E-Paper
Advertisement

Tirumala: తిరుమలలో  పెళ్లి చేసుకుంటే ఎన్ని లాభాలో తెలుసా..? వెంటనే ఆ దర్శనం కూడా చేసుకోవచ్చు

Tirumala: తిరుమలలో  పెళ్లి చేసుకుంటే ఎన్ని లాభాలో తెలుసా..? వెంటనే ఆ దర్శనం కూడా చేసుకోవచ్చు

Tirumala: తిరుమలలో పెళ్లి చేసుకుంటే ఎన్ని లాభాలో తెలుసా.? నూతన వధూవరులకు శ్రీవారు ఇచ్చే కానుకలు ఏంటో తెలుసా..? తిరుమలలో పెళ్లి చేసుకున్న  నవ వధువరూలకు టీటీడీ కల్పించే దర్శనం ఏంటో తెలుసా..? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.

కలియుగ వైకుంఠం తిరుమలలో 2016 ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు దాదాపు 26వేల 500 పెళ్లిళ్లు జరిగాయట. ఈ పెళ్లిళ్లు అన్ని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఆధ్వర్యంలో జరిగాయి. ఇలా తిరుమల కొండ మీద పెళ్ళి చేసుకునే వారికి కళ్యాణమండపంతో పాటు మంగళవాయిద్యం, పెళ్లి సమయంలో పసుపు, కుంకుమ, కంకణంను పురోహితున్ని టీటీడీ ఉచితంగా అందిస్తుంది. వివాహానికి కావాల్సిన ఇతర సామాగ్రిని మాత్రం వధూవరులే తీసుకురావాల్సి ఉంటుంది. వివాహానికి వధూవరుల తల్లిదండ్రులు తప్పనిసరిగా హాజరుకావాల్సి ఉంటుంది. పెళ్లికి రాలేని పక్షంలో అందుకు సంబంధించిన ఆధార పత్రాలను టీటీడీకి  సమర్పించాలి.

ఎలా నమోదు చేసుకోవాలి:

తిరుమలలోని కళ్యాణ వేదికలో ఉచిత వివాహలు చేసుకునేందుకు ఆన్లైన్లో కల్యాణవేదిక స్లాటును బుక్ చేసుకునే సదుపాయాన్ని 2016 మే 9వ తేదీ నుండి టీటీడీ కల్పించింది. ఇందుకోసం https://ttdevasthanams.ap.gov.in వెబ్ సైట్ ను సంప్రదించవచ్చు. అక్కడ ఉన్న కల్యాణవేదిక కాలమ్ లో అబ్బాయి, అమ్మాయి వివరాలను నమోదు చేయాలి. వధూవరులు తప్పనిసరిగా తల్లిదండ్రుల వివరాలను నమోదు చేయడమే కాక ఆధార్ కార్డు వివరాలను నమోదు చేయాలి. వయసు ధృవీకరణ కోసం బర్త్ సర్టిఫికేట్ లేదా పదో తరగతి మార్కుల లిస్టు/ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ లేదా పంచాయతీ కార్యదర్శి/ మున్సిపల్ అధికారులు ధృవీకరించిన బర్త్ సర్టిఫికేట్ నెంబర్ నమోదు చేయాల్సి ఉంటుంది.

వీటితోపాటు అందులో వివాహ తేది, సమయాన్ని వారే నిర్ణయించుకుని అప్లోడ్ చేస్తే అక్నాలెడ్జ్మెంట్ పత్రం జారీ అవుతుంది. కొత్తగా పెళ్లి చేసుకునే వారు ఆ అక్నాలెడ్జ్మెంట్ పత్రాన్ని తీసుకుని వధూవరులు ఇరువురు వారి సంబంధిత MRO (తహసిల్దార్) గారి దగ్గర ఇదే  మొదటి వివాహం (UN MARRIED CERTIFICATE) అని ధృవీకరణ పత్రం తీసుకొని కేవలం 6 గంటల ముందు తిరుమల చేరుకుని కల్యాణ వేదిక వద్ద ఉన్న కార్యాలయంలో సంబందిత MRO (తహసిల్దార్) గారి దగ్గర సంతకం చేసుకొన్న అక్నాలెడ్జ్మెంట్ పత్రాన్ని మరియు అన్ని పత్రాలు (వధూవరులు, తల్లిదండ్రులు ఆధార్ కార్డు, వయసు ధృవీకరణ పత్రం) జిరాక్స్ పత్రాలు అక్కడి సిబ్బందికి ఇచ్చి వారి వివరాలను మరోసారి అక్కడి సిబ్బంది ద్వారా పరిశీలించుకోవాలి.

