IND VS NZ: చాంపియన్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో ( Champions Trophy 2025 Tournament ) భాగంగా ఇవాళ.. కివిస్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా… గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. చాంపియన్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ జరిగిన మ్యాచ్ లో నిర్ణిత 50 ఓవర్లలో 249 పరుగులు చేసి 9 వికెట్స్ కోల్పోయింది. న్యూజిలాండ్ (New Zealand ) బౌలర్లు కట్టడిగా బౌలింగ్ చేయడంతో… టీమిండియా ( Team India ) దూకుడుకు కళ్లెం పడింది. 30 పరుగుల వద్ద మూడు వికెట్లు నష్టపోయిన టీమిండియాను శ్రేయస్ అయ్యర్ ( Shreyas Iyer ), ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ ఇద్దరు కూడా ఆదుకున్నారు. ఈ మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ 79 పరుగులతో దుమ్ము లేపగా… అక్షర్ పటేల్ 42 పరుగులతో మంచి భాగస్వామ్యం అందించాడు. ఇక చివరిలో హార్దిక్ పాండ్యా… తన మెరుపులతో దుమ్ము లేపాడు. సిక్స్ లు బౌండరీలతో రెచ్చిపోయాడు హార్థిక్ పాండ్యా.
Also Read: Nz vs Ind: ఫిలిప్స్ క్యాచ్ అదుర్స్..షాక్ లో అనుష్క శర్మ కోహ్లీ.. కష్టాల్లో టీమిండియా?
చివర్లో హార్దిక్ పాండ్యా మెరుపుల కారణంగా.. టీమిండియా 240 కి పైగా పరుగులు చేయగలిగింది. ఈ మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా 45 పరుగుల వద్ద… భారీ షాట్ కొట్టి ఔట్ అయ్యాడు. అటు అంతకుముందు ఓపెనర్లు రోహిత్ శర్మ 17 బంతుల్లో 15 పరుగులు చేశాడు. ఇందులో ఒక బౌండరీ అలాగే ఒక సిక్సర్ కూడా ఉంది. గత వన్డే మ్యాచ్లో అద్భుతంగా ఆడిన గిల్ రెండు పరుగులకే ఈసారి వెనుతిరిగాడు. విరాట్ కోహ్లీ 11 పరుగులు చేసి… ఫిలిప్స్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.
ఇక అటు న్యూజిలాండ్ బౌలర్లలో… మ్యాట్ హెన్రీ ( Matt Henry ) ఏకంగా 5 వికెట్లు తీశాడు. దీంతో టీమిండియా కట్టడి అయింది. మిగిలిన జెమీసన్ ఒక వికెట్ తీయగా… విలియం మరో వికెట్ తీశాడు. న్యూజిలాండ్ ఆల్రౌండర్, కెప్టెన్ మిచెల్ సంట్నర్ ఒక వికెట్ తీయగా రచిన్ రవీంద్ర మరో వికెట్ తీశాడు. ఇక ఈ మ్యాచ్ లో 250 పరుగులు చేస్తే… న్యూజిలాండ్ గ్రాండ్ విక్టరీ కొడుతుంది. ఒకవేళ ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ గ్రాండ్ విక్టరీ కొడితే… ఆస్ట్రేలియాతో… సెమీఫైనల్ ఆడుతుంది. అప్పుడు ఈ సెమీఫైనల్ మ్యాచ్ పాకిస్తాన్ లోని లాహోర్ వేదికగా జరుగుతుంది.
Also Read: Wpl 2025: టోర్నమెంట్ నుంచి RCB ఔట్…. సెమిస్ వెళ్లే జట్లు ఇవే.. ఇదిగో లెక్కలు?
ఒకవేళ న్యూజిలాండ్ జట్టు పైన టీమిండియా గెలిచి ఉంటే… పరిస్థితులు వేరేలా ఉంటాయి. అప్పుడు మొదటి సెమీఫైనల్ లో టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ఫైట్ ఉంటుంది. ఈ మ్యాచ్ దుబాయ్ వేదికగా జరుగుతుంది. అలాగే.. రెండవ సెమీఫైనల్ లో దక్షిణాఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ఫైట్ ఉంటుంది. ఈ మ్యాచ్ కోసం మళ్లీ లాహోర్ వెళ్లాల్సి ఉంటుంది. రెండో సెమీ ఫైనల్ ఆ సమయంలో పాకిస్థాన్లోని లాహోర్ లో జరుగుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ఈసారి హైబ్రిడ్ మోడల్ లో నిర్వహిస్తున్నారు కాబట్టి ఈ పరిస్థితి నెలకొంది. ఒకవేళ టీమిండియా ఫైనల్ కు చేరితే మార్చి 9వ తేదీన దుబాయ్ వేదికగా ఫైనల్ ఉంటుంది. టీమిండియా ఫైనల్ చేరకపోతే పాకిస్తాన్ లో మ్యాచ్ ఉంటుంది.