BigTV English

Importance of Tangedu flowers: ఈ పూలు లేనిదే దసరా లేదుగా.. అనుబంధాలను చాటి చెప్పిన పూల హిస్టరీ ఇదే

Importance of Tangedu flowers: ఈ పూలు లేనిదే దసరా లేదుగా.. అనుబంధాలను చాటి చెప్పిన పూల హిస్టరీ ఇదే

Importance of Tangedu flowers: దసరా వచ్చేస్తోంది.. సెలవులు తెస్తోంది.. ఇక గ్రామాల్లో సందడి.. ఆడపడచుల ఆనందహేళ.. ఇలా ఒకటేమిటి ఎటుచూసినా సంబరాలే. ఇక తెలంగాణలో దసరా అంటేనే అదొక సంబరమనే చెప్పవచ్చు. దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని గ్రామగ్రామాన బతుకమ్మ సంబరాలే. సాయంత్రం కాగానే పేద, ధనిక తేడా లేకుండా బతుకమ్మ తల్లిని కీర్తిస్తూ.. పాటలు పాడుతారు మహిళలు. ఇంతటి సంబరాల రోజులు రానున్న నేపథ్యంలో ఇప్పటి నుండే తెలంగాణ వ్యాప్తంగా ఆ శోభ కనిపిస్తుందని చెప్పవచ్చు.


ఈ ఏడాది అక్టోబర్ 3 నుండి దసరా శరన్నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. సుదూర ప్రాంతాలకు ఉపాధి నిమిత్తం వెళ్ళిన వారు ఈ పండుగకు స్వగ్రామాల బాట పట్టేస్తారు. అందుకు ఇప్పటికే ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీగా రవాణా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. స్పెషల్ బస్సులు, స్పెషల్ రైళ్లు కూడా దసరాకి సిద్దం కానున్నాయి.

అయితే తెలంగాణ దసరా ఉత్సవాలు చూసేందుకు రెండు కళ్లు చాలవనే చెప్పవచ్చు. ఎవరి మోముపై చూసినా సంబరాల ఆనందాలే మనకు కనిపిస్తాయి. ఇక్కడ బతుకమ్మ తల్లిని పూజిస్తూ.. మహిళలు బతుకమ్మ ఆడడం పూర్వం నుండి సాంప్రదాయంగా వస్తోంది. ఇలా బతుకమ్మను ప్రతి ఇంటా 9 రోజుల పాటు పూజిస్తారు. 9 పేర్లతో బతుకమ్మను పిలవడం కూడా ఇక్కడ మరో విశేషంగా చెప్పవచ్చు.


బతుకమ్మను ఎన్నో రకాల పూలతో పేర్చే ప్రక్రియను మహిళలు ఎంతో భక్తిశ్రద్దలతో నిర్వహిస్తారు. ఇలా పేర్చడంలో తంగేడు పూలు వెరీ స్పెషల్. ఈ తంగేడు పూలు పసుపు పచ్చగా.. ఎంతో అందంగా కనిపిస్తాయి. కాగా తంగేడు పూలకు బతుకమ్మకు ఉన్న అనుబంధంపై ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. పూర్వం ఒకే ఒక్క చెల్లెలు గల 7 మంది అన్నదమ్ములు ఉండేవారట. అయితే ఆ చెల్లిని ప్రాణం కన్నా మిన్నగా వారు చూసుకునేవారు. ఆ అన్నల భార్యలు మాత్రం ఈ దృశ్యాలను చూసి అసూయ పడేవారు. ఈ తరుణంలో ఒకరోజు 7 మంది అన్నలు అడవికి వెళితే.. ఇదే తగిన సమయం అనుకున్న వదినలు.. తమ ఏకైక ఆడబిడ్డను చంపి ఊరి బయట పాతి పెట్టినట్లు పెద్దలు చెబుతుంటారు.

Also Read: Rivers and Coins: నదుల్లో నాణేలు విసరడం వెనుక కారణమేమిటి? నదులను దైవంగా ఎందుకు పూజిస్తారు?

ఇక అడవి నుండి వచ్చిన అన్నలు.. ఏది మా చెల్లెమ్మ అంటూ తమ సతులను ప్రశ్నించి, చెల్లెలి కోసం గాలింపుకు వెళ్లారట. అప్పుడు ఆ చెల్లెమ్మ తంగేడు మొక్క రూపంలో కనిపించి, తనకు జరిగిన విషాద ఘటన గురించి తెలిపి అన్నలూ.. నన్ను తంగేడు పూలలో చూసుకోండి. నేను ఎక్కడికీ వెళ్లలేదు.. ప్రతి ఏడాది బతుకమ్మ పండుగను తంగేడు పూలతో చేయండి అంటూ కోరిందని పెద్దలు చెబుతుంటారు. ఇలా బతుకమ్మ తల్లికి తంగేడు పూలకు ఉన్న అనుబంధం ఏర్పడింది. అందుకే బతుకమ్మను పేర్చడంలో తంగేడు పూలకు అంత ప్రాముఖ్యత ఉంది. మరి దసరా వచ్చేస్తోంది.. తంగేడు పూలను సిద్దం చేసుకుందాం.. ఆ బతుకమ్మ తల్లి ఆశీర్వాదం అందుకుందాం.

Related News

Navratri Day-4: నవరాత్రి నాల్గవ రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Bathukamma 2025: ఐదో రోజు అట్ల బతుకమ్మ.. అట్లు నైవేద్యంగా పెట్టడం వెనక ఉన్న కారణం ఏంటి ?

Navratri Day-2: నవరాత్రి రెండో రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Navaratri 2025: నవరాత్రుల సమయంలో.. ఇలా చేస్తే పట్టిందల్లా బంగారమే !

Bathukamma 2025: మూడో రోజు బతుకమ్మ.. ముద్దపప్పు నైవేద్యంగా పెట్టడం వెనక ఇంత కథ ఉందా ?

Bathukamma Festival 2025: 9 రోజుల బతుకమ్మ.. ఏ రోజు ఏ నైవేద్యం పెడతారు ?

Yaksha questions: యక్ష ప్రశ్నలు అంటే ఏమిటి? ఎందుకు అంత ప్రాధాన్యం

Engili Pula Bathukamma: ఎంగిలి పూల బతుకమ్మ.. సమర్పించే నైవేద్యం, ప్రత్యేకత ఏంటో తెలుసా ?

Big Stories

×