తప్పని సరిగా హిందువులై ఉండాలి:

ఆన్లైన్లో బుక్ చేసుకునే జంటలు తిరుమలలో ఉచితంగా వివాహం చేసుకొనుటకు తప్పనిసరిగా హిందూ మతస్తులై ఉండాలి. వధువుకు 18 సంవత్సరాలు, వరునికి 21 సంవత్సరాలు నిండి ఉండాలి. ద్వితీయ వివాహములు మరియు ప్రేమ వివాహములు జరుపబడవు. ఇతర వివరాలకు ఫోన్ – 0877- 2263433 సంప్రదించవచ్చు.

వివాహ రిజిస్ట్రేషన్ కొరకు:

తిరుమలలో వివాహం చేసుకున్న నూతన వధూవరులు తమ వివాహన్ని రిజిస్ట్రేషన్ చేసుకొనుటకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హిందూ వివాహ సబ్ రిజిస్ట్రారు వారి కార్యాలయాన్ని కల్యాణ వేదిక వద్ద ఏర్పాటు చేసింది. ఇందుకోసం నూతన వధూవరులు తమ వయస్సు ధృవ పత్రములు, నివాస ధృవ పత్రము, వివాహము ఫోటో, పెండ్లి పత్రిక, కళ్యాణ మండపము రసీదు పత్రాలను, వీటితో పాటు అవివాహితులుగా (అన్ మ్యారీడ్) ఉన్నట్లు స్థానిక ఎమ్మార్వో నుండి ధృవీకరణ పత్రాలను కల్యాణ వేదిక వద్ద అధికారులకు సమర్పించాలి. ఇతర వివరాలకు ఉదయం 10.30 నుండి సాయంత్రం 5 గంటల వరకు కార్యాలయంలో నేరుగా లేదా ఫోన్ 0877 – 2263433 ద్వారా సంప్రదించవచ్చు.

దర్శనం, వసతి ఏర్పాటు:

తిరుమలలో ఉచిత వివాహం చేసుకున్న వధూవరులకు పెళ్లి అయిపోయిన తర్వాత వధూవరులకు వారి తల్లిదండ్రులకు మొత్తంగా ఆరు మందికి 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం ఏటీసీ వద్ద  గల క్యూలైన్‌ నుంచి ఉచితంగా కల్పిస్తారు. తల్లిదండ్రులలో ఎవరైనా మరణించిన ఎడల మిగిలిన వారికి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. దర్శనం తర్వాత మ్యారేజ్ రిసిప్ట్ లో ఎంత మంది ఉంటే అంత మందికి ఉచితంగా లడ్డూలను లడ్డూ కౌంటర్ వద్ద  పొందవచ్చు. తిరుమలలోని కళ్యాణ వేదికలో ఉచిత వివాహలు చేసుకునేవారికి అవకాశాన్ని బట్టి ఒక Rs.50/-రూమ్ CRO/ARP కార్యాలయం వద్ద ఇస్తారు.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: కొత్తగా పెళ్లి చేసుకుంటున్నారా..? తిరుమల శ్రీవారి కానుకల గురించి తెలుసా..?

 

Related News

రథాన్ని విరగ్గొట్టిన లక్ష్మీదేవి! పూరీ జగన్నాథ క్షేత్రంలో.. నేటికీ జరిగే అద్భుతమైన ఆచారం

చార్ ధామ్ యాత్ర.. ఎటు చూసినా భక్తులు, 8 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్

ఆ దేవుడికి చేతులు కాళ్ళు ఎందుకు ఉండవు ?..అసలు రహస్యం ఇదే

Black Thread: ఈ రాశుల వారు కాలికి నల్ల దారం కట్టుకుంటే శని చెడు ప్రభావం తగ్గుతుంది

Anger: కోపాన్ని తగ్గించే రత్నం.. సోమవారంనాడు ధరిస్తే మీ జీవితమే మారిపోతుంది

ప్రసాదంగా లడ్డూ కాదు.. సాక్షాత్తూ ‘డబ్బులే’ ఇస్తారు! ఈ వింత ఆలయం గురించి మీకు తెలుసా?

రావి చెట్టు ఇంట్లో ఉండకూడదని ఎందుకు అంటారు? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు

Vastu tips: ఇలాంటి సీలింగ్ ఫ్యాన్ ఇంట్లోకి పేదరికాన్ని తెస్తుంది.. ఈ 5 తప్పులు చేయకండి

Big Stories

×