God of Different Forms:ఒకరోజు కైలాసంలో విఘ్నేశ్వరుడు ఒక యజ్ఞం చేయాలనుకున్నాడు. అన్ని లోకాలలో ఉన్న దేవతలందరినీ అతిధులుగా ఆహ్వానించాడు. బ్రహ్మ ఇంద్రాదిదేవతలందరూ వస్తామని చెప్పారు. విష్ణువు మాత్రం నేను వేరే కార్యక్రమం వల్ల రాలేను. నా బదులుగా ఎప్పుడూ నా కనుసన్నల్లో ఉండే ఇద్దరిని పంపిస్తాను వారొస్తే నేను వచ్చినట్లే అని ఆహ్వానించవచ్చిన దూతలకు చెప్పి పంపించాడు. విఘ్నేశ్వరుడికి విఘ్నాలు ఏమి ఉంటాయి. యజ్ఞ కార్యక్రమం అఖండంగా ముగిసింది. విఘ్నేశ్వరస్వామి అందరికీ భోజనంచేసిన తరువాతే వెళ్లమని చెప్పి విశ్రాంతి తీసుకోవడం కోసం తన మందిరం లోనికి వెళ్లిపోయాడు.
విష్ణువుకు ప్రతినిధులుగా వచ్చిన భక్తులకు చిక్కు సమస్య ఎదురైంది. ఎందుకంటే వైకుంఠ నివాసులైన వారు ప్రతిదినం విష్ణుదర్శనం చేసుకున్న తర్వాతనే ఆహారం తీసుకుంటారు. అందుకే వారిద్దరూ ఆలోచించుకుని మండపంలో పక్కనే ఉన్నత ఆసనంలో ఆశీనులై కూర్చున్న పార్వతీ పరమేశ్వరుల దగ్గరకు వెళ్లి సవినయంగా మేము ప్రతిరోజూ మా విష్ణుస్వామి దర్శనం చేసిన తరువాతే భోజనం చేయాలన్న నియమం ఉంది. కనుక మేము భోజనం చేయకుండానే వెళ్లడానికి అనుమతి ఇవ్వాలని ప్రార్ధించారు.
శివపార్వతులు ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని చిరునవ్వుతో వారిని చూసి సరే, కానీ మీరు తన మందిరంలో విశ్రాంతిగా పడుకున్న విఘ్నేశ్వరుడి దగ్గరికి వెళ్లి అనుమతి తీసుకుని మరీ వెళ్లండన్నారు. సాక్షాత్తూ శివుడి ఆజ్ఞే కనుక ఇంక మన విష్ణుభక్తులు నెమ్మదిగా విఘ్నేశ్వరుడి మందిరానికి వెళ్లి అక్కడ శయనిస్తున్న విఘ్నేశ్వరుడి రూపం చూసి నిర్విణ్ణులయ్యారు. కారణం ఆ స్థానంలో సాక్షాత్తూ శ్రీమహావిష్ణువు కనిపించాడు. దాంతో వారికి భగవంతుడి తత్వం బోధపడింది. వెంటనే వారిరువురూ మళ్లీ శివపార్వతుల దగ్గరికి వచ్చి చేతులు జోడించి “ మాకు విష్ణు దర్శనం అయింది దేవా, మా అజ్ఞానానికి క్షమించండి. భోజనం చేసే వెళ్తామని సెలవు తీసుకున్నారట.
Wife:భార్యను అద్దెకిచ్చే సంప్రదాయం ఎక్కడుంది
Kedarnath Temple:ఏప్రిల్ లో తెరుచుకోనున్న కేథార్ నాథ్ తలుపులు