Holi 2025: సనాతన ధర్మంలో హోలీ పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ పండుగను ఫాల్గుణ మాసంలోని పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఈ సంవత్సరం తేదీ మార్చి 13 గురువారం ఉదయం 10:35 గంటల నుండి మార్చి 14, శుక్రవారం మధ్యాహ్నం 12:23 గంటల వరకు ఉంటుంది. ఉదయ తిథిని పరిగణనలోకి తీసుకుంటే, హోలీ పండుగ శుక్రవారం 14 మార్చి 2025 నాడు జరుపుకుంటారు. హోలీ రోజు మీ ఇంటికి ఈ 4 వస్తువులను తీసుకు రావడం చాలా మంచిదని చెబుతారు. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో డబ్బు ఎలాంటి లోటూ ఉండదు. మరి లక్ష్మీ కటాక్షం కోసం హోలీ రోజు ఏ వస్తువులను కొనాలో ఇప్పుడు తెలుసుకుందాం.
హోలీ రోజు ఏమి కొనాలి ?
వెండి నాణెం: హోలీ రోజు వెండి నాణెం కొని ఇంటికి తీసుకురావడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. మీరు వెండి నాణెం తెచ్చినప్పుడు, దానిని పూజించడం మర్చిపోవద్దు. దీని తరువాత ఈ నాణెంను ఇంటి ప్రధాన ద్వారంపై ఉంచండి. ఈ పరిష్కారం ఇంట్లోకి డబ్బు ప్రవహించేలా చేస్తుంది. అంతే కాకుండా మీకు డబ్బలు లోటు లేకుండా చేస్తుంది.
తాబేలు: ఈ సంవత్సరం హోలీ రోజు లోహంతో చేసిన తాబేలును కొని ఇంటికి తీసుకురావడం శుభప్రదం. ఈ తాబేలు వెనుక భాగంలో శ్రీ యంత్రం లేదా కుబేర యంత్రం రాయాలి. హోలీ రోజున ఈ లోహపు తాబేలును ఇంటికి తీసుకురావడం వల్ల ఇంట్లోని ఆర్థిక ఇబ్బందులను తొలగించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా లక్ష్మీ కటాక్షం మీపై ఉంటుంది.
Also Read: ఆ రాశి వారికి ఈ వారం ఆకస్మిక ధనలాభం – సన్నిహితుల నుంచి శుభవార్తలు
పిరమిడ్ , బందన్వర్: వాస్తు శాస్త్రం ప్రకారం, హోలీ సమయంలో ఇంట్లోకి పిరమిడ్ తీసుకురావడం శుభప్రదం. ఇలా చేయడం వల్ల ఇల్లు ,కుటుంబంలో సమృద్ధిగా సంపద ఉంటుంది. దీంతో పాటు అశోక ఆకులతో చేసిన వస్తువులను ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉంచడం ద్వారా ఇంట్లో ఉండే ప్రతికూల శక్తి తొలగిపోతుంది.