Vastu Tips: సనాతన ధర్మంలో వాస్తు శాస్త్రానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. వాస్తు శాస్త్రంలో ఇంటి నిర్మాణం, ఇంట్లోని వస్తువులు ఉంచే స్థానానికి ప్రత్యేక నియమాలు ఉన్నాయి. వాస్తు నియమాల ప్రకారం పనులు చేస్తే.. ఇంట్లో సానుకూల శక్తి ప్రవేశిస్తుందని నమ్ముతారు. కానీ దీనికి విరుద్ధంగా, వాస్తు నియమాలు పాటించకపోతే కుటుంబంలో పేదరికం రావడం ప్రారంభమవుతుంది. వాస్తు ప్రకారం ఇంట్లో ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడని 3 వస్తువుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ 3 వస్తువులను ఇంట్లో ఎప్పుడూ ఖాళీగా ఉంచకండి
వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో ఎప్పుడూ జాడీలను ఖాళీగా ఉంచకూడదు. జాడీలో ఉంచిన పూల మొక్కలు ఎండిపోయినట్లయితే, వెంటనే వాటిని తీసేసి కొత్త మొక్కలను నాటండి. పూలతో నిండిన జాడీలు కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలను పెంచుతాయి. అంతే కాకుండా ఇంట్లో ఉన్న వారు సంతోషండా ఉండేలా చేస్తుంది.
రెండవది స్నానం చేసే నీటి బకెట్‌ను ఎల్లప్పుడూ బాత్‌రూమ్‌లో నీటితో నింపాలి. నీటితో నిండిన బకెట్ సంపద , శ్రేయస్సు యొక్క చిహ్నంగా పరిగణించబడుతుంది. బకెట్ ఖాళీగా ఉంచినట్లయితే, కుటుంబ సభ్యులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు.
పర్సు ఖాళీగా ఉంచడం అంత మంచిది కాదు. మీ వద్ద ఎక్కువ డబ్బు లేకపోయినా, మీ పర్సులో కొంత డబ్బు అయినా సరే ఉంచుకోండి. పర్సులో ఎంత కొంత డబ్బు ఉంటే అది డబ్బును ఆకర్షిస్తుంది. ఖాళీ పర్సు పేదరికాన్ని ఆకర్షిస్తుంది. అందుకే పర్సు ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడదు.
లక్ష్మీ దేవిని సంపదకు దేవతగా చెబుతారు. లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందిన వ్యక్తి లేదా కుటుంబానికి సంపద, ఆనందానికి లోటు ఉండదని చెబుతారు. సనాతన ధర్మాన్ని నమ్మే వ్యక్తులు లక్ష్మీ దేవి అనుగ్రహం లేకపోతే ఎలాంటి వారైనా.. పేదరికాన్ని చూడాల్సిందే అని చెబుతారు. ముఖ్యంగా ఏ పని చేయని వారిపై తల్లి అనుగ్రహం ఉండదని అంటారు. ల
ఈ తప్పులు అస్సలు చేయకూడదు:
1. నోట్ల లెక్కించేటప్పుడు ఉమ్మి ఉపయోగించడం:
నోట్లను లెక్కించేటప్పుడు చాలా మంది ఉమ్మి ఉపయోగించడం చూస్తుంటాం.ఈ అలవాటు చాలా మందిలో కనిపిస్తుంది. కానీ మత గ్రంధాల ప్రకారం, ఇది పూర్తిగా తప్పు. దీని కారణంగా సంపదకు దేవత అయిన లక్ష్మీ దేవత కోపంగా ఉంటుంది. తెలిసో తెలియకో ఎవ్వరూ ఉమ్మివేసి కరెన్సీ నోట్లను లెక్కించకూడదు. నోట్లను లెక్కించేటప్పుడు.. సాధారణ నీటిని మాత్రమే ఉపయోగించండి.
Also Read: 2025లో రాహువు సంచారం.. ఈ 3 రాశుల వారి తలరాతలు మారిపోనున్నాయ్
2. డబ్బు అక్కడక్కడా విసిరేయకండి:
చాలా మంది అలవాటు, బద్ధకం వల్ల డబ్బును ఎక్కడ పడితే అక్కడ వేస్తుంటారు. ఈ అలవాటు అస్సలు మంచిది కాదు. డబ్బును ఎల్లప్పుడూ మీ పర్సులో, భద్రంగా ఉంచుకోండి. లేదంటే ఎల్లప్పుడూ ఒకే ప్రదేశంలో ఉంచడానికి ప్రయత్నించండి.
3. డబ్బుకి సంబంధించిన ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి:
పాత బిల్లులు, టిక్కెట్లు, వేస్ట్ పేపర్లు లేదా ఏదైనా పదునైన వస్తువులను డబ్బు ఉంచే ప్రదేశంలో ఎప్పుడూ ఉంచకూడదు. ఇది ఆర్థిక సంక్షోభానికి దారి తీస్తుంది. దీని వల్ల
డబ్బులు పోగొట్టుకోవడం జరుగుతుంది. రాత్రి పడుకునేటప్పుడు మీ బెడ్ పక్కన డబ్బుతో కూడిన పర్సును ఉంచుకోకండి.