BigTV English

The Raja Saab: ప్రభాస్ రాజాసాబ్ ట్రైలర్ కు ముహూర్తం ఫిక్స్.. డైరెక్ట్ థియేటరల్లోనే

The Raja Saab: ప్రభాస్ రాజాసాబ్ ట్రైలర్ కు ముహూర్తం ఫిక్స్.. డైరెక్ట్ థియేటరల్లోనే

The Raja Saab: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మంచి సక్సెస్ అందుకొని అనంతరం పాన్ ఇండియా స్థాయిలో ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్న నటుడు ప్రభాస్(Prabhas) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు పొందిన ప్రభాస్ ఇప్పుడు వరుస పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ప్రస్తుతం ఈయన మరో నాలుగు పాన్ ఇండియా సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఇక త్వరలోనే ప్రభాస్ హీరోగా మారుతి (Maruthi)దర్శకత్వంలో తెరకెక్కిన ది రాజా సాబ్ (The Raja Saab)విడుదల కానుంది.


ది రాజ సాబ్ ట్రైలర్ కు సర్వం సిద్ధం…

నిజానికి ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కొన్ని కారణాలవల్ల వాయిదా పడుతూ వచ్చే ఏడాది సంక్రాంతి పండుగను టార్గెట్ చేసింది. ఇక ఈ సినిమా వచ్చేయడాది సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల కాబోతుందన్న నేపథ్యంలో త్వరలోనే ఈ సినిమా నుంచి బిగ్ అప్డేట్ విడుదల చేయడానికి చిత్ర బృందం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకున్నారని తెలుస్తోంది. ఈ సినిమా ట్రైలర్ నేరుగా థియేటర్లనే విడుదల చేయడానికి చిత్ర బృందం అన్ని ఏర్పాట్లను సిద్ధం చేశారు.

కాంతారా సినిమాతో పాటు రాజా సాబ్ ట్రైలర్..

ప్రముఖ కన్నడ హీరో రిషబ్ శెట్టి(Rishabh shetty) హీరోగా నటించిన కాంతారా చాప్టర్ 1(Kanatara Chapter 1) సినిమా దసరా పండుగను పురస్కరించుకొని అక్టోబర్ రెండవ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటుగా ది రాజా సాబ్ ట్రైలర్ ను విడుదల చేయబోతున్నారు. ఈ ట్రైలర్ వీడియోని 3ని 30 సెకండ్ల నిడివితో కట్ చేసినట్టు తెలుస్తుంది. కాంతార సినిమాతో పాటుగా రాజా సాబ్ ట్రైలర్ కూడా రాబోతుందనే విషయం తెలిసిన అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ విభిన్న జానర్ లో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కామెడీ హర్రర్ జానర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


ప్రభాస్ కు జోడీగా ముగ్గురు ముద్దుగుమ్మలు..

ఈ సినిమాలో ప్రభాస్ వింటేజ్ లుక్ లో కనిపించబోతున్నారు. ఇప్పటికే సినిమా నుంచి విడుదల చేసిన టీజర్ మంచి అంచనాలనే పెంచేసింది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా ఏకంగా ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్న విషయం తెలిసిందే. నిధి అగర్వాల్ తో పాటు, రిద్ధి కుమార్, మాళవిక మోహన్ సందడి చేయబోతున్నారు. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రముఖ బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కూడా నటిస్తున్నారు. ఇందులో సంజయ్ దత్ ప్రభాస్ కి తాతయ్య పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తోది. ఇక ఈ పాన్ ఇండియా సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించగా ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు.

Also Read: Jagapathi Babu: అవినీతి కేసులో ఇరుక్కున్న జగపతిబాబు… నేడు ఈడి విచారణ

Related News

Shah Rukh Khan: కొడుకు చేసిన పనికి షారుక్‌కి భారీ మూల్యం.. రూ. 2 కోట్లు పరువు నష్టం దావా!

OG Success Meet : థమన్ బాం*చ*త్ అన్నాడు… సక్సెస్‌మీట్‌లో నిర్మాత కామెంట్

Sujeeth: రాజమౌళికి పోటీగా సుజీత్… అంతా పవన్ వల్లే

Jagapathi Babu: అవినీతి కేసులో ఇరుక్కున్న జగపతిబాబు… నేడు ఈడి విచారణ

OG Movie: ఓజీ టీంకి హైకోర్టులో స్వల్ప ఊరట

Balakrishna : జగన్ ఓ సైకో గాడు… చిరంజీవిని గేట్ దగ్గరే..

Neha Shetty: బంగారం రా మా టిల్లు పాప.. ఓజీలో ఎలా లేపేశారురా

Big Stories

×