BigTV English

Pushkaram:- గంగమ్మ పుష్కరాల్లో తరించే ముందు…

Pushkaram:- గంగమ్మ పుష్కరాల్లో తరించే ముందు…

Pushkaram:- భారత దేశ జీవనవాహిని గంగానది. హిందువులేకాదు ఇతర మతస్తులుకూడా గంగమ్మ అని గౌరవిస్తారు. గంగమ్మతల్లీ అని పరవశించిపోతారు. భారతీయ సాంస్కృతిక వైభవంలో యుగాలుగా తన ప్రత్యేకతను చాటుకున్న గంగానది పుష్కరశోభను సంతరించుకుంటున్నది. స్వస్తి శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం వైశాఖ శుక్ల పాడ్యమి తేది 21-4-2023 శుక్రవారం తెల్లవారితే శనివారం అనగా రా.తె. 5-09 గంటలకు దేవ గురువు బృహస్పతి మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు.


ఈ క్రమంలో ఏప్రిల్‌ 22 నుంచి సార్ధ త్రికోటి సహిత గంగానది పుష్కరాలు ప్రారంభం అవుతాయి. పన్నెండు రోజులు కొనసాగి మే 3వ తేదీతో ముగియనున్నాయి. పుష్కరాల సమయంలో పితృదేవతల ప్రీత్యర్థం స్నాన, దాన, తర్పణ, పిండ ప్రదానాలు చేయడం పుణ్యప్రదంభారత దేశ జీవనవాహిని గంగానది. ప్రేమగా గంగ అని పిలుచుకుంటారు. గంగమ్మ అని గౌరవిస్తారు. గంగమ్మతల్లీ అని పరవశించిపోతారు. భారతీయ సాంస్కృతిక వైభవంలో యుగాలుగా తన ప్రత్యేకతను చాటుకున్న గంగానది పుష్కరశోభను సంతరించుకుంది. తండ్రి లేనివారు తీర్థస్నానం చేయాలి.
పుష్కర దినాలలో తొమ్మిదో రోజుగానీ, లేదా తమ పెద్దలు మరణించిన తిథి రోజు గానీ పితృ శ్రాద్ధాన్ని నిర్వహించాలి.

పుష్కరాలు వచ్చినపుడు ఆనదిలో స్నానం చేస్తే మూడున్నరకోట్ల తీర్థాలలో స్నానంతో సమానం అన్నమాట. ఇలా పన్నెండు పుణ్యనదులకు పన్నెండేళ్ళకోసారి పుష్కరాలొచ్చే క్రమం ఇదిగో ఈ వరసలో ఏర్పాటయింది.


బృహస్పతి మేషరాశిలో ప్రవేశిస్తే గంగానదీ పుష్కరాలు
వృషభరాశినందు ప్రవేశిస్తే నర్మదానదీ పుష్కరాలు
మిధున రాశిలో గురుడు ఉంటే సరస్వతీ నదికి పుష్కరాలు
బృహస్పతి కర్కటరాశిలో ప్రవేశిస్తే యమునా నదికి పుష్కరాలు
,సింహరాశిలో బృహస్పతి ఉంటే గోదావరికీ నది పుష్కరాలు
కన్యారాశి గురుడు ఉంటే కృష్ణానది పుష్కరాలు
తుల రాశిలో గురుడు ఉంటే కావేరి నదికి పుష్కరాలు
వృశ్చికరాశిలో బృహస్పతి ఉంటే భీమరథీ నదికి పుష్కరాలు
ధనూరాశి నందు పుష్కరనదికి పుష్కరాలు
మకరములో ఉంటే తుంగభద్రానదికి పుష్కరాలు
కుంభ రాశిలో గురుడు ఉంటే సింధునదికి పుష్కరాలు
మీనరాశిలో యందు ప్రణీతానదికి పుష్కరాలు

Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×