి. మిత్రుల సహాయంతో పనులు పూర్తవుతాయి. మానసిక ఒత్తిడికి గురవుతారు. అస్థిర నిర్ణయాలతో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. విష్ణువును నమస్కరించుకోవాలి.

మిథునం

కుటుంబ సభ్యుల సలహాలు అనుకూలిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. మాటకు విలువ ఇస్తారు. స్థిరమైన నిర్ణయాలు ఫలితాలు ఇస్తాయి. బంధువులతో సంతోషంగా ఉంటారు. లాభాలకు ఇబ్బంది ఉండదు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. అనసవర ఖర్చులు పెరుగుతాయి. గణపతి అస్టోత్తరం చదవాలి.

కర్కాటకం

ఈ రాశి వారు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక సమస్యల నుంచి బయటపడుతారు. ఉద్యోగంలో సమస్యలు తొలగిపోతాయి. మీరు అనుసరించే ధర్మం మిమ్మల్ని ఉన్నతంగా ఉంచుతుంది. అనవసర ఖర్చులతో ఇబ్బంది పడుతారు. బంధువుల నుంచి శుభవార్త వింటారు. విదేశాల నుంచి ఉద్యోగపరంగా ఆశించిన సమాచారం వస్తుంది. వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి.

సింహం

సింహ రాశి వారికి మిశ్రమ వాతావరణం ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో జాగ్రత్తగా మెలగాలి. ఆస్తి వివాదం నుంచి బయటపడే అవకాశం ఉంది. బయట ఆచితూచి వ్యవహరించుకోవాలి. శాంతంగా వ్యవహరిస్తే మేలు జరుగుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. సూర్య ఆరాధన చేయాలి.

కన్య రాశి

ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అనుకూల ఫలితాలు వస్తాయి. కీలకమైన పనులు పూర్తి చేస్తారు. కుటుంబంలో సమస్యలు ఎదురువుతాయి. మనోధైర్యం కాపాడుతుంది. ఆశించిన స్థాయిలో లాభాలు వస్తాయి. నిర్ణయాలు ఆచితూచి తీసుకోవాలి. ప్రసన్నాంజనేయ స్తోత్రం పారాయణ చేస్తే మంచిది.

తుల రాశి

ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కొన్ని పనుల్లో ఎక్కువ శ్రమ పడాల్సి ఉంటుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం ఉంటుంది. అవసరానికి డబ్బు అందుతుంది. అనుకున్న సమయానికి పనులు పూర్తవుతాయి. ఆదాయానికి తగినవిధంగా ఖర్చులు ఉంటాయి. శ్రీహరిని ఆరాధించాలి.

వృశ్చికం

వృత్తి, వ్యాపారాల్లో ఒత్తిడి పెరుగుతుంది. కొన్ని పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఆశించిన స్థాయిలో ఉద్యోగావకాశాలు కలిసి వస్తాయి. బంధువుల నుంచి శుభవార్త వింటారు. రుణ సమస్యల ఒత్తిడి తగ్గుతుంది. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం మంచిది. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని పూజించాలి.

ధనస్సు

ఈ రాశి వారికి ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో మార్పులు చోటుచేసుకుంటాయ. బంధువుల నుంచి సహకారం ఉంటుంది. కొన్ని సంఘటనలు మనోధైర్యాన్ని పెంచుతాయి. వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. అనవసర ఖర్చులతో ఇబ్బంది ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. దైవారాధన మరవద్దు.

మకరం

కీలకమైన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యం కాపాడుకోవాలి. జీవిత భాగస్వామి నుంచి ఆశించిన శుభవార్త వింటారు. వృత్తి, వ్యాపారల్లో మంచి లాభాలు అందుకుంటారు. కుటుంబ సభ్యుల నుంచి సహకారం ఉంటుందిత. గణపతి అష్టోత్తరం చదివితే మంచిది.

కుంభం

ఈ రాశి వారికి శ్రమకు తగిన ఫలితం అందుతుంది. కొన్ని పనుల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. అనవసర ఆలోచనలు ఇబ్బంది కలిగిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు వరిస్తాయి. పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అనవసర లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. నవగ్రహ ధ్యానం మంచిది.

మీనం

మీన రాశి వారికి అనుకూలంగా ఉంది. ప్రధాన సమస్య నుంచి బయటపడుతారు. వ్యాపారంలో అనుకూల ఫలితాలు వస్తాయి. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. కొన్ని విషయాల్లో ఆచితూచిగా వ్యవహరించాలి. ప్రయాణాలు లాభిస్తాయి. ఇష్టమైన వారితో సమయం కేటాయిస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి.  ఇష్టదైవాన్ని పూజించాలి.

Related News

Navratri Day-2: నవరాత్రి రెండో రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Navaratri 2025: నవరాత్రుల సమయంలో.. ఇలా చేస్తే పట్టిందల్లా బంగారమే !

Bathukamma 2025: మూడో రోజు బతుకమ్మ.. ముద్దపప్పు నైవేద్యంగా పెట్టడం వెనక ఇంత కథ ఉందా ?

Bathukamma Festival 2025: 9 రోజుల బతుకమ్మ.. ఏ రోజు ఏ నైవేద్యం పెడతారు ?

Yaksha questions: యక్ష ప్రశ్నలు అంటే ఏమిటి? ఎందుకు అంత ప్రాధాన్యం

Engili Pula Bathukamma: ఎంగిలి పూల బతుకమ్మ.. సమర్పించే నైవేద్యం, ప్రత్యేకత ఏంటో తెలుసా ?

Bathukamma 2025: ఎంగిలి పూల బతుకమ్మ.. ఇంతకీ ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా ?

Amavasya 2025: ఆదివారం అమావాస్య.. సాయంత్రం లోపు ఇలా చేయకుంటే అష్టకష్టాలు

Big Stories

×