BigTV English
Advertisement

Viral Video: చెంప మీద కొట్టి.. డబ్బులు లాక్కొని.. అమ్మాయితో టీసీ అనుచిత ప్రవర్తన, ట్విస్ట్ ఏమిటంటే?

Viral Video: చెంప మీద కొట్టి.. డబ్బులు లాక్కొని.. అమ్మాయితో టీసీ అనుచిత ప్రవర్తన, ట్విస్ట్ ఏమిటంటే?

Railway TC Viral Video:

AI టెన్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత, ఏది నిజమో? ఏది అబద్దమో? తెలియక జనాలు తలలు పట్టుకుంటున్నారు. తాజాగా అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. ఈ వీడియోలో ఓ టీసీ అమ్మాయితో అనుచితంగా ప్రవర్తించడం కనిపిస్తుంది. ఆ అమ్మాయి దగ్గర టికెట్ లేకపోవడంతో ఆమెను అసభ్యంగా తాకడంతో పాటు కొట్టడం కనిపిస్తుంది. అంతేకాదు, ఆమెను బెదిరించి డబ్బులు కూడా లాక్కున్నట్లు ఈ వీడియోలో కనిపిస్తుంది. రైల్వే ఉద్యోగి లంచం తీసుకుంటూ రైలులో అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించిన క్లిప్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. నెటిజన్లు ఈ వీడియోపై తీవ్ర స్థాయిలో స్పందించారు. సదరు టీసీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


ఇంతకీ ఆ వీడియో నిజమా? ఫేకా?

కొంత మందికి ఈ వీడియోపై అనుమానం కలిగింది. రైల్వే టీసీలు నిజంగానే అలా చేస్తారనే డౌట్ వచ్చింది. వెంటనే ఆ వీడియోను ఫ్యాక్ట్ చెక్ చేశారు. ఇటీవల ఇలాంటి ఘటన ఏదైనా జరిగిందని చెక్ చేసినప్పుడు, ఎక్కడా రిపోర్టు కాలేదు. నిజమేనని కన్ఫార్మ్ చేసే ఎలాంటి సమాచారం లేదు. అయితే, ఈ వీడియోను పరిశీలించి చూసినప్పుడు ‘అఫీషియల్ రాజ్ ఠాకూర్’ అనే ఇన్ స్టా అకౌంట్ లో తొలిసారి షేర్ చేసినట్లు ఉంది. ఈ వీడియోకు “ఆ అమ్మాయికి టికెట్ లేనప్పుడు ఇలా చేశాను” అనే క్యాప్షన్ ఉంది.  అదే వీడియోలో కాస్త కిందికి వెళ్తే ఓ ఒక డిస్క్లైమర్ నోట్ కనిపించింది. “ఈ వీడియో పూర్తిగా స్క్రిప్ట్ ప్రకారం చేసింది. నిజమైనది కాదు. ఈ కంటెంట్ కేవలం వినిదం కోసం రూపొందించింది. అదే సమయంలో అవగాహన కల్పించేందుకు క్రియేట్ చేయబడింది” అని రాసి ఉంది.


Read Also: స్కూల్ బస్సు ఆగకుండా వెళ్లిపోయిందని చిన్నారి ఏడుపు.. అది తెలిసి డ్రైవర్ ఏం చేశాడంటే?

గతంలోనూ ఇలాంటి వీడియోలు షేర్..  

అటు ‘అఫీషియల్ రాజ్ ఠాకూర్’ అకౌంట్ ను పరిశీలించినప్పుడు ఇలాంటి వీడియో మరికొన్ని కనిపించాయి. అవన్నీ స్క్రిప్ట్ ప్రకారం క్రియేట్ చేసినవే కావడం విశేషం. ఈ వీడియోలో ఉన్న అమ్మాయి గతంలో మరికొన్ని వీడియోల్లోనూ కనిపించింది. రైళ్లలో జరిగే దొంగతనాలు, వేధింపులకు సంబంధించి అవగాహన కల్పించేందుకు ఈ వీడియోలను క్రియేట్ చేస్తున్నట్లు తేలింది. సో, ఈ విషయంలో తెలియడంతో చాలా మంది నెటిజన్లు కూల్ అయ్యారు. మరికొంత మంది మాత్రం, జనాలను మిస్ లీడ్ చేసే ఇలాంటి వీడియోలను క్రియేట్ చేయడం మానుకోవడం మంచిదని సూచిస్తున్నారు. ఇలాంటి పనుల వల్ల రైల్వేకు చెడ్డపేరు వచ్చే అవకాశం ఉందంటున్నారు. మొత్తంగా రైల్వే ఉద్యోగి అమ్మాయితో అనుచితంగా ప్రవర్తించినట్లు వైరల్ అయిన వీడియోలో ఎలాంటి నిజం లేదని తేలిపోయింది.

Read Also: పాముతో బెదిరించి డబ్బులు డిమాండ్.. రైల్లో బిచ్చగాడి అరాచకం, రైల్వే స్పందన ఇదే!

Related News

Shocking Video: లక్నోలో రెచ్చిపోయిన యువతి.. కారులో నగ్నంగా ప్రయాణం.. వీడియో వైరల్

Viral Video: ఆఫీసులో తింగరి వేషాలేంటి? హీటెక్కిపోయిన బ్యాంక్ మేనేజర్, ఆ తర్వాత ఏం జరిగిందంటే

Man Wins Rs 240 Cr Lottery: తెలంగాణ బిడ్డకు రూ.240 కోట్ల లాటరీ.. ఇదిగో ఇలా చేస్తే మీరూ కోటీశ్వరులే!

Hanumakonda: కోయ్.. కోయ్.. కొక్కొరొక్కో.. కోళ్ల కోసం జనం పరుగుల వేట

Orange Shark: అరుదైన ఆరెంజ్ షార్క్.. భలే బాగుంది, కానీ చాలా డేంజర్ సుమా!

Safety Pin: ఈ పిన్నీసు కొనాలంటే ఆస్తులు అమ్మాల్సిందే, మరీ అంత ధర ఏంట్రా అయ్యా?

Uber Driver Story: పగటిపూట రూ.1,500 కోట్ల వ్యాపారాన్ని నడుపుతున్న వ్యక్తి, రాత్రిపూట ఉబర్ డ్రైవర్‌గా మారుతున్నాడు.. ఎందుకంటే?

World’s Largest Spider Web: ప్రపంచంలోనే అతి పెద్ద సాలీడు గూడు.. 1,11,000 సాలెపురుగుల నైపుణ్యం.. వీడియో వైరల్

Big Stories

×